EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan80c1a548-5fc0-46cc-aec8-adbbb506e4d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan80c1a548-5fc0-46cc-aec8-adbbb506e4d7-415x250-IndiaHerald.jpgతనకు పదవులు ముఖ్యం కాదని తరచూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతూ ఉంటారు. తనకు ప్రజల శ్రేయస్సే ముఖ్యమని కూడా ఆయన అంటూ ఉంటారు. ఇక టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరినపుడు పవన్ కి కీలకమైన హోం శాఖనే ఇస్తారు అని అంతా అనుకున్నారు. డిప్యూటీ సీఎం హోదా దక్కినా హోం శాఖ మాత్రం ఆయనకు దక్కలేదు. తనకు ఎంతో ఇష్టమైన పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలనే కోరుకున్నారు అని కూడా అంతా ప్రచారం సాగింది. ఇక కూటమి ప్రభుత్వం ఏపీలో కొలువు తీరి అయిదు నెలలు గడచిన తరువాత సడెన్ గా పవన్ తాను హోం మంత్రిని అయితే అన్న చర్చకు తpawan{#}anitha singer;bhavana;Panchayati;Chakram;Janasena;TDP;kalyan;Telangana Chief Minister;CM;Governmentహోం శాఖ పై పవన్ మనసు పారేసుకున్నారా..?హోం శాఖ పై పవన్ మనసు పారేసుకున్నారా..?pawan{#}anitha singer;bhavana;Panchayati;Chakram;Janasena;TDP;kalyan;Telangana Chief Minister;CM;GovernmentWed, 06 Nov 2024 11:25:00 GMTతనకు పదవులు ముఖ్యం కాదని తరచూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతూ ఉంటారు. తనకు ప్రజల శ్రేయస్సే ముఖ్యమని కూడా ఆయన అంటూ ఉంటారు. ఇక టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరినపుడు పవన్ కి కీలకమైన హోం శాఖనే ఇస్తారు అని అంతా అనుకున్నారు.


డిప్యూటీ సీఎం హోదా దక్కినా హోం శాఖ మాత్రం ఆయనకు దక్కలేదు.  తనకు ఎంతో ఇష్టమైన పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలనే కోరుకున్నారు అని కూడా అంతా ప్రచారం సాగింది. ఇక కూటమి ప్రభుత్వం ఏపీలో కొలువు తీరి అయిదు నెలలు గడచిన తరువాత సడెన్ గా పవన్ తాను హోం మంత్రిని అయితే అన్న చర్చకు తెర తీశారు. అది కూడా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోనే ఆయన ఈ ప్రకటన చేశారు. కావాలని అనుకుంటే నేను హోం మంత్రిని కాగలను నేనే హోం మంత్రిని అయితే పరిస్థితులు వేరేగా ఉంటాయని కూడా ఆయన హెచ్చరించారు.


దీనిని బట్టి చూస్తే పవన్ మనసు హోం శాఖ మీద పడిందా అన్నదే అంతటా చర్చగా ఉంది.

తనకు పదవులే వద్దు అనుకున్న పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కీలకమైన నాలుగు శాఖలను తీసుకున్నారు. తన శాఖలో పట్టు సాధిస్తున్నారు. ఈ సమయంలో ఆయన ఉన్నట్లుండి హోం శాఖ కావాలని కోరుకోవడమేంటని చర్చ సాగుతోంది.


పవన్ మనసులో ఈ భావన సడెన్ గా వచ్చిందా లేక ఆయన నిజంగానే దీని మీద పట్టుబడుతున్నారా అన్నది మాత్రం తెలియడం లేదు. హోం శాఖ అంటే సీఎం పోస్టు తరువాత స్థానంలో ఉంటుంది.  హోం శాఖను పవన్ కోరుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయని అంటున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ బాగా లేదని రోజూ ఫిర్యాదులు వస్తున్నాయని ఇక చూస్తే హోం మంత్రిగా అనిత ఉన్నా తెర వెనక చక్రం తిప్పేవారు ఉన్నారని కూడా అనుమానాలు ప్రచారం ఉంది అని అంటున్నారు.


మరో వైపు చూస్తే జనసేన నేతలకు కూడా సరైన మర్యాద ఈ శాఖ వద్ద దక్కడం లేదు అని అంటున్నారు. అంతా టీడీపీ వారు కోరుకున్న మేరకే పోలీసుల పోస్టింగులు జరిగాయని అంటున్నారు. ఇక జనసేన నేతలు కూడా బాధితులుగానే గత ప్రభుత్వంలో ఉందని అయితే వారి బాధలు వారి విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు అని అంటున్నారు.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప వర్సెస్ కంగువా .. ఆ విషయంలో అప్పర్ హ్యాండ్ ఎవరిదంటే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>