EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tdpe0eae025-c085-4f4d-8618-48ac1d6c11d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tdpe0eae025-c085-4f4d-8618-48ac1d6c11d4-415x250-IndiaHerald.jpgకార్యకర్తలే పునాధి.. కార్యకర్తలే వెన్నెముక.. కార్యకర్తలే దిక్కు.. కార్యకర్తలే భవిష్యత్తు అని నమ్మే పార్టీలో టీడీపీ ముందు వరుసలో ఉంటుందని అంటారు. కార్యకర్తల కష్టాలకు తగిన ప్రతిఫలం ఇవ్వడంలో ఆ పార్టీ అధినాయకత్వం ముందుంటుందని చెబుతుంటారు. ఈ క్రమంలో... ఎన్నికల సమయంలో పార్టీ కోసం ప్రాణాలు ఎదురొడ్డి, రక్తం చిందించిన కార్యకర్తకు నామినేటెడ్ పదవినిచ్చి గౌరవించింది. అవును... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరగగా.. కొన్ని ప్రాంతల్లో మాత్రం తీవ్ర హింసాత్మక ఘటనలు చోటtdp{#}manjula;Gurazala;Macherla;Reddy;Party;Husband;TDP;Elections;Government;YCP;Andhra Pradesh;CBNథట్ ఈస్ చంద్రబాబు? రక్తం చిందించిన మహిళా కార్యకర్తకి కీలక పదవి?థట్ ఈస్ చంద్రబాబు? రక్తం చిందించిన మహిళా కార్యకర్తకి కీలక పదవి?tdp{#}manjula;Gurazala;Macherla;Reddy;Party;Husband;TDP;Elections;Government;YCP;Andhra Pradesh;CBNSun, 10 Nov 2024 18:04:39 GMTకార్యకర్తలే పునాధి.. కార్యకర్తలే వెన్నెముక.. కార్యకర్తలే దిక్కు.. కార్యకర్తలే భవిష్యత్తు అని నమ్మే పార్టీలో టీడీపీ ముందు వరుసలో ఉంటుందని అంటారు. కార్యకర్తల కష్టాలకు తగిన ప్రతిఫలం ఇవ్వడంలో ఆ పార్టీ అధినాయకత్వం ముందుంటుందని చెబుతుంటారు. ఈ క్రమంలో... ఎన్నికల సమయంలో పార్టీ కోసం ప్రాణాలు ఎదురొడ్డి, రక్తం చిందించిన కార్యకర్తకు నామినేటెడ్ పదవినిచ్చి గౌరవించింది.


అవును... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరగగా.. కొన్ని ప్రాంతల్లో మాత్రం తీవ్ర హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ప్రచార కార్యక్రమాల సమయం నుంచే ఇవి మొదలైపోయాయి. ఈ సమయంలో... బూత్ ఏజెంట్ గా ఉన్న టీడీపీ నాయకురాలు మంజులా రెడ్డి నాడు చూపిన తెగువ చాలా మందికి గుర్తే!


తొలుత వైసీపీలో ఉండి.. పిన్నెల్లి సోదరుల దారుణాలు తట్టుకోలేక టీడీపీలో చేరారు మంజులా రెడ్డి, ఆమె భర్త వెంకటేశ్వర రెడ్డి. ఈయన గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గెలుపుకోసం పాటుపడ్డారు. ఈ క్రమంలో.. ఎన్నికలు సమీపించిన వేళ రెంటాల పోలింగ్ బూత్ లో ఏజెంట్లుగా ఉండేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ సమయంలో ఆమె ధైర్యం చేశారు.


ఎన్నికల రోజు ఉదయం పోలింగ్ సమయానికి ఏజెంట్ గా ఉన్నారు. అయితే... ఉదయం పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందే వైసీపీ మూకలు రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారని చెబుతారు. ఇందులో భాగంగా.. మంజుల, ఆమె భర్త వెంకటేశ్వర రెడ్డిపై వేట కోడవళ్లతో దాడులు చేశారు. ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర రెడ్డిని వెంటనే గురజాల ఆస్పత్రికి తరలించారు.

మరోపక్క నుదిటిపై తీవ్ర గాయమై రక్తం ధారగా కారుతున్నా కూడా ఆ గాయంతోనే మంజుల బూత్ లో ఏజెంట్ గా కూర్చుని తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు.. తన కమిట్మెంట్ ని చాటుకున్నారు. చివరకు పార్టీ నేతలు ఆమెకు సర్ధిచెప్పి ఆస్పత్రికి తరలించారు. నాడు మంజుల చేసిన సాహసం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


అయితే నేడు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ.. మంజుల పోరాటాలకు చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నామినేటెడ్ పదవిని అప్పగించింది. విజయవాడలోని ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్ అండ్ కల్చరల్ సొసైటీ ఛైర్మన్ గా ఆమెను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో.. కార్యకర్త కష్టానికి ప్రతిఫలం దక్కిందనే మాటలు వినిపిస్తునాయి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జమిలి ఎఫెక్ట్: మహిళల ఖాతాలో రూ.1500 పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>