MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tejaa6277c9-4808-400b-b81e-bb4944eb2c47-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tejaa6277c9-4808-400b-b81e-bb4944eb2c47-415x250-IndiaHerald.jpgవరుసగా మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. భారీ అంచనాలతో వచ్చిన ఎఫ్ 3 సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా మిగిలిపోయింది. ఈ ఏడాది పాన్ ఇండియా అంటూ రెండు సినిమాలతో హడావిడి చేస్తే రెండు సినిమాలు అంచనాలు అందుకోలేదు. ఆపరేషన్ వాలంటైన్, గాండీవధారి అర్జున సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో లావణ్య పెద్ద ఐరన్ లెగ్ అంటూ సోషల్ మీడియాలో సహజంగానే కామెంట్లు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ టర్నింగ్ ఇచ్చుకున్నట్టు కనిపిస్తోంది. ఓ లక్కీ ఇంట్లోకి మారారు. ఎప్పటి వరకు నాగబాబు కుటుంబం మణికొండలో ఉVARUN TEJ{#}arjuna;choudary actor;niharika konidela;Nagababu;varun sandesh;varun tej;Box office;Tollywood;kalyan;Hero;Iron;House;Diwali;marriage;Cinema;Prime Minister;Indiaకొత్త ఇంట్లోకి వ‌రుణ్ తేజ్ - లావ‌ణ్య‌... ఆ ఇళ్లు దేశానికి ప్రైమ్ మినిస్ట‌ర్‌ను ఇచ్చింది..!కొత్త ఇంట్లోకి వ‌రుణ్ తేజ్ - లావ‌ణ్య‌... ఆ ఇళ్లు దేశానికి ప్రైమ్ మినిస్ట‌ర్‌ను ఇచ్చింది..!VARUN TEJ{#}arjuna;choudary actor;niharika konidela;Nagababu;varun sandesh;varun tej;Box office;Tollywood;kalyan;Hero;Iron;House;Diwali;marriage;Cinema;Prime Minister;IndiaSat, 09 Nov 2024 12:58:03 GMTఅదేంటో కానీ హీరో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న తర్వాత కెరీర్ పరంగా ఏమాత్రం ఆశాజనకంగా లేదు. వరుసగా మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. భారీ అంచనాలతో వచ్చిన ఎఫ్ 3 సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా మిగిలిపోయింది. ఈ ఏడాది పాన్ ఇండియా అంటూ రెండు సినిమాలతో హడావిడి చేస్తే రెండు సినిమాలు అంచనాలు అందుకోలేదు. ఆపరేషన్ వాలంటైన్, గాండీవధారి అర్జున సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో లావణ్య పెద్ద ఐరన్ లెగ్ అంటూ సోషల్ మీడియాలో సహజంగానే కామెంట్లు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ టర్నింగ్ ఇచ్చుకున్నట్టు కనిపిస్తోంది. ఓ లక్కీ ఇంట్లోకి మారారు. ఎప్పటి వరకు నాగబాబు కుటుంబం మణికొండలో ఉండేది.


ఇప్పుడు జూబ్లీహిల్స్‌కు మారారు. అది కూడా ఓ లక్కీ ఇంట్లోకి రావడం విశేషం. జూబ్లీహిల్స్ లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఓ మంచి భవంతి ఉంది. అది ప్రస్తుతం ఆయన వారసుల కంట్రోల్లో ఉంది. ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత పీవీ ప్రధాని అయ్యారని అంటారు. అలాగే ఈ భవంతిని మైత్రి మూవీ సంస్థ అద్దెకి తీసుకుంది. ఉప్పెన, వీర సింహారెడ్డి, వాల్తేరు వీర‌య్య‌, సర్కార్ వారి పాట సినిమాలు అన్నీ ఈ భవంతిలో ఉన్నప్పుడు నిర్మించినవే. ఎందుకో మైత్రి సంస్థ ఈ భవంతిని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ భవంతిని నాగబాబు కుటుంబం అద్దెకు తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు కోటిన్న‌ర‌ నుంచి రెండు కోట్ల మేరకు ఖర్చు చేసి మంచి ఇంటీరియర్ డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది.


ఇటీవల నాగబాబు దంపతులు వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి, నిహారిక ఈ ఇంట్లోకి మారారట ఇటీవల దీపావళి సందర్భంగా పవన్ కూడా ఈ ఇంటికి వచ్చారని.. ఇల్లంతా తిరిగి చూశారని తెలుస్తోంది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ త‌న గ‌ది చూశారని వరుణ్ తేజ్ వెల్లడించారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా సినిమా చేస్తున్నారు. కొంతకాలంగా వరుణ్ తేజ్ కు సరైన హిట్ లేకపోవడంతో ఈ లక్కీ హౌస్ లోకి మారిన నేపథ్యంలో అయినా మంచి హిట్ పడుతుందేమో అన్న ఆశలు ఉన్నాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన మట్కా ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ గోల్డెన్ గర్ల్ గా ఉన్న మీనాక్షి చౌదరి ఈ సినిమాలో వరుణ్ కు జోడిగా హీరోయిన్గా నటిస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఉదయ్ కిరణ్ , సుష్మితతో ఎంగేజ్మెంట్ కి ముందు ఎవరినీ లవ్ చేశాడంటే.. చిరు చేరదీయడం వెనక అంత స్టోరీ ఉందా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>