Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupam63e32f23-3130-4994-99f8-57430bcae370-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupam63e32f23-3130-4994-99f8-57430bcae370-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న అనుపమ్ కేర్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన ఆయన.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు అని చెప్పాలి. ఇక ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటారు. అందుకే ఇక ఆయన ఏ పాత్రలో నటించినా ఆ సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుంది అని ప్రేక్షకులు కూడా నమ్ముతూ ఉంటారు అని చెప్పాలి. ఇక అలాంటి పాత్రలను ఎంచుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పుడు ఆయనకు ఉన్న డిమాండ్ దృశ్య ఏ సినిమాలanupam{#}Father;Audience;House;Manam;Cinemaవందల కోట్ల ఆస్తి.. అయినా అద్దె ఇంట్లోనే స్టార్ నటుడు.. ఎందుకో తెలుసా?వందల కోట్ల ఆస్తి.. అయినా అద్దె ఇంట్లోనే స్టార్ నటుడు.. ఎందుకో తెలుసా?anupam{#}Father;Audience;House;Manam;CinemaTue, 12 Nov 2024 10:30:00 GMTబాలీవుడ్ లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న అనుపమ్ కేర్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన ఆయన.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు అని చెప్పాలి. ఇక ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటారు. అందుకే ఇక ఆయన ఏ పాత్రలో నటించినా ఆ సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుంది అని ప్రేక్షకులు కూడా నమ్ముతూ ఉంటారు అని చెప్పాలి. ఇక అలాంటి పాత్రలను ఎంచుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పుడు ఆయనకు ఉన్న డిమాండ్ దృశ్య ఏ సినిమాలో నటించిన కోట్ల రూపాయల పారితోషకం అందుకుంటారు అనుపమ కేర్.


 అయితే సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఇలా కోట్ల రూపాయల పారితోషకం అందుకుంటున్న నటీనటులు.. లగ్జరీ లైఫ్ని గడపడం చూస్తూ ఉంటాం. తమ అభిరుచులకు అనుగుణంగా కొత్త ఇంటిని నిర్మించుకుని ఇక అందులోనే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కానీ ఇలా కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటూ అద్దె ఇంట్లో ఉండడం గురించి ఎప్పుడైనా విన్నారా. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుపమ్ కేర్ మాత్రం వందల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నారట.


 ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ్ కేర్ ఇప్పటికి తనకు సొంత ఇల్లు లేకపోవడానికి గల కారణం ఏంటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన ఒక అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంతంగా ఇల్లు కొనకూడదని ఫిక్స్ అయ్యాను. అందుకే ఇప్పటికి కూడా అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. అయితే ఎవరి కోసం ఇల్లు కొనాలి. ఆ ఇంటికి ఖర్చు పెట్టే డబ్బుని ప్రతినెలా బ్యాంకులో దాచుకొని కొంత డబ్బుతో ప్రతినెల అద్దకడితే సరిపోతుంది కదా. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఆస్తుల పంపకంలో పిల్లల మధ్య గొడవలు రావచ్చు. అందుకే ఆస్తులు కొనే డబ్బుని దాచిపెట్టి దానినే సమంగా పంచితే సరిపోతుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను కెరియర్ పరంగా పిక్స్ లో ఉన్న సమయంలోనే తనకోసం ఒక ఇల్లు కొనమని మా అమ్మ కోరింది. ఆమెకు సిమ్లాలో ఒక ఇల్లు కొనిచ్చాను. నాన్న ఉన్నప్పుడు మేము అక్కడే ఉండే వాళ్ళం. ఆయన చనిపోయిన తర్వాత మేము సిమ్లాలో ఉన్నది తక్కువే. అందుకే ఆమె అక్కడ ఇల్లు కావాలని కోరింది కొనిచ్చా అంటూ అనుపమ్ కేర్ చెప్పుకొచ్చాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అక్కడ 15 రోజుల ముందే పుష్ప రాంపేజ్.. అసలు విషయం అదే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>