MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny0b7eb7e7-5152-478b-ba04-8549001f7b3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunny0b7eb7e7-5152-478b-ba04-8549001f7b3b-415x250-IndiaHerald.jpgమరీ ముఖ్యంగా అలవైకుంఠపురం, పుష్ప అంటే రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు వరుసగా పడ్డాయి. అందులోనూ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2పై దేశవ్యాప్తంగా కనీవినీ ఎరుగని రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. నార్త్ ఇండియాలోనే ఈ సినిమా భారీ స్థాయిలో బిజినెస్ చేస్తోంది. అయితే బన్నీ అందర్నీ ప్రేమిస్తాడు. అలాగే తన సినిమా నుంచి బెస్ట్ అవుట్ ఫుట్ ప్రేక్షకులకు ఇవ్వాలని చూస్తాడు. తన సినిమాకు పని చేసేవారు కూడా బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలని కోరుకుంటాడు. BUNNY{#}Sarrainodu;Music;Guntur;ram pothineni;Blockbuster hit;Kanna Lakshminarayana;trivikram srinivas;News;Tollywood;Director;Cinema;Allu Arjun;Indiaబ‌న్నీతో పెట్టుకుంటే ఎవ‌డికైన మ‌డ‌త‌డిపోవాల్సిందే.. !బ‌న్నీతో పెట్టుకుంటే ఎవ‌డికైన మ‌డ‌త‌డిపోవాల్సిందే.. !BUNNY{#}Sarrainodu;Music;Guntur;ram pothineni;Blockbuster hit;Kanna Lakshminarayana;trivikram srinivas;News;Tollywood;Director;Cinema;Allu Arjun;IndiaFri, 08 Nov 2024 12:18:00 GMTగంగోత్రి సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అప్పుడు బన్నీ వేరు. ఇప్పుడు బన్నీ వేరు. మరీ ముఖ్యంగా అలవైకుంఠపురం, పుష్ప అంటే రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు వరుసగా పడ్డాయి. అందులోనూ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2పై దేశవ్యాప్తంగా కనీవినీ ఎరుగని రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. నార్త్ ఇండియాలోనే ఈ సినిమా భారీ స్థాయిలో బిజినెస్ చేస్తోంది. అయితే బన్నీ అందర్నీ ప్రేమిస్తాడు. అలాగే తన సినిమా నుంచి బెస్ట్ అవుట్ ఫుట్ ప్రేక్షకులకు ఇవ్వాలని చూస్తాడు. తన సినిమాకు పని చేసేవారు కూడా బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలని కోరుకుంటాడు.


ఎంత స్నేహంగా ఉన్నా ఈ విషయంలో రాజీ పడేందుకు ఎంత మాత్రం ఒప్పుకోడు. స్టార్ హీరోలు క్వాలిటీ విషయంలో పక్కాగా ఉంటారు. సరిలేరు నీకెవ్వ‌రు మ్యూజిక్ విషయంలో మహేష్ బాబు.. దేవిశ్రీ మీద అసంతృప్తి వ్యక్తం చేసిన మాట ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. అలాగే సర్కారు వారి పాట ఆల్బమ్ మహేష్‌ను ఎంత మాత్రం మెప్పించలేదని అన్నారు. అయితే త్రివిక్రమ్ పట్టు పట్టడంతో గుంటూరు కారం సినిమాకు మళ్ళీ థ‌మ‌న్‌నే తీసుకున్నారు. అయితే క్వాలిటీ విషయంలో మహేష్ కన్నా రెండు మూడు ఇంతలు బన్నీ ఎక్కువే ఉంటాడు. అస్సలు రాజీపడరు. ఉదాహరణకు గీతా సంస్థ, బన్నీ కలిపి సరైనోడు సినిమా స్క్రిప్ట్ విషయంలో బోయపాటితో పదేపదే రాయించార‌ని కథలుగా వినిపించింది.


అందుకే సరైనోడు గట్టెక్కి హిట్ అయింది. అదే బోయపాటి.. రామ్ చరణ్, రామ్‌తో ఎలాంటి సినిమాలు ఇచ్చాడో అందరం చూశాం. అయితే ఇప్పుడు దేవిశ్రీకి కూడా సినిమాలకు సంగీతం కంటే.. ఎగ‌స్ట్రా కార్యక్రమాలు, షోలు, లైవ్ షోలు ఎక్కువగా పెట్టుకుంటున్నారు. సహజంగానే ఇది పుష్ప 2 సినిమా వర్క్‌పై ప్రభావం చూపించింది అంటున్నారు. ఏది ఏమైనా బన్నీకి వర్క్ విషయంలో అంత సంతృప్తి లేదు. అందుకే ఇప్పుడు పుష్ప 2 బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ ముక్కలు ముక్కలుగా జ‌రుగుతుందట‌. థ‌మన్‌కు మరో మ్యూజిక్ డైరెక్టర్ కు కూడా అప్పగించారని వార్తలు వినిపిస్తున్నాయి. బుచ్చిబాబు సైతం తన రెండో సినిమాకు రెహమాన్ ని తీసుకున్నారు. ఏది ఏమైనా బన్నీకి కోపం వస్తే ఎలా ఉంటుందో బాగా చూపించాడ‌న్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

90's లో ఆ స్టార్ బ్యూటీ కోసం ఎగబడ్డ స్టార్ హీరోలు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>