Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-b42e7514-197b-4958-8a70-72180bc232ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-b42e7514-197b-4958-8a70-72180bc232ae-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా కొనసాగుతున్న బిగ్ బాస్ కార్యక్రమం అంతకంతకు ఎంతో ఆసక్తికరంగా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. మొదట్లో ఎవరికి తెలియని కంటెస్టెంట్స్ రావడంతో రేటింగ్ రాలేదు. దీంతో ఇక మాజీ కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించారు బిగ్బాస్ నిర్వాహకులు. వారి రాకతో బిగ్ బాస్ హౌస్ లో ఆట మరింత ఆసక్తికరంగా మారిపోయింది. ఎప్పటిలాగానే బిగ్ బాస్ పెట్టే టాస్కులు ఇక వారాంతంలో ఎలిమినేషన్ కొనసాగుతూ వస్తోంది అని చెప్పాలి. అయితే ఇటీవల గత వారంలో ఊహించిన విధంగా ఏbigboss {#}Hari Teja;Bigboss;House;sundayహరితేజ ఎలిమినేటెడ్.. 5 వారాలకు ఎంత పారితోషకం తీసుకుందో తెలుసా?హరితేజ ఎలిమినేటెడ్.. 5 వారాలకు ఎంత పారితోషకం తీసుకుందో తెలుసా?bigboss {#}Hari Teja;Bigboss;House;sundayMon, 11 Nov 2024 13:15:00 GMTతెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా కొనసాగుతున్న బిగ్ బాస్ కార్యక్రమం అంతకంతకు ఎంతో ఆసక్తికరంగా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. మొదట్లో ఎవరికి తెలియని కంటెస్టెంట్స్ రావడంతో రేటింగ్ రాలేదు. దీంతో ఇక మాజీ కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించారు బిగ్బాస్ నిర్వాహకులు. వారి రాకతో బిగ్ బాస్ హౌస్ లో ఆట మరింత ఆసక్తికరంగా మారిపోయింది. ఎప్పటిలాగానే బిగ్ బాస్ పెట్టే టాస్కులు ఇక వారాంతంలో ఎలిమినేషన్ కొనసాగుతూ వస్తోంది అని చెప్పాలి.


 అయితే ఇటీవల గత వారంలో ఊహించిన విధంగా ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటికి వెళ్లారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ అనారోగ్య కారణాల ద్వారా హౌస్ నుంచి బయటికి వెళ్లారు. ఇక ఆ తర్వాత ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం ఆదివారం రోజున హరితేజ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎన్నో అంచనాల మధ్య హౌస్ లోకి అడుగుపెట్టిన హరితేజ.. తన ఆట తీరుతో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో కొన్నాళ్లపాటు ఆమెకు మద్దతుగా నిలిచిన అభిమానులు  చివరికి ఎలిమినేట్ చేసేసారు.


 అయితే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన హరితేజ ఎంత పారితోషకం తీసుకుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం హౌస్ లో టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న నిఖిల్ కంటే హరితేజకు ఎక్కువగానే పారితోషకం అందిందట. నిఖిల్ వారానికి రెండు లక్షల 25 వేల పారితోషకం తీసుకుంటే.. అటు హరితేజ ఏకంగా మూడు లక్షలు అందుకుందట. అంటే రోజుకి సుమారు 42,857 రూపాయలు. అయితే గంగవ్వ కంటే ఇది తక్కువే కావడం గమనార్హం. గంగవ్వ ఏకంగా వారానికి మూడున్నర లక్షల పారితోషకం అందుకుందట. ఇక మొత్తంగా ఐదు వారాలకు గాను హరితేజ 15 లక్షలు సంపాదించిందట.మరోవైపు హరితేజను కుట్ర చేసే ఎలిమినేట్ చేశారని.. వాస్తవానికి ప్రేక్షకుల కోట్ల ప్రకారం యష్మి ఎలిమినేట్ కావాల్సింది. కానీ బిగ్ బాస్ కన్నడ వాళ్లకి రక్షణగా నిలుస్తున్నాడు అంటూ మరో టాక్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బన్నీని అన్ని విషయాలు అడిగిన బాలయ్య..ఆ మ్యాటర్ మాత్రం ఎందుకు వదిలేసాడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>