DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ktr80d7681c-1163-4ed1-8694-c80bd5eb6532-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ktr80d7681c-1163-4ed1-8694-c80bd5eb6532-415x250-IndiaHerald.jpg'ఫార్ములా ఈ-రేసింగ్'లో నిధుల గోల్మాల్ విషయంలో ఏసీబీ ఎంక్వయిరీ మొదలయ్యే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం మలేషియాకు వెళ్లడం హాట్ టాపిక్గా మారింది. ఈ వ్యవహారంలో అరెస్టు చేస్తారనే భయంతోనే ఆయన ఫారిన్ వెళ్లినట్టు ప్రచారం జరుగుతున్నది. అరెస్టులకు భయపడనని చెప్పిన ఆయన.. ఉన్నట్టుండి మలేషియా వెళ్లడం వెనక ఉన్న ఆంతర్యమేంటనే చర్చ జరుగుతున్నది. మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది వేడుకులకు హాజరయ్యేందుకే కేటీఆర్ ఫారిన్ వెళ్లినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మూడు, నాలుగు రోజుల పాటు ఆయన అకktr{#}KTR;Malaysia;Anti-Corruption Bureau;Cabinet;Kumaar;Kanna Lakshminarayana;News;Telanganaమలేసియా కి చెక్కేస్తున్న కేటీఆర్? అరెస్టు భయమే కారణమా?మలేసియా కి చెక్కేస్తున్న కేటీఆర్? అరెస్టు భయమే కారణమా?ktr{#}KTR;Malaysia;Anti-Corruption Bureau;Cabinet;Kumaar;Kanna Lakshminarayana;News;TelanganaFri, 08 Nov 2024 10:25:00 GMT'ఫార్ములా ఈ-రేసింగ్‌'లో నిధుల గోల్‌మాల్ విషయంలో ఏసీబీ ఎంక్వయిరీ మొదలయ్యే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం మలేషియాకు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో అరెస్టు చేస్తారనే భయంతోనే ఆయన ఫారిన్ వెళ్లినట్టు ప్రచారం జరుగుతున్నది. అరెస్టులకు భయపడనని చెప్పిన ఆయన.. ఉన్నట్టుండి మలేషియా వెళ్లడం వెనక ఉన్న ఆంతర్యమేంటనే చర్చ జరుగుతున్నది.


మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది వేడుకులకు హాజరయ్యేందుకే కేటీఆర్ ఫారిన్ వెళ్లినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మూడు, నాలుగు రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారని సమాచారం. అక్కడి నుంచి తిరిగి నేరుగా హైదరాబాద్‌కు వస్తారా? లేదా మరేదైన దేశానికి వెళ్తారా? అనే కోణంలో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. మలేషియా టూర్ సడన్‌గా ఖరారైందా? ఎప్పుడు టికెట్లు బుక్ చేసుకున్నారు? ఆయన వెంట ఎవరెవరు వెళ్లారు? అనే కోణంలోనూ సమాచారం చేకరిస్తున్నట్టు తెలిసింది.


ఫార్ములా ఈ రేసింగ్‌లో జరిగిన నిధుల గోల్‌మాల్ వ్యవహారంపై విచారణకు ఏసీబీ కసరత్తు చేస్తుంది. హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఫార్ములా ఈ-రేసింగ్ నిర్వహణ సంస్థకు వెళ్లిన నిధులు.. అక్కడి నుంచి ఎవరికి వెళ్లాయి? అనే కోణంలోనూ అధికారులు ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నట్టు తెలిసింది. ఫార్ములా ఈ-రేసింగ్ మొదటి సీజన్‌లో పార్టనర్‌గా ఉన్న గ్రీన్కో సంస్థ, రెండో సీజన్ వచ్చేసరికి ఎందుకు ఎంఓయూ రద్దు చేసుకున్నది? అనే కోణంలోనూ సంస్థ నిర్వహకుల నుంచి ఏసీబీ ఆఫీసర్లు సమాచారం సేకరించినట్టు తెలిసింది.



ఈ వ్యవహారంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ ప్రమేయం ఏ మేరకు ఉన్నదనే కోణంలోనూ ఇప్పటికే పూర్తి ఆధారాలను సేకరించిందని, కేటీఆర్ హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే నోటీసు ఇచ్చి, విచారించే అవకాశం ఉందని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి అభిప్రాయపడ్డారు.



సెక్రెటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం రూ.10 లక్షల కన్నా ఎక్కువ నిధులు ఖర్చు చేయాలంటే అందుకు కేబినెట్ ఆమోదం తప్పనిసరి.  కానీ కేటీఆర్ నోటి మాటగా ఆదేశాలు ఇవ్వగానే నాటి మున్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ రూ.55 కోట్లు చెల్లించడం రూల్స్ విరుద్ధమని పేర్కొంటున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కెరీయర్లోని ఫస్ట్ టైం స్టార్ హీరోకి తండ్రిగా నటించబోతున్న చిరంజీవి.. పాన్ ఇండియా రికార్డ్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>