MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఫిలిమ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ ఎంత సమర్థత ఉన్నప్పటికీ లక్ లేకపోతే ఇండస్ట్రీలో హీరోయిన్ గా హీరోగా సెటిల్ కావడం చాల కష్టం. ఒక హీరోయిన్ కు వరసపెట్టి హిట్స్ వస్తే వెంటనే ఆమెను గోల్డెన్ లెగ్ హీరోయిన్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు. అలా కాకుండా వరసపెట్టి ఫైయిల్యూర్స్ వచ్చాయంటే చాలు ఆమెకు వెంటనే ఐరన్ లెగ్ బ్యూటీ అంటూ హీరోల దగ్గర నుండి దర్శక నిర్మాతల వరకు ఆమెను దూరం పెడతారు. లేటెస్ట్ గా విడుదలైన కిరణ్ అబ్బవరం ‘క’ మూవీలో హీరోయిన్ గా నటించిన నయన్ సారిక గురించి ఇప్పుడు ఎక్కువగా ఇండస్ట్రీ వర్గాలు ఆలTOLLLYWWOD{#}Sarika;Iron;Anand Deverakonda;Hyderabad;kiran;BEAUTY;Jr NTR;Industry;Heroine;Teluguచిన్న హీరోయిన్ కు గోల్డెన్ లెగ్ సెంటిమెంట్ !చిన్న హీరోయిన్ కు గోల్డెన్ లెగ్ సెంటిమెంట్ !TOLLLYWWOD{#}Sarika;Iron;Anand Deverakonda;Hyderabad;kiran;BEAUTY;Jr NTR;Industry;Heroine;TeluguWed, 06 Nov 2024 16:34:00 GMTఫిలిమ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ ఎంత సమర్థత ఉన్నప్పటికీ లక్ లేకపోతే ఇండస్ట్రీలో హీరోయిన్ గా హీరోగా సెటిల్ కావడం చాల కష్టం. ఒక హీరోయిన్ కు వరసపెట్టి హిట్స్ వస్తే వెంటనే ఆమెను గోల్డెన్ లెగ్ హీరోయిన్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తారు. అలా కాకుండా వరసపెట్టి ఫైయిల్యూర్స్ వచ్చాయంటే చాలు ఆమెకు వెంటనే ఐరన్ లెగ్ బ్యూటీ అంటూ హీరోల దగ్గర నుండి దర్శక నిర్మాతల వరకు ఆమెను దూరం పెడతారు.



లేటెస్ట్ గా విడుదలైన కిరణ్ అబ్బవరం ‘క’ మూవీలో హీరోయిన్ గా నటించిన నయన్ సారిక గురించి ఇప్పుడు ఎక్కువగా ఇండస్ట్రీ వర్గాలు ఆలోచిస్తున్నాయి. ఈసినిమాలో నటించిన ఆమెకు మంచి ప్రశంసలు కూడ వస్తున్నాయి. ఆమధ్య జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నె నటించిన ‘ఆయ్’ మూవీలో ఈమె హీరోయిన్ గా నటించింది. ఆసినిమా విడుదలైన కొన్ని నెలలకే మళ్ళీ ఆమె నటించిన ‘క’ మూవీకి సూపర్ హిట్ టాక్ రావడంతో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల దృష్టి అంతా ఆమె పై పడింది.



గతంలో ఆమె ఆనంద్ దేవరకొండ తో కలిసి ‘‘గంగం గణేశా’ లో నటించింది. అయితే ఆమూవీ సూపర్ ఫ్లాప్ కావడంతో ఆమె గురించి ఇండస్ట్రీ వరగ్గాలు పెద్దగా పట్టించుకోలేదు. ‘ఆయ్’ ‘క’ అంటూ చిన్న అక్షరాల టైటిల్స్ ఈమెకు బాగా కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ కు చెందిన ఈ తెలుగు అమ్మాయికి ఇన్స్ టా గ్రామ్ లో మూడు లక్షలకు పైగా ఫాలోయర్లు ఉన్నారు.



ఇప్పుడు వచ్చిన ఫేమ్ తో ఆమె ఫాలోయర్స్ సంఖ్య బాగా పెరిగే ఆస్కారం కనిపిస్తోంది. గతంలో ‘బెంచ్ లైఫ్’ అనే వెబ్ సిరీస్ లో ఈమె నటించింది. ఇక రానున్న రోజులలో ఈమె సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇంస్తుందని టాక్. తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ముందుకురారు అన్న సెంటిమెంట్ నయన్ కు వర్తించదు అనుకోవాలి..










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

22ఏళ్లకే తల్లినయ్యా.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన యానిమల్ బ్యూటీ.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>