MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/actress-kasthuri-shankar73803837-5cb2-4279-abe4-c31222a3f2af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/actress-kasthuri-shankar73803837-5cb2-4279-abe4-c31222a3f2af-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు సందడి చేసిన హీరోయిన్లలో కస్తూరి శంకర్ ఒకరు. ఈ బ్యూటీ ఒకప్పుడు సౌత్ ఇండియా మొత్తంలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యకాలంలోనూ అవకాశాలను బాగానే అందుకుంటుంది. సినీ ఆరంభంలో తన అందంతో, మాయతో సందడి చేసిన కస్తూరి ఒకప్పుడు మిస్ చెన్నైగా ఎంపిక అయింది. ఆ తర్వాత తమిళ సినిమాలతో తన కెరీర్ ఆరంభించింది. అనంతరం మలయాళం, తెలుగు, కన్నడంలోనూ కొన్ని సినిమాల్లో నటించింది. Actress Kasthuri Shankar{#}dharma;Janasena;Telangana;kasthuri;Press;kalyan;BEAUTY;Heroine;India;Tamil;Teluguజనసేనలోకి హాట్‌ బ్యూటీ కస్తూరి?జనసేనలోకి హాట్‌ బ్యూటీ కస్తూరి?Actress Kasthuri Shankar{#}dharma;Janasena;Telangana;kasthuri;Press;kalyan;BEAUTY;Heroine;India;Tamil;TeluguTue, 05 Nov 2024 14:07:00 GMTచిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు సందడి చేసిన హీరోయిన్లలో కస్తూరి శంకర్ ఒకరు. ఈ బ్యూటీ ఒకప్పుడు సౌత్ ఇండియా మొత్తంలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యకాలంలోనూ అవకాశాలను బాగానే అందుకుంటుంది. సినీ ఆరంభంలో తన అందంతో, మాయతో సందడి చేసిన కస్తూరి ఒకప్పుడు మిస్ చెన్నైగా ఎంపిక అయింది. ఆ తర్వాత తమిళ సినిమాలతో తన కెరీర్ ఆరంభించింది. అనంతరం మలయాళం, తెలుగు, కన్నడంలోనూ కొన్ని సినిమాల్లో నటించింది.


సుదీర్ఘకాలం పాటు సినిమాల్లో హీరోయిన్ గా తన సత్తాను చాటిన కస్తూరి బుల్లితెరపై కూడా సీరియల్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలు సీరియల్లలో నటిస్తూ ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటుంది కస్తూరి.  కాగా, కస్తూరి తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్లుగా అనౌన్స్ చేసింది. చెన్నైలోని పొయెస్ గార్డెన్ లోని తన ఇంట్లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ మీటింగ్ లో భాగంగా తాను తెలుగు వాళ్ళను అవమానించానంటూ ఓ వీడియో వైరల్ అవుతుందని దానిని నమ్మొద్దు అంటూ రిక్వెస్ట్ చేసింది.


తాను తెలుగువారిని అవమానించే దానిని కాదని వెల్లడించింది. డీఎంకేకి సనాతన ధర్మాన్ని అనుసరించి వారంటే గిట్టదన్న కస్తూరి.... వారి అన్యాయాలను బయటపెడుతున్నందు వల్లనే తనను టార్గెట్ చేశారన్నారు. తెలుగు అంటే తనకు చాలా గౌరవమని చెప్పింది. అందుకే తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్టుగా వెల్లడించింది.


తాను పవన్ కళ్యాణ్ అభిమానిని అని కస్తూరి చెప్పుకొచ్చింది. సనాతన ధర్మ పరిరక్షణ నినాదాన్ని తెలంగాణ వ్యాప్తంగా తీసుకెళ్తానంటూ అనౌన్స్ చేసింది. అయితే తాను జనసేనలో చేరుతున్నట్లుగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక కొంతమంది కస్తూరి జనసేన పార్టీలోకి వెళ్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. కస్తూరి శంకర్ అంతా ఫేక్‌ అని... ఆమెను జనసేన పార్టీలో రానిచ్చేది లేదని మరికొంత మంది అంటున్నారట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మెగాస్టార్ చిరంజీవికి భార్యగా చెల్లిగా నటించిన ఏకైక సౌత్ స్టార్ హీరోయిన్ ఎవరంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>