Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-suriyaaaf554df-9e38-43b4-a3fb-caa15d21dcbb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-suriyaaaf554df-9e38-43b4-a3fb-caa15d21dcbb-415x250-IndiaHerald.jpgతమిళ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. భారతదేశ గర్వించదగ్గ నటులలో సూర్య ఒకరు.. తన అద్భుతమైన నటనతో పాత్రను రక్తి కట్టిస్తారు.. సూర్య యాక్టింగ్ కి ఇతర భాష నటులు సైతం ఎన్నో ప్రశంసలు కురిపించారు.. ఇదిలా ఉంటే సూర్య నటించిన అద్భుతమైన చిత్రాలలో 'జై భీమ్' సినిమా ఒకటి.. ఈ సినిమాలో సూర్య నటన అద్భుతమని చెప్పాలి.. తాజాగా జై భీమ్ గురించి తన మనసుని కదిలించిన ఘటనను సూర్య పంచుకున్నారు.దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో 2021 నవంబర్‌లో రిలీజ్ 'జై భీమ్' డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిం#suriya{#}jeevitha rajaseskhar;raja;surya sivakumar;Komaram Bheem;Lawyer;Darsakudu;Coronavirus;Amazon;Director;cinema theater;Hero;police;Cinema;Diwaliసూర్య : జై భీమ్ విషయంలో చాలా బాధపడ్డా.. అలా చేసి ఉండాల్సింది కాదు..!!సూర్య : జై భీమ్ విషయంలో చాలా బాధపడ్డా.. అలా చేసి ఉండాల్సింది కాదు..!!#suriya{#}jeevitha rajaseskhar;raja;surya sivakumar;Komaram Bheem;Lawyer;Darsakudu;Coronavirus;Amazon;Director;cinema theater;Hero;police;Cinema;DiwaliThu, 07 Nov 2024 22:32:00 GMTహీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. భారతదేశ గర్వించదగ్గ నటులలో సూర్య ఒకరు.. తన అద్భుతమైన నటనతో పాత్రను రక్తి కట్టిస్తారు.. సూర్య యాక్టింగ్ కి ఇతర భాష నటులు సైతం ఎన్నో ప్రశంసలు కురిపించారు.. ఇదిలా ఉంటే సూర్య నటించిన అద్భుతమైన చిత్రాలలో 'జై భీమ్' సినిమా ఒకటి.. ఈ సినిమాలో సూర్య నటన అద్భుతమని చెప్పాలి.. తాజాగా జై భీమ్ గురించి తన మనసుని కదిలించిన ఘటనను సూర్య పంచుకున్నారు.దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో 2021 నవంబర్‌లో రిలీజ్ 'జై భీమ్' డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది..నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీలో సూర్య ప్రధాన పాత్రలో నటించారు. అంతే కాదు ఈసినిమాలో సూర్యతో పాటు లిజో మోల్, మణికంఠన్ కీలక పాత్రలు పోషించారు.1993లో జరిగిన ఇరుళ జాతికి చెందిన రాజా కణ్ణు, సెంగెణి దంపతులపై పోలీసుల అన్యాయాన్ని ఈ సినిమాలో చూపించారు. అయితే చేయని తప్పు ఒప్పుకోమని బాధిస్తుండగా, పోలీసుల దాడిలో రాజా కణ్ణు మరణిస్తాడు. కానీ పోలీసులు అతను పారిపోయినట్లు కథ అల్లి అందరిని నమ్మిస్తారు..
తన భర్తకు న్యాయం జరగాలని సెంగెణి న్యాయవాది చంద్రు సాయంతో పోరాడుతుంది. ఈ కేసులో సెంగెణి గెలుస్తుంది.

ఈ సినిమాలో రాజా కణ్ణుగా మణికంఠన్, సెంగెణిగా లిజో మోల్ అద్భుతంగా నటించారు.ఇక అసలైన హీరో పాత్ర న్యాయవాది చంద్రుగా సూర్య అద్భుతంగా నటించారు.. సినిమాలో కొన్ని సీన్స్ ప్రేక్షకులని కంట తడి పెట్టిస్తాయి.. అనగారిన వర్గాలకు జరిగే అన్యాయాన్ని దర్శకుడు ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు.ఈ చిత్రాన్నీ జ్యోతిక, సూర్యలు 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. కరోనా సమయంలో ఈ సినిమా డైరెక్ట్ గా అమెజాన్ ఓటీటీలో విడుదలయ్యింది.ఓటీటీలో ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. దీపావళి సందర్భంగా తన సినిమా కోసం ఆశగా వచ్చిన ఓ పెద్దాయన థియేటర్ లో నా సినిమా లేకపోవడంతో నిరాశతో తిరిగి వెళ్లడం భాధ అనిపించిందని సూర్య ఇటీవల తెలిపారు.. ఆ పెద్దాయనకు అసలు ఓటీటీ అంటే ఏంటో తెలీదు..నా సినిమా వస్తుందని ఎంతో ఆశతో వచ్చారు.. కానీ చివరికీ నిరాశతో తిరిగి వెళ్ళిపోయాడు..ఆ విషయం తెలిసి భాధ పడ్డా అని సూర్య తెలిపారు.. తమ సినిమా ఓటీటీలో విడుదల చేసి తప్పు చేశామని సూర్య తెలిపారు.. అలాంటి తప్పు మళ్ళీ చేయకూడదని అనుకున్నట్లు సూర్య తెలిపారు..






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ సెన్సేషన్: అక్కినేని ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా సరే.. శోభిత కోసం అలా చేయబోతున్న నాగార్జున..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>