Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ameesha-pateld15a7a26-e871-4a27-b819-df27e02b7b0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ameesha-pateld15a7a26-e871-4a27-b819-df27e02b7b0a-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ హాట్ బ్యూటీ అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో అమీషా హీరోయిన్ గా నటించింది.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.. ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరోల అందరిసరసన నటించి మెప్పించింది.. ఈ భామ గ్లామర్ కి యాక్టింగ్ టాలెంట్ బాలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ కూడా ఫిదా అయింది.. టాలీవుడ్ లో ఈ భామ చాలా సినిమాల్లో నటించింది.. టాలీవుడ్ లో ఈ భామ నటించిన మొదటి మూవీ ‘బద్రి’ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగ#ameesha patel{#}BEAUTY;Nani;Ameesha Patel;bhama;dasari narayana rao;surya sivakumar;Sardar Vallabhai Patel;Badri;Tollywood;Pawan Kalyan;Blockbuster hit;Fidaa;Heroine;bollywood;Hero;Director;Cinemaఅమీషా పటేల్ : తెలుగులో చేసింది నాలుగు సినిమాలే.. కానీ క్రేజ్ మాత్రం వేరే లెవెల్..!!అమీషా పటేల్ : తెలుగులో చేసింది నాలుగు సినిమాలే.. కానీ క్రేజ్ మాత్రం వేరే లెవెల్..!!#ameesha patel{#}BEAUTY;Nani;Ameesha Patel;bhama;dasari narayana rao;surya sivakumar;Sardar Vallabhai Patel;Badri;Tollywood;Pawan Kalyan;Blockbuster hit;Fidaa;Heroine;bollywood;Hero;Director;CinemaTue, 12 Nov 2024 09:37:45 GMT
బాలీవుడ్ హాట్ బ్యూటీ అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో అమీషా హీరోయిన్ గా నటించింది.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.. ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది.. ఈ భామ గ్లామర్ కి, యాక్టింగ్ టాలెంట్ కి  బాలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ కూడా ఫిదా అయింది.. టాలీవుడ్ లో ఈ భామ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. టాలీవుడ్ లో ఈ భామ నటించిన మొదటి మూవీ ‘బద్రి’.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాలో అమీషా ‘సరయు’ అనే పాత్రలో తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది.. బద్రి సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమా తరువాత అమీషాకు వరుస ఆఫర్స్ వచ్చాయి..కానీ బాలీవుడ్ లో ఈ భామ బాగా బిజీ అయిపోయింది..

 2004 లో మహేష్, ఎస్.జె. సూర్య కాంబినేషన్ లో వచ్చిన నాని మూవీలో హీరోయిన్ గా అమీషా టాలీవుడ్ లో మళ్ళీ నటించింది..కానీ ఆ సినిమా ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేదు.. కానీ టాలీవుడ్ డైరెక్టర్స్ ఈ అమ్మడి గ్లామర్ కి ఫిదా అయ్యారు.. నాని మూవీ తరువాత అమీషా పటేల్ ఎన్టీఆర్ హీరోగా బి. గోపాల్ తెరకెక్కించిన నరసింహుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది.. అయితే ఆ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది..దీనితో అమీషాకు తెలుగులో ఆఫర్స్ రాలేదు.. అమీషా మళ్ళీ బాలీవుడ్ లో బిజీ అయింది.. మరో ఆరేళ్లకు అంటే 2011 లో బాలకృష్ణ, దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన “ పరమ వీరచక్ర “ సినిమాలో అమీషా హీరోయిన్ గా నటించింది.. అయితే ఆ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో అమీషా పటేల్ తెలుగులో కనిపించడమే మానేసింది.. తెలుగులో ఒక్క పవన్ కల్యాణ్ మూవీ తప్ప ఏ స్టార్ హీరో మూవీ కలిసి రాలేదు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అక్కడ 15 రోజుల ముందే పుష్ప రాంపేజ్.. అసలు విషయం అదే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>