LifeStyleChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/america970845de-df31-4085-8a32-4cf62e821394-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/america970845de-df31-4085-8a32-4cf62e821394-415x250-IndiaHerald.jpgఅమెరికా వెళ్లాలని కలలు కనని భారతీయుడు ఉండరు. వెళ్లే అవకాశం లభించిన వారు ఎన్నో ఆశలతో ఆ గడ్డపై అడుగు పెడుతుంటారు. స్వేచ్ఛకు మారుపేరుగా పేరొందిన అమెరికా ప్రతిభావంతులను ఎప్పుడూ నిరుత్సాహపరచదు. దీంతో కొంతమంది దొడ్డిదారిలోనైనా సరే అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. వారం వ్యవధిలో పరిస్థితి తారుమారైంది. భారత్తో పాటు పలు దేశాలకు చెందిన పౌరులు అమెరికాలో స్థిరపడేందుకు వేచి చూస్తుండగా.. అమెరికన్లలో కొద్దిమంది మాత్రం దేశం వీడి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్టు పలు వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. అమెరికా అధ్america{#}vedhika;Application;Bharateeyudu;Mexico;American Samoa;Donald Trump;Newsట్రంప్ భయం..! అధికారం చేపట్టక ముందే మూట ముల్లె సర్దుకుంటున్న అమెరికన్లు?ట్రంప్ భయం..! అధికారం చేపట్టక ముందే మూట ముల్లె సర్దుకుంటున్న అమెరికన్లు?america{#}vedhika;Application;Bharateeyudu;Mexico;American Samoa;Donald Trump;NewsThu, 14 Nov 2024 14:09:00 GMTఅమెరికా వెళ్లాలని కలలు కనని భారతీయుడు ఉండరు. వెళ్లే అవకాశం లభించిన వారు ఎన్నో ఆశలతో ఆ గడ్డపై అడుగు పెడుతుంటారు. స్వేచ్ఛకు మారుపేరుగా పేరొందిన అమెరికా ప్రతిభావంతులను ఎప్పుడూ నిరుత్సాహపరచదు. దీంతో కొంతమంది దొడ్డిదారిలోనైనా సరే అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. వారం వ్యవధిలో పరిస్థితి తారుమారైంది. భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన పౌరులు అమెరికాలో స్థిరపడేందుకు వేచి చూస్తుండగా.. అమెరికన్లలో కొద్దిమంది మాత్రం దేశం వీడి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్టు పలు వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ గెలిచిన తరువాత ఈ ధోరణి మరింత పెరిగినట్టు తెలుస్తున్నది.


అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే చాలామంది నొమాడ్‌ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. విదేశాల్లో ఉంటూ సొంతదేశంలోని కంపెనీ కోసం పనిచేసేందుకు నొమాడ్‌ వీసా అనుమతిస్తుంది. వీసా గడువు ముగిసేంతవరకూ వీరు విదేశాల్లో ఉంటూ పనిచేసుకోవచ్చు. ఎన్నికల ఫలితాల అనంతరం చాలామంది యూరోప్‌, కెనడా, మెక్సికో వంటి దేశాలకు వలస వెళ్లడం ఎలా అన్నదానిపై గూగుల్‌లో వెతికినట్టు వెల్లడైంది.


తమను తాము స్వేచ్ఛాజీవులుగా చెప్పుకొనే అమెరికన్లు.. ట్రంప్‌ హయాంలో తమపై అణచివేత తప్పదని భావిస్తున్నారు. వలసలను అదుపుచేస్తానని, గర్భస్రావాలను, లింగమార్పిడి శస్త్ర చికిత్సలను అరికడతానన్న ట్రంప్‌ ఎన్నికల వాగ్దానాలపై దేశంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. ట్రంప్‌ విధానాలను వ్యతిరేకించే వారిలోనే ఎక్కువ మంది దేశం విడిచి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్టు న్యూయార్క్‌ టైమ్స్‌, యూఎస్‌ఏ టుడే వంటి సంస్థలు పేర్కొన్నాయి. 2016లో ట్రంప్‌ గెలిచినప్పుడు కూడా ఇదే ధోరణి కనిపించిందని ఆ పత్రికలు గుర్తుచేశాయి.


'నా స్నేహితుల్లో కనీసం 50 శాతం మంది రాజకీయ కారణాలతోనే దేశం వీడి వెళ్లాలనుకుంటున్నారు' అని పోర్చుగల్‌కు వలస వెళ్లిన జస్టిన్‌ నెప్పర్‌ (48) అనే అమెరికన్‌ తెలిపాడు. ట్రంప్‌ విధానాల కారణంగా ఇబ్బందులు తప్పవని భావిస్తున్న చాలామంది దేశం విడిచి వెళ్లిపోవడమే ఉత్తమమని భావిస్తున్నట్టు డైర్‌డ్రే రోనీ అనే మహిళ తెలిపింది. దేశం విడిచి వెళ్లాలనుకుంటున్నవారు తమ అభిప్రాయాలను పంచుకొనేందుకు ఏకంగా ఆర్‌/అమెరెగ్జిట్‌ పేరిట ఒక సామాజిక మాధ్యమాన్ని ప్రారంభించారు. ట్రంప్‌ గెలవగానే ఈ పోర్టల్‌లో పోస్ట్‌లు వెల్లువెత్తాయి. ఈ వేదిక ద్వారా వివిధ దేశాల్లో ఉన్న ఉపాధి అవకాశాల గురించి వారు పరస్పరం సమాచారం అందించుకున్నారు.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లి చేసుకోబోతున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఒకరిది పాక్, మరొకరిది అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>