MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram5891a110-0cee-4e7c-9081-f59e2d5b5c50-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikram5891a110-0cee-4e7c-9081-f59e2d5b5c50-415x250-IndiaHerald.jpgమాటల రచయితగా కెరీర్ ప్రారంభించి టాలీవుడ్‌లో ఒక్కసారిగా సెన్సేషన్ అయిన త్రివిక్రమ్.. తరుణ్, శ్రేయ కాంబోలో వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో మెగా ఫోన్ పెట్టి దర్శకుడుగా మారారు. తన రెండో సినిమా అతడు తోనే ఏకంగా మహేష్ బాబును డైరెక్ట్ చేసే అవకాశం సొంతం చేసుకున్నారు. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. త్రివిక్రమ్ అంటే పంచులు ఎలా పేల‌తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్రివిక్రమ్ మాటలు ప్రేక్షకులను మత్తెకిస్తాయి. త్రివిక్రమ్ కెరీర్‌లో ఎన్నో ఐకానిక్ డైలాగులు ఉన్నాయి. సినీ రంగంలో ప్రతి రచయితకు ఒక శైలి ఉంటుంTrivikram{#}Qualification;Nuvve Nuvve;Smart phone;Manam;Ishtam;Nijam;trivikram srinivas;Cinemaటాలీవుడ్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కెరీర్ బెస్ట్ డైలాగులు ఇవే...!టాలీవుడ్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కెరీర్ బెస్ట్ డైలాగులు ఇవే...!Trivikram{#}Qualification;Nuvve Nuvve;Smart phone;Manam;Ishtam;Nijam;trivikram srinivas;CinemaFri, 08 Nov 2024 12:02:00 GMTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్‌లో ఎలాంటి మాయాజాలం చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాటల రచయితగా కెరీర్ ప్రారంభించి టాలీవుడ్‌లో ఒక్కసారిగా సెన్సేషన్ అయిన త్రివిక్రమ్.. తరుణ్, శ్రేయ కాంబోలో వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో మెగా ఫోన్ పెట్టి దర్శకుడుగా మారారు. తన రెండో సినిమా అతడు తోనే ఏకంగా మహేష్ బాబును డైరెక్ట్ చేసే అవకాశం సొంతం చేసుకున్నారు. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. త్రివిక్రమ్ అంటే పంచులు ఎలా పేల‌తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్రివిక్రమ్ మాటలు ప్రేక్షకులను మత్తెకిస్తాయి. త్రివిక్రమ్ కెరీర్‌లో ఎన్నో ఐకానిక్ డైలాగులు ఉన్నాయి. సినీ రంగంలో ప్రతి రచయితకు ఒక శైలి ఉంటుంది.


త్రివిక్రమ్‌ది కూడా అంతే. కాకపోతే ఆయన కలం.. కాస్త చిలిపిదనం, కాస్త వెటకారం వస్తుంది. అన్నింటికీ మించి ఆత్మీయమైన మాటలతో ఆలోచింపజేస్తుంది. అందుకే ఆయనను అందరూ మాటల మాంత్రికుడు అంటారు. త్రివిక్రమ్ ఐకానిక్ డైలాగులు కొన్ని చూద్దాం.


1) కారణం లేని కోపం, ఇష్టం లేని గౌరవం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం - తీన్మార్.
2) తెగిపోయేటప్పుడు దారం బలం తెలుస్తుంది.. వెళ్లిపోయేటప్పుడు బంధం విలువ తెలుస్తుంది - అత్తారింటికి దారేది.
3) పనిచేస్తే జీతం అడగొచ్చు.. అప్పు ఇచ్చి వడ్డీ అడగొచ్చు.. హెల్ప్ చేసి మాత్రం థాంక్స్ అడగకూడదు - మల్లేశ్వరి.


4) అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు - ఖ‌లేజా. 5) ఎప్పుడు జరిగే దాన్ని అనుభవం అంటారు.. ఎప్పుడో జరిగేదాన్ని అద్భుతం అంటారు - అజ్ఞాతవాసి. 6) మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి.. కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు - సన్నాఫ్ సత్యమూర్తి.
6) నిజం చెప్పేటప్పుడు భయం వేస్తుంది.. చెప్పకపోతే ఎప్పుడూ భయం వేస్తుంది.. - అలవైకుంఠపురంలో.
7) నిజం చెప్పకపోవడం అబద్ధం.. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం.. - అత‌డు.


8) సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టి అర్హత లేదు - నువ్వే నువ్వే.
9) మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు.. ఓడినప్పుడు భుజం తట్టేవాళ్ళు నలుగురు లేకపోతే ఎంత సంపాదించి.. ఎంత పోగొట్టుకున్న తేడా ఉండదు - నువ్వు నాకు నచ్చావ్‌.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

యానిమ‌ల్‌ సినిమా దెబ్బ‌కు త్రిప్తి డిమ్రీ క్రేజ్ ఏ రేంజ్‌కు వెళ్లిందంటే.. !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>