EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/sree-reddtyfe9412ef-ddfa-4119-a568-f9a7b6c796e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/sree-reddtyfe9412ef-ddfa-4119-a568-f9a7b6c796e6-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో వైసీపీకి చిన్నా చితక నటీ నటులు తప్పితే పెద్దాగా ఇండస్ట్రీ నుంచి మద్దతు లేదు. ఉన్న ఆ చిన్నా చితక నటులు కూడా రాజకీయ పరిణతి లేని నేతలే. అలాంటి వారిలో శ్రీరెడ్డి ఒకరు. తన యూట్యూబ్ వేదికగా.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌ ను, పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబుతోపాటు వారి కుటుంబ సభ్యులను చీల్చ చెండాడింది. చెప్పరాని, రాయలేని భాషతో బూతు పురాణం వల్లించింది. జగన్ చెల్లి షర్మిలనూ దుర్భాషలాడుతూ వీడియోలు రిలీజ్ చేసేది. జగన్ను ఎవరు ఏమన్నా.. వారిపై తన తిట్ల దండకం అందుకునేది. ఇప్పుడు అధికాsree reddty{#}anitha singer;sri reddy;chinna;Industry;YCP;TDP;Yevaru;Bharatiya Janata Partyచంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు సారీ చెబుతున్న శ్రీ రెడ్డి! కూటమి నేతలు క్షమిస్తారా?చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు సారీ చెబుతున్న శ్రీ రెడ్డి! కూటమి నేతలు క్షమిస్తారా?sree reddty{#}anitha singer;sri reddy;chinna;Industry;YCP;TDP;Yevaru;Bharatiya Janata PartySat, 09 Nov 2024 13:15:00 GMTఏపీ రాజకీయాల్లో వైసీపీకి చిన్నా చితక నటీ నటులు తప్పితే పెద్దాగా ఇండస్ట్రీ నుంచి మద్దతు లేదు. ఉన్న ఆ చిన్నా చితక నటులు కూడా రాజకీయ పరిణతి లేని నేతలే. అలాంటి వారిలో శ్రీరెడ్డి ఒకరు. తన యూట్యూబ్‌ వేదికగా.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌ ను, పవన్‌ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబుతోపాటు వారి కుటుంబ సభ్యులను చీల్చ చెండాడింది.  చెప్పరాని, రాయలేని భాషతో బూతు పురాణం వల్లించింది.


జగన్‌ చెల్లి షర్మిలనూ దుర్భాషలాడుతూ వీడియోలు రిలీజ్‌ చేసేది. జగన్‌ను ఎవరు ఏమన్నా.. వారిపై తన తిట్ల దండకం అందుకునేది.  ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. సోషల్‌ టెర్రర్‌పై ఉక్కుపాదం మోపుతోంది. ఈ దెబ్బకు ఇంతకాలం రెచ్చిపోయిన శ్రీరెడ్డి దిగొచ్చింది.  గతంలో వపన్‌ కల్యాణ్, లోకేషన్, చంద్రబాబు, జనసేన, టీడీపీ నేతలను దూషించినందుకు క్షమాపణ కోరింది. ఈమేరకు వీడియో రిలీజ్‌ చేసింది.

గత వైసీపీ ప్రభుత్వం అండతోనే వీడియోలు రిలీజ్‌ చేసిన, తీవ్రంగా దుర్భాషలాడిన వైసీపీ సానుభూతిపరులు, సోషల్‌మీడియా నాయకులు, కార్యకర్తలను కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్‌ టార్గెట్‌చేసింది. నోటీసులు ఇస్తుండడం, అరెస్టులు చేస్తుండడంతో శ్రీరెడ్డికి భయం పుచ్చుకుంది. వెంటనే శ్రీరెడ్డి ఓ వీడియోను రిలీజ్‌ చేసింది. తామంతా నేతల చేతుల్లో పావులం.. మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలంటే నేతలపై తీసుకోండి. కార్యకర్తలను వదిలేయండి అని ఆ వీడియోలో బతిమాలుకుంది.

 
ఇక గతంలో తాను మాట్లాడిన మాటలకు లోకేశ్‌ గారు సారీ. మీ అమ్మగారికి సారీ, మీ భార్యకు సారీ, అనిత గారికిసారీ, పవన్‌కల్యాణ్‌గారికి సారీ. మీ కుటుంబ సభ్యులకు సారీ, నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నా' అని శ్రీరెడ్డి వేడుకుంది. తన సోషల్‌ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ, ఆ విధంగా కానీ,ఏ విధంగా కానీ తప్పుడుగా మాట్లాడనని తెలిపింది. తల వంచి నమస్కరిస్తున్నా అని కోరింది. నన్ను నా కార్యకర్తలను వదిలిపెట్టండని, నన్ను క్షమించండి అని వీడియో ముగించింది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఉదయ్ కిరణ్ , సుష్మితతో ఎంగేజ్మెంట్ కి ముందు ఎవరినీ లవ్ చేశాడంటే.. చిరు చేరదీయడం వెనక అంత స్టోరీ ఉందా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>