Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/producer-dilraju-interesting-comments-985ebdaf-4f7b-4809-a895-a381ee49f992-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/producer-dilraju-interesting-comments-985ebdaf-4f7b-4809-a895-a381ee49f992-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో భాషా బేధం అనేది లేకుండా పోయింది. కథలో కొత్తదనం ఉంటే చాలు సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఆ సినిమాను సూపర్ హిట్ చేసేస్తున్నారు. అందులో నటించింది స్టార్ హీరోలా.. లేకపోతే అది ఏ భాష సినిమా అన్న విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదు అన్న విషయం తెలిసిందే. అందుకే మన హీరోలు ఇతర భాషల్లో తమ సినిమాలను విడుదల చేయడం ఇతర భాషల హీరోలు తెలుగులో కూడా సినిమాలను విడుదల చేసి సూపర్ హిట్ కొట్టడం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇలా తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా ప్రత్యేకమైన గుర్తింపdilraju{#}gemini ganesan;Mahanati;dulquer salmaan;dil raju;producer;Producer;bhaskar;Baba Bhaskar;Success;Tamil;Telugu;Yevaru;Event;Audience;Cinemaఆ హీరోతో సినిమా చేసే వారు జాగ్రత్త.. నిర్మాత దిల్ రాజు కామెంట్స్?ఆ హీరోతో సినిమా చేసే వారు జాగ్రత్త.. నిర్మాత దిల్ రాజు కామెంట్స్?dilraju{#}gemini ganesan;Mahanati;dulquer salmaan;dil raju;producer;Producer;bhaskar;Baba Bhaskar;Success;Tamil;Telugu;Yevaru;Event;Audience;CinemaMon, 04 Nov 2024 12:15:00 GMTఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో భాషా బేధం అనేది లేకుండా పోయింది. కథలో కొత్తదనం ఉంటే చాలు సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఆ సినిమాను సూపర్ హిట్ చేసేస్తున్నారు. అందులో నటించింది స్టార్ హీరోలా.. లేకపోతే అది ఏ భాష సినిమా అన్న విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదు అన్న విషయం తెలిసిందే. అందుకే మన హీరోలు ఇతర భాషల్లో తమ సినిమాలను విడుదల చేయడం ఇతర భాషల హీరోలు తెలుగులో కూడా సినిమాలను విడుదల చేసి సూపర్ హిట్ కొట్టడం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం.


 అయితే ఇలా తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో దుల్కర్ సల్మాన్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు దుల్కర్ సల్మాన్ నటించిన ఎన్నో సినిమాలను తెలుగులో కూడా విడుదల చేశారు. ఇక ఇక్కడ సూపర్ హిట్ కొట్టాడు. మరీ ముఖ్యంగా మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించి ఇక పాత్రకి ప్రాణం పోసాడు దుల్కర్ సల్మాన్. ఇక తర్వాత సీతారామం అనే మూవీతో ఎంత సూపర్ హిట్ను కొట్టాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాలకు బాగా దగ్గరయ్యాడు.


 ఇటీవల లక్కీ భాస్కర్ అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక డబ్ సినిమా అయినప్పటికీ ఇక్కడ మంచి వసూళ్లు సాధిస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల సక్సెస్ మీట్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి వచ్చిన నిర్మాత దిల్ రాజు.. అటు దుల్కర్ సల్మాన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. విభిన్నమైన పాత్రలతో దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నాడు అంటూ దిల్రాజు ప్రశంసంచారు. ఇప్పటివరకు తెలుగులో విడుదల చేసిన మూడు సినిమాలు మూడు క్లాసిక్ హిట్స్. ఇక ఇప్పుడూ దుల్కర్ దగ్గరికి నాలుగో స్క్రిప్ట్ తో ఎవరు వెళ్తారో కానీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీటికి మించిన స్క్రిప్ట్ తీసుకువెళ్లాలి అంటూ దిల్ రాజు వ్యాఖ్యానించాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ స్పెషల్ ప్లేస్‌లోనే.. నాగచైతన్య- శోభిత పెళ్లి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>