MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyac8043bea-70a6-4461-af07-80e1b6534321-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyac8043bea-70a6-4461-af07-80e1b6534321-415x250-IndiaHerald.jpgఅలాంటి నటసార్వభౌముడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే భావంతో ఆయన బ్రతికి ఉన్నన్ని రోజులు ఇప్పుడు తన హద్దులు మీరి ఎవరిని బాధపెట‌లేదు తాను ఎలా గౌరవంగా జీవించారో, తన పిల్లలకు కూడా అవే నేర్పించారని ఎప్పుడు వారిని చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఎన్టీఆర్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణకు సినిమాల్లో అడుగుపెట్టే సమయంలో ఎన్టీఆర్ ఆయనకు మూడు కండిషన్లు పెట్టారట. ఎన్టీఆర్ పెట్టిన కండిషన్ ఏమిటి ఆయన ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం. BALAYYA{#}bhanumathi old;kodi ramakrishna;Balakrishna;Car;NTR;Film Industry;Father;Tamil;Cinemaబాలయ్య మంగమ్మ గారి మనవడు సినిమా కోసం.. నటరత్న ఎన్టీఆర్ పెట్టిన మూడు కండిషన్లు ఇవే..!బాలయ్య మంగమ్మ గారి మనవడు సినిమా కోసం.. నటరత్న ఎన్టీఆర్ పెట్టిన మూడు కండిషన్లు ఇవే..!BALAYYA{#}bhanumathi old;kodi ramakrishna;Balakrishna;Car;NTR;Film Industry;Father;Tamil;CinemaThu, 14 Nov 2024 16:43:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.. దానికి ముఖ్య కారణం నటరత్న ఎన్టీఆర్ అనే చెప్పాలి. అలాంటి  నటసార్వభౌముడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే భావంతో ఆయన బ్రతికి ఉన్నన్ని రోజులు ఇప్పుడు తన హద్దులు మీరి ఎవరిని బాధపెట‌లేదు తాను ఎలా గౌరవంగా జీవించారో, తన పిల్లలకు కూడా అవే నేర్పించారని ఎప్పుడు వారిని చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఎన్టీఆర్ నట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణకు సినిమాల్లో అడుగుపెట్టే సమయంలో ఎన్టీఆర్ ఆయనకు మూడు కండిషన్లు పెట్టారట. ఎన్టీఆర్ పెట్టిన కండిషన్ ఏమిటి ఆయన ఎందుకు పెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం.


బాలయ్య సోలో హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మంగమ్మగారి మనవడు సినిమా వెనక  ఎవరికీ తెలియని ఓ ఇంట్రెస్టింగ్ క‌థ ఉంది. ఇక ఈ సినిమాను భార్గవ్ ఆర్ట్స్ ఎస్. గోపాలరెడ్డి, కోడి రామకృష్ణ ఇద్దరు కలిసి మనువాస అనే తమిళ మూవీకి రీమేక్‌గా తెలుగులో చేయాలని భావించారు. ఇందులో బాలకృష్ణ హీరో అయితే బాగుంటుందని అనుకున్నారు .. ఆ సమయంలో బాలయ్యతో సినిమా అంటే ఎన్టీఆర్ కి కథ చెప్పాలి స్టోరీ చెప్పి ఆయనకు నచ్చేలా చేయటం వీరి తరం కాదు.. ఇక ఆ సమయంలో బాలకృష్ణకు స్వయంగా కథ చెప్పడంతో అది ఆయనకు నచ్చడంతో ఎన్టీఆర్ ని కూడా కథను వినమని అడిగారట.


ఇక త‌ర్వాత‌ బాలయ్యతో కలిసి ఎన్టీఆర్ కూడా  క‌థ విని సినిమాలో భామ్మ‌ పాత్రను పెంచి భానుమతి గారితో ఆ రోల్ చేయిస్తే సినిమా హిట్ అవుతుందని సలహా కూడా ఇచ్చారట అన్నగారు . అయితే ముందుగా ఈ సినిమాలో నటించడానికి భానుమతి ఒప్పుకోలేదట. ఎన్టీఆర్ ఫోన్ చేసి ఒప్పించారట అయితే సినిమా మొదలయ్యే సమయంలో ఎన్టీఆర్ , బాలకృష్ణకు మూడు కండిషన్లో పెట్టారట. 1.ఇందులో మొదటిది భానుమతి షూటింగ్ స్పాట్ కు రావడానికి అరగంట ముందే నువ్వు అక్కడ ఉండాలని అన్నారట .. 2. అలాగే ఆమె షూటింగ్ స్పాట్ కు రాగానే ఆమె కారు దగ్గరికి వెళ్లి డోరు తీయాలని చెప్పారట. 3. అలాగే భానుమతి కిందకు దిగగానే కాళ్లకు నమస్కారం చేయాలని ఎన్టీఆర్ బాలకృష్ణ కు ఈ మూడు కండిషన్స్ పెట్టారట .. తన నాన్న మాట ప్రకారమే బాలయ్య సినిమా పూర్తయ్యే వరకు అలానే చేస్తూ వచ్చారట , ఓ రోజు బానుమతి ఇలా చేయమని మీ నాన్న గారు చెప్పారా, పెద్దలను గౌరవించే లక్షణం నీకు ఉంది పైకి వస్తావ్ అని దీవించారట. దీంతో మంగమ్మగారి మనవడు సినిమా సూపర్ హిట్ అయింది .. బాలకృష్ణ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది ..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సాయి పల్లవి ఆస్తుల విలువ అంతేనా.. అలాంటి సినిమాలు చేయకపోవడం వల్లే ఇంత తక్కువ సంపాదించిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>