Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-bafa231a-68f5-4714-9e83-9e74cd2fa346-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-bafa231a-68f5-4714-9e83-9e74cd2fa346-415x250-IndiaHerald.jpgనవంబర్ 6న ఉదయం 8:40 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:10) సూర్యుడి నుంచి భారీ విస్ఫోటం సంభవించింది. ఈ విస్ఫోటం కారణంగా అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాలపై ఉన్న కొన్ని ప్రాంతాల్లో హై ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్స్ అంతరాయం చెందాయి. నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (SDO) ఈ సంఘటనను గమనించింది. ఇది నాసాకు చెందిన ఒక ఉపగ్రహం. ఈ ఉపగ్రహం సూర్యుడిని నిరంతరం పరిశీలిస్తుంది. సూర్యుడిపై సంభవించే వివిధ రకాల సంఘటనలను గుర్తించడంలో SDO కీలక పాత్ర పోషిస్తుంది. Viral {#}Evening;electricity;Massసూర్యుడిపై తుఫాన్ చూసారా.. షాకింగ్ వీడియో వైరల్?సూర్యుడిపై తుఫాన్ చూసారా.. షాకింగ్ వీడియో వైరల్?Viral {#}Evening;electricity;MassSun, 10 Nov 2024 16:00:00 GMTనవంబర్ 6న ఉదయం 8:40 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:10) సూర్యుడి నుంచి భారీ విస్ఫోటం సంభవించింది. ఈ విస్ఫోటం కారణంగా అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాలపై ఉన్న కొన్ని ప్రాంతాల్లో హై ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్స్ అంతరాయం చెందాయి. నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (SDO) ఈ సంఘటనను గమనించింది. ఇది నాసాకు చెందిన ఒక ఉపగ్రహం. ఈ ఉపగ్రహం సూర్యుడిని నిరంతరం పరిశీలిస్తుంది. సూర్యుడిపై సంభవించే వివిధ రకాల సంఘటనలను గుర్తించడంలో SDO కీలక పాత్ర పోషిస్తుంది.

సూర్యుడి నుంచి వెలువడే ఈ విస్ఫోటాలను సోలార్ ఫ్లేర్స్ అంటారు. ప్రజలకు అర్థం కావాలని వాటిని భూమిపై తుఫానులుగా పేర్కొంటారు. సోలార్ ఫ్లేర్స్ భూమిపై ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తాయో ఈ సంఘటన స్పష్టంగా తెలియజేస్తుంది. నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (SDO) సూర్యుడిని పరిశీలిస్తూ ఈ సారి సూర్యుడి నుంచి భారీ విస్ఫోటం జరిగింది. ఈ విస్ఫోటాలను సోలార్ ఫ్లేర్స్ అంటారు. ఈ ఫ్లేర్స్ వల్ల రేడియో కమ్యూనికేషన్, విద్యుత్ సరఫరా వ్యవస్థలు, నావిగేషన్ సిస్టమ్‌లు దెబ్బతింటాయి. అంతేకాకుండా, అంతరిక్ష నౌకలు, అధిక ఎత్తులో ప్రయాణించే విమానాలు, అంతరిక్ష యాత్రికులకు ఇవి ప్రమాదకరం. ఈసారి జరిగిన విస్ఫోటాన్ని X2.3 తరగతి విస్ఫోటం అని వర్గీకరించారు. ఇందులో 'X' అంటే అత్యంత శక్తివంతమైన విస్ఫోటం అని అర్థం. '2.3' అనే సంఖ్య దాని తీవ్రతను తెలియజేస్తుంది.

సూర్యుడిపై తాజాగా జరిగిన భారీ విస్ఫోటం వల్ల భూమికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వే
" style="height: 546px;">
స్తున్నారు. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కలిసి నిర్వహిస్తున్న సోలార్ అండ్ హెలియోస్ఫెరిక్ అబ్జర్వేటరీ (SOHO) అనే ఉపగ్రహం నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి ఈ విషయం తెలుస్తుంది.

సూర్యుడి నుంచి భారీ మొత్తంలో ప్లాస్మా, అయస్కాంత క్షేత్రాలు విడుదలయ్యే ప్రక్రియను కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME) అంటారు. ఈ CME భూమిని చేరితే భూ అయస్కాంత తుఫానులు వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఆకాశంలో అద్భుతమైన కాంతి వలయాలు ఏర్పడతాయి. వీటినే ఆరోరాలు లేదా ఉత్తర దీప్తులు అంటారు. సూర్యుడిపై సంభవించే విస్ఫోటాలను నాలుగు తరగతులుగా విభజిస్తారు. X తరగతి విస్ఫోటాలు అత్యంత శక్తివంతమైనవి. M తరగతి విస్ఫోటాలు X తరగతి కంటే తక్కువ శక్తివంతమైనవి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గొడవలు నిజమేనా.. పుష్ప-2 కోసం రంగంలోకి థమన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>