MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgమహేష్ మేనల్లుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన అశోక్ గల్లా తన మొదటి సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో తన రెండవ సినిమా విషయంలో చాల గ్యాప్ తీసుకున్నాడు. ‘హనుమాన్’ మూవీ లాంటి బ్లాక్ బష్టర్ హిట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఆకథను నమ్ముకుని నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ మూవీలో నటిస్తున్నాడు. వాస్తవానికి ఈ మూవీని సూర్య ‘కంగువ’ వరుణ్ తేజ్ ‘మట్క’ తో పోటీపడుతూ విడుదల చేయాలని నిన్న మొన్నటివరకు భావించారు. అయితే ఇంత పోటీ మధ్య తమ సినిమా బాగున్నప్పటికీ జనం పట్టించుకోరు అన్న ఆలోచనలతో ఇASOK GALLA{#}ashok;Lakshmi Devi;ashok galla;Chakram;prasanth varma;surya sivakumar;rana daggubati;varun tej;November;Cinemaమురారి పై ఆశలు పెట్టుకున్న అశోక్ గల్లా !మురారి పై ఆశలు పెట్టుకున్న అశోక్ గల్లా !ASOK GALLA{#}ashok;Lakshmi Devi;ashok galla;Chakram;prasanth varma;surya sivakumar;rana daggubati;varun tej;November;CinemaThu, 14 Nov 2024 14:02:00 GMTమహేష్ మేనల్లుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన అశోక్ గల్లా తన మొదటి సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో తన రెండవ సినిమా విషయంలో చాల గ్యాప్ తీసుకున్నాడు. ‘హనుమాన్’ మూవీ లాంటి బ్లాక్ బష్టర్ హిట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఆకథను నమ్ముకుని నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ మూవీలో నటిస్తున్నాడు.



వాస్తవానికి ఈ మూవీని సూర్య ‘కంగువ’ వరుణ్ తేజ్ ‘మట్క’ తో పోటీపడుతూ విడుదల చేయాలని నిన్న మొన్నటివరకు భావించారు. అయితే ఇంత పోటీ మధ్య తమ సినిమా బాగున్నప్పటికీ జనం పట్టించుకోరు అన్న ఆలోచనలతో ఇప్పుడు ఈ మూవీని నవంబర్ 22కు వాయిదా వేశారు. ఈ మూవీ ట్రైలర్ ను రానా లేటెస్ట్ గా లాంచ్ చేశాడు. తల్లి గారాబంతో పెరిగిన ఒక యువకుడి పాత్రలో అశోక్ కనిపించబోతున్నాడు.



జాతకం ప్రకారం ఫలానా సంవత్సరంలో గండం ఉందని జ్యోతిష్యుడు చెప్పడంతో పాటు ఇతడి పుట్టుక వల్ల అతడి కుటుంబ శత్రువు ప్రాణం పోయే ప్రమాదం ఉందని ఒక స్వామీజీ చెప్పడంతోపాటు సుదర్శన చక్రం ఉన్న కృష్ణుడి విగ్రహం ఉన్న ఊరిలో ఈకథ అల్లబడటం చూసిన వారికీ గతంలో విడుదలైన మహేష్ ‘మురారి’ గుర్తుకు వచ్చి తీరుతుంది. కంసుడి లాంటి తన మేనమామ నుండి తనను తాను రక్షించుకుంటూ తన కుటుంబాన్ని ఎలా పరిరక్షిమహుకున్నాడు ఈ ట్రైలర్ చూసిన వారికి అర్థం అవుతుంది.



ఈ ట్రైలర్ చూసిన వారికి వెంటనే దాదాపు 15 సంవత్సరాల క్రితం విడుదలైన మహేష్ ‘మురారి సినిమా గుర్తుకు వచ్చి తీరుతుంది. ‘మురారి’ మూవీలో మహేష్ తల్లి పాత్రను పోషించిన లక్ష్మీ గారాబం అలనాటి ప్రేక్షకులకు కనెక్ట్ అయిన నేపధ్యంలో ఈనాటితరం ప్రేక్షకులకు తల్లి విపరీతంగా కొడుకును గారాబం చేసే పాయింట్ చుట్టూ అల్లబడిన ఈమూవీ సక్సస్ అయితే అశోక్ కు మరికొన్ని సినిమా అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పెళ్లి చేసుకోబోతున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఒకరిది పాక్, మరొకరిది అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>