EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan3d5e6458-45d3-4c13-97cc-60651a985bfc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan3d5e6458-45d3-4c13-97cc-60651a985bfc-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఇప్పుడు ఓ కామన్ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష నేతలు ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి హారజుకావడం లేదు. తమ గైర్హాజరీలపై ఎవరి వెర్షన్ వారు చెబుతున్నప్పటికీ.. వాటిని ప్రజలు ఏ రీతిగా పరిణగలోకి తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. అధికార పక్షం ఇబ్బందులు పెడుతుంటే.. ప్రతిపక్ష నేతలు ఛాలెంజ్ ల పేరు చెప్పి అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతుంటారు. 2019 ఎన్నికల అనంతరం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఛాలెంజ్ చేసి బయటకు వెళ్లి… సీఎంగా అడుగుపెట్టారు! తెలంగాణలో వరjagan{#}KCR;Jagan;Hanu Raghavapudi;Pulivendula;CBN;Andhra Pradesh;YCP;Telugu;CM;Congress;Party;Assemblyకేసీఆర్ చేసిన తప్పే జగన్ చేస్తున్నారా..?కేసీఆర్ చేసిన తప్పే జగన్ చేస్తున్నారా..?jagan{#}KCR;Jagan;Hanu Raghavapudi;Pulivendula;CBN;Andhra Pradesh;YCP;Telugu;CM;Congress;Party;AssemblySat, 09 Nov 2024 11:04:00 GMTరెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఇప్పుడు ఓ కామన్ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష నేతలు ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి హారజుకావడం లేదు. తమ గైర్హాజరీలపై ఎవరి వెర్షన్ వారు చెబుతున్నప్పటికీ.. వాటిని ప్రజలు ఏ రీతిగా పరిణగలోకి తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.


అధికార పక్షం ఇబ్బందులు పెడుతుంటే.. ప్రతిపక్ష నేతలు ఛాలెంజ్ ల పేరు చెప్పి అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతుంటారు.  2019 ఎన్నికల అనంతరం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఛాలెంజ్ చేసి బయటకు వెళ్లి… సీఎంగా అడుగుపెట్టారు!  తెలంగాణలో వరుసగా రెండుసార్లు సీఎంగా ఉన్న కేసీఆర్... కాంగ్రెస్ ప్రభుత్వ కొలువుదీరిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు.  తొలి శాసనసభ సమావేశాల సమయంలో తుంటి గాయం కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆయన.. సభకు హాజరుకాలేదు. తర్వాత ఆరోగ్యం కాస్త కుదుటిపడ్డాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.


బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని అంతా భావించారు!  కానీ ఇప్పటివరకూ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కేసీఆర్ అవసరం లేదని, తాము చాలని కేటీఆర్, హరీష్ రావులు చెబుతున్నారు. అయితే... గజ్వేల్ ఎమ్మెల్యేగా అయినా కేసీఆర్ ఎంట్రీ అసెంబ్లీలో ఉండాలి కదా అనేది ఇక్కడ కీలకాంశం!  మరి ఈ గైర్హాజరీని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి.


ఏపీ విషయానికొస్తే.. అక్కడ మరో రకం సమస్య ఉంది. తమకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదు. ఇస్తే సీఎం మాట్లాడిన తర్వాత తమకు అంతే సమయం మైక్ ఇవ్వాల్సి వస్తుందని.. అదే జరిగితే ప్రజా సమస్యలపై బలంగా ప్రశ్నిస్తామని భయపడే ఆ హోదా ఇవ్వడం లేదని జగన్ అంటున్నారు.

ఈ కారణం చెప్పి... ఆయన, ఆయనతో పాటు మిగిలిన 10 మంది వైసీపీ సభ్యులు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు.  అసెంబ్లీలో జరిగే చర్చాలపై మీడియాలో స్పందిస్తానని, తమకు ఏదో ఒక సమయం కేటాయించాలని, తమకు జర్నలిస్టులే స్పీకర్ అని చెప్పుకొస్తున్నారు.


ప్రతిపక్ష నేత తర్వాత.. ముందు పులివెందుల ఎమ్మెల్యే అనే విషయం మరిచిపోతే ఎలా అని అధికార పార్టీ కౌంటర్స్ వేస్తోంది! పరిస్థితులు ఏవైనా.. కారణాలు మరేవైనా.. వాటిని ప్రైపక్ష నేతల సాకులని అధికారపార్టీ అంటున్నా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ (ప్రధాన) ప్రతిపక్ష పార్టీల నేతలు కేసీఆర్, జగన్ లు శానసభ సమావేశాలకు గైర్హాజరవుతునే ఉన్నారు. ఈ విషయంలో కేసీఆర్ ను జగన్ ఫాలో అవుతున్నారనుకోవాలా.. లేక, పరిస్థితులు అలా వచ్చాయనుకోవాలో తెలియడం లేదు.










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షాక్: కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ లుక్ లిక్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>