Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ntr98a5f944-26cd-41f9-99f5-455ed8c362b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-ntr98a5f944-26cd-41f9-99f5-455ed8c362b5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో నేటి తరం హీరోలలో పౌరాణిక పాత్రలు చేయగల అద్భుతమైన నటుడు జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి తారక రామారావు మనవడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన తారక్ బాలనటుడిగా ‘బాల రామాయణం’చిత్రంలో బాల రాముడి పాత్రలో అద్భుతంగా నటించాడు.. శ్రీరాముడు చిన్నతనంలో ఇంత అందంగా ఉండేవాడా అని ఆ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఎన్టీఆర్ నటనను మెచ్చుకున్నారు..ఆ సినిమా మంచి విజయం సాధించింది.. ఇక ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఎన్టీఆర్ నటించిన#ntr{#}NTR;Jr NTR;Rajamouli;Simhadri;Mass;Tollywood;Cinemaపౌరాణిక పాత్రలో తాతకు తగ్గ మనవడిగా అదరగొట్టిన ఎన్టీఆర్..!!పౌరాణిక పాత్రలో తాతకు తగ్గ మనవడిగా అదరగొట్టిన ఎన్టీఆర్..!!#ntr{#}NTR;Jr NTR;Rajamouli;Simhadri;Mass;Tollywood;CinemaSat, 09 Nov 2024 08:34:41 GMTటాలీవుడ్ లో నేటి తరం హీరోలలో పౌరాణిక పాత్రలు చేయగల అద్భుతమైన నటుడు జూనియర్ ఎన్టీఆర్.. నందమూరి తారక రామారావు మనవడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన తారక్ బాలనటుడిగా ‘బాల రామాయణం’చిత్రంలో బాల రాముడి పాత్రలో అద్భుతంగా నటించాడు.. శ్రీరాముడు చిన్నతనంలో ఇంత అందంగా ఉండేవాడా అని ఆ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఎన్టీఆర్ నటనను మెచ్చుకున్నారు..ఆ సినిమా మంచి విజయం సాధించింది.. ఇక ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఎన్టీఆర్ నటించిన ఆది, సింహాద్రి సినిమాలు ఎన్టీఆర్ ని తిరుగులేని మాస్ హీరోని చేసాయి.. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు.. అప్పటి వరకు వున్న ఆల్ టైం రికార్డ్స్ అన్నిటిని ఎన్టీఆర్ తుడిచిపెట్టేసాడు.. ఎన్టీఆర్ కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.. ప్రతి సినిమాకు ఎన్టీఆర్ తన నటనలో వైవిధ్యం చూపిస్తూ వచ్చారు.. 

అయితే స్వర్గీయ నందమూరి తారకరామారావు గారిని తారక్ లో చూసుకుంటున్న అభిమానులు ఆయనలా పౌరాణిక పాత్రలో నటిస్తే చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు..అయితే సింహాద్రి తరువాత ఎన్టీఆర్ కెరీర్ డౌన్ ఫాల్ కావడం మొదలయింది.. నటనతో ఆకట్టుకుంటున్న కానీ సినిమాలు విజయం సాధించడం లేదు.. దీనికి తోడు విపరీతంగా బరువు పెరగడంతో ఎన్టీఆర్ లుక్ పూర్తిగా మారింది.. దీనిని గమనించిన రాజమౌళి ఎన్టీఆర్ కెరీర్ ని గాడిలో పెట్టే ప్రయత్నం చేసారు.. ఎన్టీఆర్ బరువు తగ్గేలా మోటివేషన్ చేసి ఆయనతో ‘యమదొంగ’ సినిమా తెరకెక్కించారు..అప్పటివరకు ఎన్టీఆర్ నుంచి ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లుగా రాజమౌళి ఎన్టీఆర్ తో పౌరాణిక పాత్ర వేయించారు.. అదే యముడి పాత్ర..కుర్ర యముడిగా ఎన్టీఆర్ లుక్ అదిరిపోతుంది..యముడి లుక్ లో అచ్చం పెద్ద ఎన్టీఆర్ లా తారక్ కనిపించారు.ఇక లుక్ ఒక ఎత్తయితే యముడి పాత్రలో ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ అదరహో అని చెప్పొచ్చు.. ఏకంగా రెండు పేజీల డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పినప్పుడు.. ప్రేక్షకులకు ‘దానవీరశూరకర్ణ’ సినిమాలో పెద్ద ఎన్టీఆర్ జ్ఞప్తికి వచ్చారు.. అంతలా తారక్ ప్రేక్షకులని తన అద్భుతమైన నటనతో మైమరిపించాడు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పౌరాణిక పాత్రలో తాతకు తగ్గ మనవడిగా అదరగొట్టిన ఎన్టీఆర్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>