MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kasthuri7521ebda-3147-4659-b766-31b55a8b7d27-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kasthuri7521ebda-3147-4659-b766-31b55a8b7d27-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ నటి కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిత్ర పరిశ్రమలో సుదీర్ఘకాలం నుంచి తన సత్తాను చాటిన వారిలో కస్తూరి ఒకరు అని చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికి కూడా వయసు పెరిగినప్పటికీ సినిమాలో నటిస్తూనే ఉంది. తన నటన, అందంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న కస్తూరి గతంలోనే మిస్ చెన్నయ్ గా ఎంపికయింది. మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి అనంతరం సినిమాలోకి వచ్చి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా రాణించింది. kasthuri{#}kasthuri;media;Chennai;Traffic police;Party;police;Telugu;Tollywood;Heroine;News;Tamil;Kannadaపరారీలో నటి కస్తూరి... ఆ హీరో ఇంట్లోనే ఉందా?పరారీలో నటి కస్తూరి... ఆ హీరో ఇంట్లోనే ఉందా?kasthuri{#}kasthuri;media;Chennai;Traffic police;Party;police;Telugu;Tollywood;Heroine;News;Tamil;KannadaSun, 10 Nov 2024 13:22:00 GMTటాలీవుడ్‌ నటి కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిత్ర పరిశ్రమలో సుదీర్ఘకాలం నుంచి తన సత్తాను చాటిన వారిలో కస్తూరి ఒకరు అని చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికి కూడా వయసు పెరిగినప్పటికీ సినిమాలో నటిస్తూనే ఉంది. తన నటన, అందంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న కస్తూరి గతంలోనే మిస్ చెన్నయ్ గా ఎంపికయింది. మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి అనంతరం సినిమాలోకి వచ్చి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా రాణించింది.


తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ, కన్నడ సినిమాలో నటించి విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో అమ్మ, అక్క, అత్త, వదిన వంటి పాత్రలను మాత్రమే పోషిస్తుంది. కేవలం సినిమాలోనే కాకుండా సీరియల్స్ లోను నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. కాగా, ఈ మధ్యకాలంలో నటి కస్తూరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. కొన్ని రోజుల క్రితం నటి కస్తూరి తెలుగు వారిని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

దీంతో కస్తూరిపై తెలుగు సంఘాలు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో నటి కస్తూరి పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ.... తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దాంతో అనేక రకాలుగా నటి కస్తూరిపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆమె అందరికీ క్షమాపణలు చెప్పింది. తెలుగు నా మెట్టినిల్లు. తెలుగు వారందరూ నా కుటుంబం అని కస్తూరి వెల్లడించింది. అధికార పార్టీ డిఎంకె తనపై కుట్ర చేస్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ తెలుగు వారిపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై చెన్నై మధురై సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు.


ఈ తరుణంలోని నటి కస్తూరి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చెన్నై పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేసేందుకు ఆమె ఇంటికి వెళ్లారు. కానీ అక్కడ ఆమె ఇంటికి తాళం వేసి ఉంది. అంతే కాకుండా కస్తూరి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో నటి కస్తూరి ఎక్కడ ఉందనే విషయమై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నటి కస్తూరితమిళ హీరో ఇంట్లో ఉందని సమాచారం అందుతోంది. ఈ విషయంపై పోలీసులు క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం తెలియదు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లేటెస్ట్ ట్రెండ్ కి దూరంగా రష్మిక.. ఆ పని చెయ్యంది చాన్స్ రాక.. ఇష్టం లేకనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>