MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/dishadafe3fc4-ddda-4a17-818f-9c68ef899191-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/dishadafe3fc4-ddda-4a17-818f-9c68ef899191-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లోఫర్ అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ మూవీ ద్వారా ఈ బ్యూటీకి అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీ తెలుగులో కంటిన్యూ కాకుండా హిందీ సినీ పరిశ్రమ వైపు ఆసక్తిని చూపించింది. అందులో భాగంగా అనేక హిందీ సినిమాలలో నటించి ప్రస్తుతం బాలీవుడ్ ఇండDisha{#}nag ashwin;vijay kumar naidu;BEAUTY;Prabhas;puri jagannadh;Hindi;Industries;Beautiful;varun tej;India;surya sivakumar;News;Telugu;bollywood;Blockbuster hit;Cinemaదిశా పటాని : పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు.. కానీ బ్యూటీకి దక్కిందేంటి..?దిశా పటాని : పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు.. కానీ బ్యూటీకి దక్కిందేంటి..?Disha{#}nag ashwin;vijay kumar naidu;BEAUTY;Prabhas;puri jagannadh;Hindi;Industries;Beautiful;varun tej;India;surya sivakumar;News;Telugu;bollywood;Blockbuster hit;CinemaFri, 15 Nov 2024 14:10:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లోఫర్ అనే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ మూవీ ద్వారా ఈ బ్యూటీకి అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీ తెలుగులో కంటిన్యూ కాకుండా హిందీ సినీ పరిశ్రమ వైపు ఆసక్తిని చూపించింది. అందులో భాగంగా అనేక హిందీ సినిమాలలో నటించి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటిగా ఈ బ్యూటీ కెరియర్ ను కొనసాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ వస్తుంది. కొంత కాలం క్రితం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ 1000 కోట్లకు పైగా కలెక్షన్ కొల్లగొట్టి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండడం , దానికి కూడా పెద్దగా స్కూప్ లేకపోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇకపోతే తాజాగా సూర్య హీరోగా శి ఆ దర్శకత్వంలో కంగువ అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా నటించింది.

ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందించారు. నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమాకు నెగిటివ్ తక్ వచ్చింది. అలాగే ఈ మూవీ లో కూడా దిశ పాటనీ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు అని , ఆమెకు పెద్ద నిడివి ఉన్న పాత్ర కూడా ఈ సినిమాలో దక్కలేదు అనే వార్తలు వస్తున్నాయి. దానితో పాన్ ఇండియా సినిమాలలో నటించిన దిశ పటానికి పెద్దగా గుర్తింపు రావడం లేదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>