MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/will-suriya-delay-kanguva-for-varun-tej0c6986da-a8bc-4d3e-8b57-7edf09c0078e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/will-suriya-delay-kanguva-for-varun-tej0c6986da-a8bc-4d3e-8b57-7edf09c0078e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో వరుణ్ తేజ్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2, ఎఫ్3, గద్దలకొండ గణేష్ సినిమాలు వరుణ్ తేజ్ కు భారీ విజయాలను అందించాయి. వరుణ్ తేజ్ తొలి సినిమా ముకుంద సైతం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. కంచె సినిమాతో కమర్షియల్ ఫలితం ఎలా ఉన్నా మంచి నటుడిగా మార్కులు సంపాదించుకున్నారు. అయితే వరుణ్ సినీ కెరీర్ ను పరిశీలిస్తే గద్దలకొండ గణేష్ మినహా మిగతా సందర్భాల్లో క్లాస్ సినిమాలే విజయాలను అందించాయి. varun tej{#}Gaddalakonda Ganesh;varun sandesh;Chiranjeevi;Telugu;varun tej;Hero;Cinema;Success;Indiaవరుణ్ హిట్ సినిమాల్లో ఇది గమనించారా.. అలా కనిపిస్తే మాత్రమే సినిమా హిట్!వరుణ్ హిట్ సినిమాల్లో ఇది గమనించారా.. అలా కనిపిస్తే మాత్రమే సినిమా హిట్!varun tej{#}Gaddalakonda Ganesh;varun sandesh;Chiranjeevi;Telugu;varun tej;Hero;Cinema;Success;IndiaThu, 14 Nov 2024 19:55:00 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుణ్ తేజ్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2, ఎఫ్3, గద్దలకొండ గణేష్ సినిమాలు వరుణ్ తేజ్ కు భారీ విజయాలను అందించాయి. వరుణ్ తేజ్ తొలి సినిమా ముకుంద సైతం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. కంచె సినిమాతో కమర్షియల్ ఫలితం ఎలా ఉన్నా మంచి నటుడిగా మార్కులు సంపాదించుకున్నారు. అయితే వరుణ్ సినీ కెరీర్ ను పరిశీలిస్తే గద్దలకొండ గణేష్ మినహా మిగతా సందర్భాల్లో క్లాస్ సినిమాలే విజయాలను అందించాయి.
 
అయితే మరీ పూర్తిస్థాయి క్లాస్ కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల నేటివిటీకి అనుగుణంగా కథలను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య భారీగానే ఉంది. అయితే కెరీర్ పరంగా వరుణ్ తేజ్ తప్పటడుగులు మాత్రం కొనసాగుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ తర్వాత ప్రాజెక్ట్స్ గురించి స్పష్టత రావాల్సి ఉంది.
 
మరో స్టార్ హీరో శర్వానంద్ సైతం ప్రస్తుతం ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. వరుణ్ తేజ్ కు కథల విషయంలో చిరంజీవి సపోర్ట్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది. మెగాస్టార్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండగా చిరంజీవి ప్రాజెక్ట్ లపై అంచనాలు పెరుగుతున్నాయి.
 
మెగా హీరోలకు ఈ మధ్య కాలంలో సక్సెస్ రేట్ కొంతమేర తగ్గుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మెగా హీరోలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాల్సిన తరుణంలో వరుస ఫ్లాపుల వల్ల విమర్శలను మూట గట్టుకుంటున్నారు. మెగా హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. మెగా హీరోల రెమ్యునరేషన్లు మాత్రం ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయి. వరుణ్ తేజ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకోవాలని అభిమానులు ఫీలవుతుండటం గమనార్హం.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నందమూరి హీరోల మల్టీస్టారర్ చిత్రాలకు అడ్డుగా ఉంది ఎవరు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>