MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas1b042edb-204c-4535-bc2a-6ed94809876f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhas1b042edb-204c-4535-bc2a-6ed94809876f-415x250-IndiaHerald.jpgఅదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి ప్రభాస్ తన సినిమాలను కూడా అదే రేంజ్ లో సెట్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ప్రభాస్ నెక్స్ట్ ఏడు మూవీలను ఇప్పటికే సెట్ చేసి పెట్టుకున్నాడు. మరి ప్రభాస్ నెక్స్ట్ ఏడు మూవీల దర్శకులు ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం విడుదల చేయనున్నారు. ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంPrabhas{#}prashanth neel;Prasanth Neel;prasanth varma;nag ashwin;vijay kumar naidu;sandeep;raja;Hanu Raghavapudi;Yevaru;Lokesh;Lokesh Kanagaraj;Prabhas;Cinemaప్రభాస్ నెక్స్ట్ ఏడు మూవీలు ఇవే.. ఇది కదా పాన్ ఇండియన్ స్టార్ పవర్ అంటే..?ప్రభాస్ నెక్స్ట్ ఏడు మూవీలు ఇవే.. ఇది కదా పాన్ ఇండియన్ స్టార్ పవర్ అంటే..?Prabhas{#}prashanth neel;Prasanth Neel;prasanth varma;nag ashwin;vijay kumar naidu;sandeep;raja;Hanu Raghavapudi;Yevaru;Lokesh;Lokesh Kanagaraj;Prabhas;CinemaSat, 09 Nov 2024 14:55:00 GMTఅదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి ప్రభాస్ తన సినిమాలను కూడా అదే రేంజ్ లో సెట్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ప్రభాస్ నెక్స్ట్ ఏడు మూవీలను ఇప్పటికే సెట్ చేసి పెట్టుకున్నాడు. మరి ప్రభాస్ నెక్స్ట్ ఏడు మూవీల దర్శకులు ఎవరు అనే వివరాలను తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం విడుదల చేయనున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ప్రభాస్ ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే మూవీ కి కమిట్ అయ్యి ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ మరి కొంత కాలం లోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 2026 వ సంవత్సరం విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ప్రభాస్ "సలార్" మూవీ కి కొనసాగింపుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ ని 2026 వ సంవత్సరం విడుదల చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ , ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ మూవీ లో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ , ప్రభాస్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ప్రభాస్ "కల్కి 2898 AD" మూవీ కి కొనసాగింపుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2 అనే సినిమాలో నటించబోతున్నాడు. ఈ మూవీ ని 2027 లేదా 2028 లో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రభాస్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కూడా ఓ మూవీ లో నటించే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ మిస్టేక్ చేసుంటే పవన్ తో సినిమానే ఉండేది కాదు.. పూరీ జగన్నాథ్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>