MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgభాగ్యనగరంలో నివసించే వారికి ప్యారడైజ్ సెంటర్ సుపరిచితం. ఈ ప్యారడైజ్ పేరుతో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో బిర్యానీ పేరు మారుమ్రోగిపోతూ ఉంటుంది. ఇప్పుడు నాని ఈ ప్యారడైజ్ పేరును తన సినిమాటైటిల్ గా మార్చుకోబోతున్నాడు. నాని కెరియర్ లో 100 కోట్ల సినిమాగా రికార్డు క్రియేట్ చేసిన ‘దసరా’ మూవీతో నాని మాస్ హీరో కల నెరవేరింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో గత సంవత్సరం విడుదలైన ఈమూవీకి మంచి ప్రశంసలతో పాటు విజయం కూడ వచ్చింది. ఈవిజయంతో జోష్ లోకి వెళ్ళిపోయిన నాని శ్రీకాంత్ తో మరో మూవీ చేస్తానని ప్రకటించిన విషయం తెnaani{#}srikanth;Paradise;Nani;Josh;Hyderabad;INTERNATIONAL;Mass;Telugu;Hero;India;Cinemaహాట్ టాపిక్ గా మారిన నాని ప్యారడైజ్ !హాట్ టాపిక్ గా మారిన నాని ప్యారడైజ్ !naani{#}srikanth;Paradise;Nani;Josh;Hyderabad;INTERNATIONAL;Mass;Telugu;Hero;India;CinemaThu, 07 Nov 2024 15:45:00 GMTభాగ్యనగరంలో నివసించే వారికి ప్యారడైజ్ సెంటర్ సుపరిచితం. ఈ ప్యారడైజ్ పేరుతో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో బిర్యానీ పేరు మారుమ్రోగిపోతూ ఉంటుంది. ఇప్పుడు నానిప్యారడైజ్ పేరును తన సినిమాటైటిల్ గా మార్చుకోబోతున్నాడు. నాని కెరియర్ లో 100 కోట్ల సినిమాగా రికార్డు క్రియేట్ చేసిన ‘దసరా’ మూవీతో నాని మాస్ హీరో కల నెరవేరింది.



శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో గత సంవత్సరం విడుదలైన ఈమూవీకి మంచి ప్రశంసలతో పాటు విజయం కూడ వచ్చింది. ఈవిజయంతో జోష్ లోకి వెళ్ళిపోయిన నాని శ్రీకాంత్ తో మరో మూవీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘హిట్ 3’ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్న నాని ఈమూవీ షూటింగ్ పూర్తి చేసిన తరువాత శ్రీకాంత్ ఓదెల మూవీని మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.



ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన కథ ఓకె అయిందని అంటున్నారు. 1980 ప్రాంతంలో సికింద్రాబాద్ ప్యారడైజ్ సెంటర్ లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈమూవీని తీయబోతున్నట్లు సమాచారం. అప్పట్లో పెను సంచలనం సృష్టించిన ఒక సంఘటనకు సినిమా రీతిలో కథలో మార్పులు చేర్పులు చేసి శ్రీకాంత్ ఓదెల ఈమూవీని తీస్తున్నారు అని అంటున్నారు.



పూర్తి మాస్ మూవీగా నిర్మాణం జరుపుకోబోతున్న ఈమూవీలో నాని నటించే హీరో పాత్ర కూడ ప్యారడైజ్ అని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు హైదరాబాద్ గురించి తెలిసిన ప్రతి వ్యక్తికి ప్యారడైజ్ సెంటర్ సుపరిచితం ఇలాంటి టైటిల్ పెడితే చాల సులువుగా జనంలోకి సినిమా వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశ్యంతో ఈ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకోబోయే ఈమూవీలో అన్నీ అనుకూలిస్తే జాహ్నవి ఈమూవీలో నాని పక్కన నటించే ఆస్కారం ఉంది. ఈమూవీ కూడ అంచనాల ప్రకారం హిట్ అయితే నాని మాస్ హీరోగా పూర్తిగా సెటిల్ అయ్యే ఆస్కారం ఉంది..  










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అఖండ 2 : సరికొత్తగా బాలయ్య పాత్ర..ఈ సారి శివ తాండవమే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>