MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balaya-legend-movie-boyapati7ff56f47-9ddd-4a2b-94e6-bb649a6bdb18-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balaya-legend-movie-boyapati7ff56f47-9ddd-4a2b-94e6-bb649a6bdb18-415x250-IndiaHerald.jpg•సీనియర్ హీరోలలో బాలయ్యకే ఆ రికార్డ్స్ సొంతం.. •లెజెండ్ సినిమా 1000 5 రోజులకు పైగా ఆడింది.. •31 సెంటర్లలో వంద రోజులకు పైగా ఆడి సరికొత్త రికార్డు.. టాలీవుడ్ సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన రెండవ చిత్రం లెజెండ్.. ఈ చిత్రం 2014లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్నది. ముఖ్యంగా సీనియర్ హీరోలలో ఎవరికి సాటి రాని విధంగా ఏకంగా ఒక సరికొత్త రికార్డును సృష్టించారు బాలయ్య. ప్రొద్దుటూరులోని ఒక థియేటర్లో ఏకంగా 1005 రోజులకు పైగా లెజెండ్ సినిమా ఆడింది. ఈ సినిమా 100 రోజులుBALAYA;LEGEND;MOVIE;BOYAPATI{#}Sonal Chauhan;boyapati srinu;radhika;Audio;Legend;Audi;Audience;Posters;Balakrishna;Heroine;100 days;Chitram;cinema theater;Cinemaలెజెండ్ తో భారీ రికార్డ్ క్రియేట్ చేసిన బాలయ్య.. 100 రోజులు 31 సెంటర్లలో సరికొత్త రికార్డ్.!లెజెండ్ తో భారీ రికార్డ్ క్రియేట్ చేసిన బాలయ్య.. 100 రోజులు 31 సెంటర్లలో సరికొత్త రికార్డ్.!BALAYA;LEGEND;MOVIE;BOYAPATI{#}Sonal Chauhan;boyapati srinu;radhika;Audio;Legend;Audi;Audience;Posters;Balakrishna;Heroine;100 days;Chitram;cinema theater;CinemaTue, 05 Nov 2024 10:16:00 GMT•సీనియర్ హీరోలలో బాలయ్యకే ఆ రికార్డ్స్ సొంతం..

•లెజెండ్ సినిమా 1000 5 రోజులకు పైగా ఆడింది..

•31 సెంటర్లలో వంద రోజులకు పైగా ఆడి సరికొత్త రికార్డు..


టాలీవుడ్ సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ,  బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన రెండవ చిత్రం లెజెండ్.. ఈ చిత్రం 2014లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్నది. ముఖ్యంగా సీనియర్ హీరోలలో ఎవరికి సాటి రాని విధంగా ఏకంగా ఒక సరికొత్త రికార్డును సృష్టించారు బాలయ్య. ప్రొద్దుటూరులోని ఒక థియేటర్లో ఏకంగా 1005 రోజులకు పైగా లెజెండ్ సినిమా ఆడింది. ఈ సినిమా 100 రోజులు 31 సెంటర్లలో.. రెండు సెంటర్లలో 175.. 200.. 275.. 365 రోజులు ఆడి మంచి విజయాలను అందుకుంది. రూ.70 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాలయ్య కెరియర్ లోనే సూపర్ హిట్ గా నిలిచింది లెజెండ్ చిత్రం.


జగపతిబాబు విలన్ గా మొట్టమొదట నటించిన చిత్రం ఇది.. హీరోయిన్స్ గా రాధిక ఆప్టే, సోనాల్ చౌహన్ నటించిన లెజెండ్ సినిమా విడుదలైన మొదటి వారంలోనే రూ.31 కోట్లకు పైగా కలెక్షన్స్  ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. ఈ సినిమా శాటిలైట్, ఆడియో రైట్స్, థియేట్రికల్ హక్కులు అన్నీ కూడా రూ. 15 కోట్లకు అమ్ముడుపోయాయట. అయితే ఇలాంటి రికార్డులను సీనియర్ హీరోలు సైతం తిరగ రాయలేరని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సినిమాలు కనీసం నెల రోజులు ఆడాలన్నా కూడా చాలా గగనంగా మారిపోయింది.


అందుకు ముఖ్య కారణం ఓటీటిలే.. వీటివల్లే చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదట.. అంతేకాకుండా థియేటర్లకు వస్తే ఒక చిన్న ఫ్యామిలీ కైనా సరే దాదాపుగా రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇలా టికెట్ ధరలు అధికంగా పెంచడమే కాకుండా.. లోపల పాప్ కార్న్, వాటర్ బాటిల్ వంటి వాటి పైన భారీగా ధరలు పెంచేయడంతో సామాన్యులు సైతం థియేటర్ కి రావడం కష్టంగా మారిపోయింది. భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లో విడుదలై నెల రోజులు ఆడాయి అంటే కచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనేలా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మారిపోయింది. అప్పట్లో 50 రోజులు, 75 రోజులు, 100 రోజులు ఇలాంటి పోస్టర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కనీసం 50 రోజుల పోస్టర్ రిలీజ్ చేయాలన్నా కూడా అంతవరకు థియేటర్లో సినిమా కనిపించడం లేదు. అందుకే చాలామంది ప్రస్తుతం ఫస్ట్ డే కలెక్షన్స్ నుంచి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ వరకు సరికొత్త పోస్టర్లతో అభిమానులను మెప్పిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇండ‌స్ట్రీలో బాల‌య్య ఒక్క‌డిదే ఆ రికార్డ్‌..100 కాదు 300 రోజులు ఒకే థియేటర్‌ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>