MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-2-9af48a27-488b-4ab5-8e93-e9819ab14abd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-2-9af48a27-488b-4ab5-8e93-e9819ab14abd-415x250-IndiaHerald.jpg పుష్ప లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వల్ గా వస్తున్న పుష్ప 2 సినిమాపై దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో మామూలు అంచనాలు లేవు. . ఎంతో మంది ఈ సినిమా కోసం ... ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తనదైన మార్క్ తో తెరకెక్కించగా , ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అంచనాలు పిక్స్ కి చేరుకున్నాయి. పుష్ప 2 సినిమా వాస్తవానికి డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఒకరోజు ముందుకు జరిపి డిసెంబర్ 5న ఈ సినిమాను వరల్డ్ వైడ్Puspa 2 {#}sukumar;media;December;sandeep;News;Allu Arjun;Audience;Blockbuster hit;Darsakudu;Director;Tollywood;Cinema;India' పుష్ప 2 ' ర‌న్ టైం లెక్క తేలింది... సుక్కు చాలా పెద్ద రిస్క్ ఇది..!' పుష్ప 2 ' ర‌న్ టైం లెక్క తేలింది... సుక్కు చాలా పెద్ద రిస్క్ ఇది..!Puspa 2 {#}sukumar;media;December;sandeep;News;Allu Arjun;Audience;Blockbuster hit;Darsakudu;Director;Tollywood;Cinema;IndiaWed, 13 Nov 2024 12:25:00 GMT- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ప్రాజెక్టు పుష్ప 2. పుష్ప లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వల్ గా వస్తున్న పుష్ప 2 సినిమాపై దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో మామూలు అంచనాలు లేవు. . ఎంతో మంది ఈ సినిమా కోసం ... ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తనదైన మార్క్ తో తెరకెక్కించగా , ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అంచనాలు పిక్స్ కి చేరుకున్నాయి. పుష్ప 2 సినిమా వాస్తవానికి డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఒకరోజు ముందుకు జరిపి డిసెంబర్ 5న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.


ఈ క్రమంలోనే పుష్ప 2 ప్రమోషన్లు షురూ చేశారు మేకర్స్. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. పుష్ప 2 కి సంబంధించి ఓ ఇంటరెస్టింగ్ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన రన్ టైం మొత్తం మూడుంబావు గంటలు ఉంటుందని తెలుస్తోంది. దీనికి తోడు మరో రెండు పాటలు.. కొంత ప్యాచ్ వర్క్ కూడా యాడ్ చేయాల్సి ఉందట. దీంతో ఈ సినిమా టోటల్ రెంట్ టైం మూడున్న‌ర‌ గంటలు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మూడున్నర గంటలు అంటే మొత్తం 210 నిమిషాలు సినిమా ఉంటుంది. ఇంత పెద్ద రన్ టైమ్తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి.


మరి ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా సినిమాలు భారీ ర‌న్‌ టైం తో వచ్చే ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టే దమ్ము కథలో ఉంటే రన్ టైం ఎక్కువైనా ప్రేక్షకులు సినిమాను చూసి ఎందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక సుకుమార్‌ నుంచి వచ్చే సినిమాలు అన్నీ కూడా దాదాపు మూడు గంటల ర‌న్ టైంతోనే ఉంటాయి. కథ‌లో దమ్ము ఉంటే 210 నిమిషాల రన్ టైం పెద్ద ప్రాబ్లం కాదని అభిమానులు అంటున్నారు. అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి సుకుమార్సినిమా రన్ టైం కొంతమేర ట్రిమ్ చేస్తే బాగుంటుందని.. రన్ టైం మూడు గంటలకు అటు ఇటుగా ఉంటే బాగుంటుందని సినీ ప్రేమికులు కోరుతున్నారు. ఏది ఏమైనా పుష్ప 2 మానియాతో సోషల్ మీడియా అయితే షేక్ అయిపోతుందని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాజ‌మౌళి - మ‌హేష్‌బాబు కాశీ బ్యాక్‌డ్రాప్ ఫిక్స్‌... శివుడికి హీరోతో లింక్ ఏంటి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>