Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-b6b3d7e9-f500-403c-a6d7-9bc46dd11b3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-b6b3d7e9-f500-403c-a6d7-9bc46dd11b3b-415x250-IndiaHerald.jpgఇతనికి పూర్తి విరుద్ధం రణ్‌వీర్ కపూర్. అతను ఎంతమంది ఉన్నా సరే తన ఇంట్లో ఎలా ప్రవర్తిస్తాడో అలానే ప్రవర్తిస్తుంటాడు. మరీ అతిగా మాట్లాడినా బిహేవ్ చేసినా బాగోదు. అలాగే మరీ మూగ వ్యక్తుల్లాగా ఉన్నా కూడా డిసప్పాయింటింగ్ గా అనిపిస్తుంది. ఈ బాహుబలి హీరో గ్లోబల్ రేంజ్ లో పాపులర్ అయినప్పటికీ ఇప్పటికీ తన సిగ్గును, స్టేజ్ ఫియర్ ను అధిగమించలేకపోవడం విశేషం. ఒకసారి ప్రభాస్ ఈ వీక్నెస్ గురించి కూడా మాట్లాడాడు. తాను ఎంతో మాట్లాడి ఇరగదీసేయాలనిprabhas {#}Bahubali;Prabhas;Darling;Rajamouli;Tamil;Event;Hero;Indiaప్రభాస్‌లో ఉన్న ఏకైక వీక్నెస్ అదే.. దాన్ని ఎప్పుడూ అధిగమించలేడు..?ప్రభాస్‌లో ఉన్న ఏకైక వీక్నెస్ అదే.. దాన్ని ఎప్పుడూ అధిగమించలేడు..?prabhas {#}Bahubali;Prabhas;Darling;Rajamouli;Tamil;Event;Hero;IndiaSun, 10 Nov 2024 08:59:00 GMT* ఏ హీరోకి లేని వీక్నెస్ ప్రభాస్‌కే ఉంది

* గ్లోబల్ రేంజ్ లో హీరో అయినా అధిగమించలేని వీక్నెస్

* అది నచ్చకపోయినా అభిమానులకు మాత్రం ప్రభాస్ అంటే ఇష్టమే

(తెలంగాణ - ఇండియా హెరాల్డ్)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆన్‌స్క్రీన్‌పై చాలా ఎనర్జిటిక్ గా మాట్లాడుతూ అలరిస్తుంటాడు. కానీ ఆఫ్‌స్క్రీన్‌లో మాత్రం ఆయన చాలా సైలెంట్. ఒకసారి బాహుబలి పార్ట్-1 తమిళ వెర్షన్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రభాస్ చాలా ఇబ్బంది పడిపోయాడు. ఒక డ్యాన్స్ గ్రూప్ పర్ఫామెన్స్ ఇచ్చేటప్పుడు అతన్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. వారందరూ డాన్స్ చేస్తుంటే ప్రభాస్ మాత్రం అక్కడి నుంచి ఎప్పుడు పారిపోవాలా, 'నన్ను వదిలేయండి బాబోయ్' అన్నట్లు ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చాడు. అది చూసే రాజమౌళి మనసారా నవ్వుకున్నాడు కూడా. ఈ డార్లింగ్ హీరో పెద్దగా మాట్లాడడు కూడా. తనకు బాగా కంఫర్టబుల్ గా ఉన్న వ్యక్తులతో చాలా సరదాగా ఉంటాడు కానీ ఒకేసారి లక్షల మంది ముందుకొచ్చి మాట్లాడటం అతనికి చాలా కష్టంగా అనిపిస్తుంది.

ఇంట్రావర్ట్ నేచర్ అంటారు కదా, అలాంటి అంతర్ముఖముల కోవలోకే వస్తాడు ప్రభాస్. ఇలాంటి వ్యక్తులు సోషల్ గేదరింగ్స్ లో అలసటకు అవుతారు. భయంగా, బెరుకుగా ఉంటారు, ఎక్కువగా మాట్లాడలేరు. ప్రభాస్ ఎక్కువగానే సిగ్గుగా ఫీల్ అవుతారని అంటారు. అయినా సరే అభిమానులకు ఆయన అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా అమ్మాయిలు పడి చచ్చిపోతారు. ఒకవేళ ప్రభాస్ సినిమాల్లో లాగా బయట కూడా అలాగే మాట్లాడితే ఫిమేల్ ఫ్యాన్స్ పిచ్చెక్కి పోతారని చెప్పుకోవచ్చు.

ఇతనికి పూర్తి విరుద్ధం రణ్‌వీర్ కపూర్. అతను ఎంతమంది ఉన్నా సరే తన ఇంట్లో ఎలా ప్రవర్తిస్తాడో అలానే ప్రవర్తిస్తుంటాడు. మరీ అతిగా మాట్లాడినా బిహేవ్ చేసినా బాగోదు. అలాగే మరీ మూగ వ్యక్తుల్లాగా ఉన్నా కూడా డిసప్పాయింటింగ్ గా అనిపిస్తుంది. ఈ బాహుబలి హీరో గ్లోబల్ రేంజ్ లో పాపులర్ అయినప్పటికీ ఇప్పటికీ తన సిగ్గును, స్టేజ్ ఫియర్ ను అధిగమించలేకపోవడం విశేషం. ఒకసారి ప్రభాస్ ఈ వీక్నెస్ గురించి కూడా మాట్లాడాడు. తాను ఎంతో మాట్లాడి ఇరగదీసేయాలని అనుకుంటానని కానీ అందరి ముందుకి వచ్చేసరికి ఏమీ మాట్లాడక పోతానని, అది చిన్నప్పటినుంచి అలానే జరుగుతుందని, దాన్ని తాను మార్చలేనని సరదాగా చెప్పుకొచ్చాడు. అయితే ఈ వీక్నెస్ వల్ల ఎవరికీ నష్టం లేదు, ఎవరికీ చెడు జరగదు. ప్రభాస్ ఎలా ఉన్నా అతని అభిమానులు అంగీకరిస్తారు అదే వారి గొప్పతనం. ప్రభాస్ కూడా తన ఫ్యాన్స్ ను ఎప్పుడూ ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హవ్వ..ఛీ ఛీ బన్నీ పై "AA***" పచ్చి బండ బూతులు.. అల్లు ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్న మెగా ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>