MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli4956462d-28e8-47ba-948d-8fe41fd6c46e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli4956462d-28e8-47ba-948d-8fe41fd6c46e-415x250-IndiaHerald.jpg అలాగే రాజమౌళి డైరెక్షన్లో ఆ హీరో నటిస్తే ఎంతో బాగుంటుందని కోరుకునే వారు కూడా ఉన్నారు. ఇలా ఎంతో మంది సినీ ప్రేమికులు కోరుకునే కాంబినేషన్లో రాజమౌళి- సూర్య కాంబో కూడా ఒకటి .. నిజంగా వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే అది ఎంతో భిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక ఇప్పుడు దీనిపై రాజమౌళి స్పందించాడు. గతంలో సూర్యాతో ఓ సినిమా చేయాలనుకున్నాని కూడా చెప్పాడు. RAJAMOULI{#}surya sivakumar;Hero;Rajamouli;Train;Blockbuster hit;News;Cinemaమహేష్ కి షాక్ ఇవ్వబోతున్న రాజమౌళి.. సూర్యకి బంపర్ ఛాన్స్...!మహేష్ కి షాక్ ఇవ్వబోతున్న రాజమౌళి.. సూర్యకి బంపర్ ఛాన్స్...!RAJAMOULI{#}surya sivakumar;Hero;Rajamouli;Train;Blockbuster hit;News;CinemaFri, 08 Nov 2024 13:01:00 GMTమన భారతీయ చిత్ర పరిశ్రమలో దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయాలని ఎందరో హీరోలు ఆశ పడుతూ ఉంటారు. అలాగే రాజమౌళి డైరెక్షన్లో ఆ హీరో నటిస్తే ఎంతో బాగుంటుందని కోరుకునే వారు కూడా ఉన్నారు. ఇలా ఎంతో మంది సినీ ప్రేమికులు కోరుకునే కాంబినేషన్లో రాజమౌళి- సూర్య కాంబో కూడా ఒకటి .. నిజంగా వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే అది ఎంతో భిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక ఇప్పుడు దీనిపై రాజమౌళి స్పందించాడు. గతంలో సూర్యాతో ఓ సినిమా చేయాలనుకున్నాని కూడా చెప్పాడు.


గ‌తంలో నేను సూర్య కలిసి ఒక సినిమా చేద్దాం  అనుకున్నామని అది కుదరలేదు .. రాజమౌళితో సినిమా చేసే అవకాశం మిస్ అయ్యానని ఏదో ఫంక్షన్ లో సూర్య కూడా చెప్పాడు కానీ సూర్యతో సినిమా చేసే ఛాన్సును నేను కోల్పోయానని రాజమౌళి భావిస్తున్నాని నిన్న జరిగిన కంగువా ఈవెంట్లో రాజమౌళి చెప్పాడు. ఎందుకంటే సూర్యను నేను ఎంతో ప్రేమిస్తాను.. ఆయన స్టోరీస్ సెలక్షన్ అంటే నాకు ఎంతో ఇష్టం. అలా ఆ సమయంలో సూర్యతో సినిమా చేయలేకపోయానని విషయాన్ని రాజమౌళి ఈ వెంట్లో బయటపెట్టాడు. ఇక సూర్య కూడా ఈ విషయంపై స్పందించాడు. రాజమౌళి గారితో సినిమా చేయడానికి నేను ఎప్పటినుంచో  ఎదురు చూస్తున్నానని కూడా ప్రకటించాడు.


గతంలో రాజమౌళి అనే ట్రైన్ నేను మిస్ అయ్యాను .. కానీ ఇప్పటికీ నేను ఆ ట్రైన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను అంటూ సూర్య ఈవెంట్లో అన్నాడు. రాబోయే రోజుల్లో ఆయన వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ తో సినిమా చేయబోతున్నాడు. దీన్ని కూడా రెండు భాగాలుగా తీసుకురాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి - సూర్యతో సినిమా చేస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. ఇక మరి సూర్య కంగువతో బ్లాక్ బస్టర్ హీట్ కొడితే మాత్రం ఆయన క్రేజ్ మరో లెవల్ కు వెళుతుంది. అలాగే మహేష్ మూవీ తర్వాత రాజమౌళి సూర్యతో సినిమా చేస్తే మాత్రం దానిపై అంచనాలు మరో లెవల్లో ఉంటాయని అనడంలో  ఎలాంటి సందేహం లేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టాలీవుడ్లో అట్టర్ ప్లాఫ్.. తమిళ్లో మాత్రం బ్లాక్ బస్టర్.. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>