MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pokiri-movie-mahesh-babu-ileana-puri-jagannadh020de549-d66b-48e3-8d8b-451850ecdd01-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pokiri-movie-mahesh-babu-ileana-puri-jagannadh020de549-d66b-48e3-8d8b-451850ecdd01-415x250-IndiaHerald.jpgమహేష్ బాబు కెరియర్ లో పోకిరి కి ముందు ఒక లెక్క పోకిరి తర్వాత మరో లెక్క అనే విధంగా తయారయింది. ఇంతకు ముందు అన్ని సినిమాల్లో ఒకే లుక్ మెయింటైన్ చేస్తూ వచ్చిన మహేష్ బాబుకు పోకిరిలో మాస్ గెటప్ లో సరికొత్త హెయిర్ స్టైల్ తో అంతా కొత్తగా కనిపించాడు. జీన్స్ పాయింటు షర్టు మీద షర్ట్.. ఇక పండుగాడు క్యారెక్టర్ లో చాలా డిఫరెంట్ కనిపించేలా చేశాడు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఈ సినిమాకు డైలాగ్స్ మాత్రం మరో లెక్క.. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు అంటూ అప్పట్లో జనాల మైండ్లో ఈ డైPOKIRI MOVIE; MAHESH BABU; ILEANA; PURI JAGANNADH{#}ali reza;100 days;Ileana D'Cruz;Pokiri;mahesh babu;mani sharma;Chitram;Industry;Director;Mass;Love;Blockbuster hit;Telugu;Cinemaపోకిరి: బాక్సాఫీస్ ని చెడుగుడాడేసిన పండుగాడు.. మహేష్ మానియాకి ఇండస్ట్రీ షేక్.!!పోకిరి: బాక్సాఫీస్ ని చెడుగుడాడేసిన పండుగాడు.. మహేష్ మానియాకి ఇండస్ట్రీ షేక్.!!POKIRI MOVIE; MAHESH BABU; ILEANA; PURI JAGANNADH{#}ali reza;100 days;Ileana D'Cruz;Pokiri;mahesh babu;mani sharma;Chitram;Industry;Director;Mass;Love;Blockbuster hit;Telugu;CinemaTue, 05 Nov 2024 09:47:00 GMT-ఇండస్ట్రీ దిమ్మతిరిగేలా బ్లాక్ బస్టర్ అయినా పోకిరి..
- మహేష్ కెరియర్ మారిపోయింది..
- పూరికే కన్నీళ్లు తెప్పించిన మూవీ..

 మహేష్ బాబు క్లాస్, లవ్ సినిమాల్లో  మాత్రమే సెట్ అవుతాడు అనుకున్న సమయంలో వచ్చిన మూవీ ఒక్కడు. మాస్ లుక్ లో మహేష్ బాబును చూపించి హిట్ కొట్టారు.. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుకు అన్ని క్లాస్ సినిమాలే పడ్డాయి. ఇందులో ఒక్కటి కూడా సరైన హిట్ అందుకోలేదు.. ఇక మహేష్ కెరియర్ కాస్త డల్ అవుతుంది అనే సమయంలో వచ్చింది. మాస్ లవ్ ఎంటర్టైన్మెంట్ అన్ని కలగలిపినటువంటి మూవీ  పోకిరి.. ఈ సినిమా థియేటర్లలో దండయాత్ర చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఈ సినిమా గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.

 థియేటర్లలో దండయాత్ర:

 మహేష్ బాబు కెరియర్ లో పోకిరి కి ముందు ఒక లెక్క పోకిరి తర్వాత మరో లెక్క అనే విధంగా తయారయింది. ఇంతకు ముందు అన్ని సినిమాల్లో ఒకే లుక్ మెయింటైన్ చేస్తూ వచ్చిన  మహేష్ బాబుకు పోకిరిలో మాస్ గెటప్ లో సరికొత్త హెయిర్ స్టైల్ తో అంతా కొత్తగా కనిపించాడు. జీన్స్ పాయింటు షర్టు మీద షర్ట్.. ఇక పండుగాడు క్యారెక్టర్ లో చాలా డిఫరెంట్ కనిపించేలా చేశాడు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఈ సినిమాకు డైలాగ్స్ మాత్రం మరో లెక్క..   ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు అంటూ అప్పట్లో జనాల మైండ్లో ఈ డైలాగే నడిచింది.. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా, ఇలా మహేష్ చెప్పిన ప్రతి డైలాగ్ చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు నరనరానా ఎక్కింది. ఇక దీనికి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది అని చెప్పవచ్చు.. ఇక అద్భుతమైన విజువల్స్ తో మహేష్ నటనతో పాటు ఇలియానా గ్లామర్ కూడా సినిమాకు మరో ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు..

ఇక సాంగ్స్ లో రెచ్చిపోయి డాన్స్ చేస్తూ కుర్రకారు గుక్క తిప్పుకోకుండా చేసింది ఇలియానా.. ఇక బ్రహ్మానందం, ఆలీ కామెడీ ట్రాక్ మరో లెక్క.. ఈ విధంగా పోకిరి కి ముందు ఒక లెక్క పోకిరి తర్వాత మరో లెక్క అనే విధంగా ఇండస్ట్రీకే వణుకు పుట్టేలా సినిమా హిట్ అయింది.. 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో పోకిరి ఒక అరుదైన రికార్డుగా నిలిచింది.. 299 సెంటర్లలో 50 రోజులు ఆడింది.. 200 సెంటర్స్లో 100 రోజులు ఆడింది.. అప్పటివరకు ఐమాక్స్లో నాలుగు షోలతో 100 రోజులు ఆడిన సినిమా లేదు. కానీ ఆ ఘనత పోకిరి సినిమాకి దక్కింది..  63 కేంద్రాల్లో 175 రోజులు పూర్తిచేసుకుని రికార్డు క్రియేట్ చేసింది. కర్నూల్ లో ఏకంగా 500 రోజులు ఆడింది ఈ చిత్రం.. అంతేకాకుండా ఈ చిత్రానికి నాలుగు నంది అవార్డులు, రెండు ఫిలిం ఫేర్ అవార్డులు కూడా వచ్చాయి.. 10 కోట్ల బడ్జెట్ తో వచ్చినటువంటి ఈ చిత్రం 45 కోట్ల షేర్స్ లభించి, 70 కోట్ల గ్రాస్ తో రికార్డు తిరగరాసి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది అని చెప్పవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కేటీఆర్ ప్లాన్ ని ముందే అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>