MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyana762689b-3618-46e8-8d80-d2fd3c6b6fed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyana762689b-3618-46e8-8d80-d2fd3c6b6fed-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో క్రియేట్ చేసిన రికార్డుల గురించి జనాలకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడైతే పవన్ ఏపీ రాజకీయాల్లో తనమునకలై సినిమా ప్రపంచానికి దూరంగా ఉన్నాడు కానీ, ఒక్కసారి సింహం బరిలో దిగిందంటే తట్టుకోవడం కష్టం. జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెర ఇలవేలుపు అని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి అండతో మూవీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన పవన్ ఈ స్థాయికి రావడం వెనుక అతని కృషి, పట్టుదల, యూనిక్ మేనరిజం ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో టాలీవుడ్‌లో మరpawan kalyan{#}karunakaran;lion;Varsham;Pawan Kalyan;Girl;kalyan;Chiranjeevi;Cinema;Tollywood;Heroine;Andhra Pradeshప‌వ‌న్ కళ్యాణ్ సెన్షేష‌న‌ల్ రికార్డుల లెక్క తెలిస్తే బిత్తరబోతారు.. అందుకే అంత ఫాలోయింగ్ మరి!ప‌వ‌న్ కళ్యాణ్ సెన్షేష‌న‌ల్ రికార్డుల లెక్క తెలిస్తే బిత్తరబోతారు.. అందుకే అంత ఫాలోయింగ్ మరి!pawan kalyan{#}karunakaran;lion;Varsham;Pawan Kalyan;Girl;kalyan;Chiranjeevi;Cinema;Tollywood;Heroine;Andhra PradeshThu, 14 Nov 2024 13:31:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో క్రియేట్ చేసిన రికార్డుల గురించి జనాలకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడైతే పవన్ ఏపీ రాజకీయాల్లో తనమునకలై సినిమా ప్రపంచానికి దూరంగా ఉన్నాడు కానీ, ఒక్కసారి సింహం బరిలో దిగిందంటే తట్టుకోవడం కష్టం. జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెర ఇలవేలుపు అని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి అండతో మూవీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన పవన్ ఈ స్థాయికి రావడం వెనుక అతని కృషి, పట్టుదల, యూనిక్ మేనరిజం ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో టాలీవుడ్‌లో మరే ఇతర హీరోకి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ సొంతం అని చెప్పుకోవచ్చు.

ఇక అసలు విషయంలోకి వెళితే, కెరీర్ తొలినాళ్లలోనే పవన్ చాలా విభిన్నమైన సినిమాలు చేస్తూ వచ్చాడు. అలా ఆయన 1996లో చేసిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో పవన్ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత పవన్ వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. తరువాత చేసిన 6 సినిమాలు బ్యాక్-టు-బ్యాక్ హిట్స్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా అవతరించాడు. ఈ క్రమంలో దాదాపు రెండు జనరేషన్లు పవన్‌కు వీరాభిమానులు అయ్యారు. ఆ సినిమాలతో పవన్ డబుల్ హ్యాట్రిక్ కొట్టి ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

పవన్ కళ్యాణ్ తన ఫస్ట్ సినిమా తర్వాత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 'గోకులంలో సీత' మూవీ చేయగా ఇందులో హీరోయిన్ రాశి పవన్‌తో జత కట్టింది. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. ఆ తరువాత 1998లో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన 'సుస్వాగతం' సినిమా కూడా హిట్. ఇక ఈ సినిమా తరువాత వచ్చిన 'తొలిప్రేమ' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ని మలుపుతిప్పింది. కరుణాకరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో పవన్ స్టార్‌డమ్‌ వేరే రేంజ్‌కి వెళ్ళిపోయింది. ఈ సినిమాలోని 'ఈ మనసే సే' పాట ఇప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా 21 కేంద్రాలలో 100 రోజులు, 2 సెంటర్లలో 200 రోజులకు పైగా నడిచి అప్పట్లో నిర్మాతలకు కనక వర్షం కురిపించింది. ఈ క్రమంలో 6 నంది అవార్డులు, ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ (తెలుగు) జాతీయ అవార్డు కూడా గెలిచింది. అయితే ఈ విషయం చాలా కొద్ది మందికి తెలుసు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లి చేసుకోబోతున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఒకరిది పాక్, మరొకరిది అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>