MoviesFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/yamadonga701ff1bc-f3f7-466c-85bd-443b5adc7879-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/yamadonga701ff1bc-f3f7-466c-85bd-443b5adc7879-415x250-IndiaHerald.jpgకలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి నందమూరి కుటుంబం అంటే ఎంతో అభిమానం. స్వర్గీయ ఎన్టీఆర్ ని ఆయన తన సోదరుడిగానే భావిస్తారు. ఎన్టీఆర్ తో మోహన్ బాబు మేజర్ చంద్రకాంత్ అనే అద్భుతమైన చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా బాలకృష్ణ, హరికృష్ణ లతో కూడా మోహన్ బాబు నటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలసి యమదొంగ చిత్రంలో నటించారు. యమదొంగ చిత్రంలో మోహన్ బాబు యముడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తన గంభీరత్వంతో మోహన్ బాబు యముడి పాత్రకి ప్రాణం పోశారు. ఈ పాత్రలో మోహన్ బాబుని రాజమౌళికి సూచించింది ఎవరో కాదు.. జూనియరyamadonga{#}editor mohan;harikrishnana;Jr NTR;mohan babu;Avunu;Chitram;Nijam;NTR;Rajamouli;king;King;Smart phone;Audio;Director;Manam;Cinemaయమదొంగ: యముడిగా మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనకాల అంత జరిగిందా.?యమదొంగ: యముడిగా మోహన్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనకాల అంత జరిగిందా.?yamadonga{#}editor mohan;harikrishnana;Jr NTR;mohan babu;Avunu;Chitram;Nijam;NTR;Rajamouli;king;King;Smart phone;Audio;Director;Manam;CinemaFri, 08 Nov 2024 14:13:00 GMTకలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి నందమూరి కుటుంబం అంటే ఎంతో అభిమానం. స్వర్గీయ ఎన్టీఆర్ ని ఆయన తన సోదరుడిగానే భావిస్తారు. ఎన్టీఆర్ తో మోహన్ బాబు మేజర్ చంద్రకాంత్ అనే అద్భుతమైన చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా బాలకృష్ణ, హరికృష్ణ లతో కూడా మోహన్ బాబు నటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలసి యమదొంగ చిత్రంలో నటించారు. యమదొంగ చిత్రంలో మోహన్ బాబు యముడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తన గంభీరత్వంతో మోహన్ బాబు యముడి పాత్రకి ప్రాణం పోశారు. ఈ పాత్రలో మోహన్ బాబుని రాజమౌళికి సూచించింది ఎవరో కాదు.. జూనియర్ ఎన్టీఆర్. ఓ ఇంటర్వ్యూలో తారక్ ఈ విషయాన్ని తెలిపారు. యమదొంగ చిత్రానికి జరిగిన డిస్కషన్స్ ని ఎన్టీఆర్ బయట పెట్టారు. రాజమౌళి వచ్చి ఒక టైటిల్ చెబుతాను ఎలా  ఉందో చెప్పు అని అడిగారు. యమదొంగ అని అన్నారు. అదేంటి జక్కన్నా అని అడిగా. అవును తారక్ యమగోల తరహాలో మనం ఒక చిత్రం చేస్తున్నాం అని చెప్పారు. నాకు చిన్న పాటి భయం కలిగింది. సరే జక్కన్న యముడికి పాత్ర చాలా కీలకం కదా ఎవరిని అనుకుంటున్నారు అని అడిగా. ఎవరైతే బావుంటుందో నువ్వే చెప్పు తారక్ అని అడిగారు. ఇంకెవరున్నారు జక్కన్నా ఆ పాత్రలో నటించే ఏకైక మగాడు మోహన్ బాబు మాత్రమే అని చెప్పా.

 ఆ పాత్ర చేయగలిగేది ఆయన ఒక్కడే. మరి ఆయన చేస్తారో లేదో తెలియదు కదా జక్కన్నా అని అడిగా. నీకెందుకు తారక్ నేను వెళ్లి మాట్లాడతా అని చెప్పారు. రాజమౌళి అడగగానే మోహన్ బాబు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. నువ్వు డైరెక్టర్ నువ్వు కాబట్టి, తారక్ సినిమా కాబట్టి ఈ సినిమా నేను చేస్తున్నాను అని మోహన్ బాబు అన్నారు.  ఈ నేపథ్యంలో  ఒక విధంగా అది ఆయన ఇచ్చిన వరం అనుకోవాలి. అందరూ ఆయన గురించి తప్పుగా అనుకుంటారు. చాలా కోపం, ముక్కు మీద కోపం, ముక్కు సూటి మనిషి అని .. అబద్దం మాట్లాడటం చేతకాని, నిజం తప్పా.. ఏమీ మాట్లాడటం చేతకాని మనిషి మోహన్ బాబు' అని అన్నారు తారక్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఇదిలావుండగా ఈ చిత్ర ఆడియో వేడుకలో కూడా మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ అద్భుతంగా డైలాగులు చెప్పాడు. ఎక్కడైనా తప్పు చెబుతాడేమో అని అలా చూస్తూ ఉన్నా. ఒక్క తప్పు కూడా చెప్పలేదు. వెంటనే నా మరదలు తారక్ తల్లికి ఫోన్ చేసి.. అమ్మా నువ్వు హాయిగా నిద్రపో.. వాడు అద్భుతంగా డైలాగులు చెప్పాడు అని చెప్పినట్లు మోహన్ బాబు అన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అక్కడ ఆఫీస్ బాయ్ గా కూడా చేయను.. మోహన్ లాల్ సంచలన వ్యాఖ్యలు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>