LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/happens--cold-water-bath--coold37d07ef6-f673-42e5-9689-485439a32e80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/happens--cold-water-bath--coold37d07ef6-f673-42e5-9689-485439a32e80-415x250-IndiaHerald.jpgచల్లటి నీళ్లతో స్నానం చేయాలంటే కొంతమంది భయపడుతూ ఉంటారు. కొంతమందికి శుభ్రంగా స్నానం చేయాలని ఉంటుంది. మరి కొంతమందికి మాత్రం ఎన్ని రోజులు ఉన్నా కానీ స్నానం చేయాలని అనిపించదు. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రతి రోజు స్నానం చేయటం అవసరం. స్నానం చేయటం వల్ల శరీరంపై ఉన్న బ్యాక్టీరియా, వైరస్, మురికి తొలగిపోతుంది. అయితే, చాలామంది ఆరోగ్యపరంగా, సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ వేడి నీటితో స్నానం చేస్తుంటారు. మరి కొందరు చలికాలంలో కూడా చల్లటి నీటితో స్నానం చేస్తారు. చాలామంది శీతాకాలంలో చల్లటి నీటితో స్నాhappens ; cold water; bath ; coold{#}Aquaచల్లటి నీటితో స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..?చల్లటి నీటితో స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..?happens ; cold water; bath ; coold{#}AquaWed, 13 Nov 2024 10:18:00 GMTచల్లటి నీళ్లతో స్నానం చేయాలంటే కొంతమంది భయపడుతూ ఉంటారు. కొంతమందికి శుభ్రంగా స్నానం చేయాలని ఉంటుంది. మరి కొంతమందికి మాత్రం ఎన్ని రోజులు ఉన్నా కానీ స్నానం చేయాలని అనిపించదు. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రతి రోజు స్నానం చేయటం అవసరం. స్నానం చేయటం వల్ల శరీరంపై ఉన్న బ్యాక్టీరియా, వైరస్, మురికి తొలగిపోతుంది. అయితే, చాలామంది ఆరోగ్యపరంగా, సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ వేడి నీటితో స్నానం చేస్తుంటారు.

మరి కొందరు చలికాలంలో కూడా చల్లటి నీటితో స్నానం చేస్తారు. చాలామంది శీతాకాలంలో చల్లటి నీటితో స్నానం చేయాలంటే వణికిపోతారు. అయితే, వేడి నీటి కంటే చల్లని నీటితో స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. చన్నీటి స్నానం చేయటం వల్ల ఏం జరుగుద్దో ఇప్పుడు తెలుసుకోండి. శీతాకాలంలో చల్లని నీటితో స్నానం చేయాలంటే చాలామంది భయపడుతుంటారు. కానీ, ఇలా చేయటం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. బాడీలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో, రోగ నిరోధక కణాలు మెరుగ్గా పనిచేస్తాయి.

అంతేకాకుండా దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. చల్ల నీళ్లు మానసిక స్థితిని మెరుగు పరచడానికి సహాయపడతాయి. శరీరంలో డోపామైన్, సరోటోనిన్ స్థాయిలను చురుగ్గా ఉండేలా చేస్తుంది. దీనివల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గిపోతుంది. ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. కండరాల నొప్పులు ఉన్నవారు సాధారణంగా హాట్ వాటర్ తో స్నానం చేస్తుంటారు. కానీ, వేడి నీటి కంటే కోల్డ్ వాటర్ కండరాల నొప్పుల నుంచి మంచి రిలీఫ్ ఇస్తుంది. వేడి నీళ్ల కంటే చల్ల నీళ్లతో స్నానం చేయటం వల్ల జుట్టు నుంచి అదనపు నూనె, దుమ్ము వంటివి తొలిగిపోతాయి. అంతేకాకుండా ఇది చర్మాన్ని పొడిబారకుండా చేయడానికి సహాయపడుతుంది. జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైసీపీలో ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు కొత్త ఇన్‌చార్జ్‌లు వ‌స్తారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>