MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywoodad6b79ef-20cc-40bb-8e4e-d9d068a322d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bollywoodad6b79ef-20cc-40bb-8e4e-d9d068a322d4-415x250-IndiaHerald.jpg అలా వస్తున్న వారిలో కొందరు టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్లు గా ఎదుగుతున్నారు. అలా ఎదిగిన వారిలో దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కూడాా ఒకరు..ఈమె కెరియర్ తెలుగు సినిమాలతోనే మొదలైంది.. తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కూడా వెలిగింది. ఇలా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన చాలా మంది ఇప్పుడు స్టార్ హీరోయిన్లు గా రాణిస్తున్నారు. అయితే మన టాలీవుడ్ లో స్టార్ లేడి కమీడియన్గా పేరు తెచ్చుకున్న ఒకరు బాలీవుడ్ లో హీరోయిన్గా నటించి మెప్పించారు. Bollywood{#}Mehmood;Sridevi Kapoor;manorama;Comedian;Hollywood;Remake;October;Kannada;Hindi;Telugu;Tollywood;bollywood;Cinemaబాలీవుడ్ లో హీరోయిన్గా నటించిన ఏకైక‌ సౌత్ లేడీ కమీడియన్ ఎవ‌రంటే..!బాలీవుడ్ లో హీరోయిన్గా నటించిన ఏకైక‌ సౌత్ లేడీ కమీడియన్ ఎవ‌రంటే..!Bollywood{#}Mehmood;Sridevi Kapoor;manorama;Comedian;Hollywood;Remake;October;Kannada;Hindi;Telugu;Tollywood;bollywood;CinemaFri, 08 Nov 2024 13:18:00 GMTఇక మన తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మంది హీరోయిన్లు వస్తున్నారు పోతున్నారు . అలా వస్తున్న వారిలో కొందరు టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్లు గా ఎదుగుతున్నారు. అలా ఎదిగిన వారిలో దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కూడాా ఒకరు..ఈమె కెరియర్ తెలుగు సినిమాలతోనే మొదలైంది.. తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కూడా వెలిగింది. ఇలా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన చాలా మంది ఇప్పుడు స్టార్ హీరోయిన్లు గా రాణిస్తున్నారు. అయితే మన టాలీవుడ్ లో స్టార్ లేడి కమీడియన్గా పేరు తెచ్చుకున్న ఒకరు బాలీవుడ్ లో హీరోయిన్గా నటించి మెప్పించారు.


ఇక ఇంతకీ ఆ సీనియర్ నటి మరెవరో కాదు .. ఆచీ మనోరమా .. 1958 లో వ‌చ్చిన ఓ సినిమాతో తన 21 ఏళ్ల వయసులో నటిగా ఆమె చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. దాదాపు అర శతాబ్దం పాటు చిత్ర పరిశ్రమలో కొనసాగారు . అలాగే 2013 లో వచ్చిన సూర్యా సింగం 2 సినిమా వరకు ప‌లు భాషల్లో ఎన్నో సినిమాలు చేశారు . ఈమె నటిగానే కాకుండా సింగర్ గా కూడా ఎన్నో సినిమాల్లో కూడా పాటలు పాడారు. అయితే మనోరమా తెలుగులో రెండు సినిమాల్లో హీరోయిన్గా నటించారు. అంతే కాకుండా మన స్టార్ హీరోలతో కలిసి కామెడీలో కూడా అదరగొట్టారు.


అయితే 1974లో బాలీవుడ్ లో వచ్చిన "కున్వారా బాప్" అనే సినిమాలో మనోరమ నటించారు. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ కమెడియన్ మెహమూద్ దర్శకత్వంలో వ‌చ్చింది. ఈ సినిమాలో ఆయనే హీరోగా కూడా నటించారు . అయితే ఈ సినిమాను హాలీవుడ్ లో వచ్చిన ది కిడ్ అనే మూవీకి రీమేక్ గా హిందీలో తీశారు. అయితే ఈ సినిమాలో మెహమూద్ కి జంటగా మనోరమ బాలీవుడ్ లో హీరోయిన్గా చేశారు. అలాగే ఆమె నటించిన ఏకైక హిందీ సినిమా కూడా ఇదే. దాదాపు మనోరమ ఆమె కెరియర్లు 1000కి పైగా సినిమాల్లో నటించి అరుదైన రికార్డు కూడా అందుకున్నారు. కేవలం తమిళంలోనే దాదాపు 800 కు పైగా సినిమాల్లో నటించారు . అలాగే తెలుగు , మలయాళం , కన్నడ , హిందీ భాషల్లోనూ ఆమె సినిమాల్లో చేశారు. 2013లో అనారోగ్యం కారణంగా రెండు సంవత్సరాలు ఆస్పత్రిలో గడిపారు. అలా 2015 అక్టోబర్ 10న 78 సంవత్సరాల వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అందరూ అనుకున్నట్లు చిరంజీవికి శత్రువు బాలయ్య కాదు .. ఆ పేరున్న పరువు లేని పెద్దమనిషే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>