MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rahul-dev2bf4304e-c593-4510-ab19-7005fb7ca725-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rahul-dev2bf4304e-c593-4510-ab19-7005fb7ca725-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా మంచి గుర్తింపును సంపాదించుకోవడం సులువైన విషయం కాదు. అయితే రాహుల్ దేవ్ మాత్రం తన ప్రతిభతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆకాశవీధిలో సినిమాలో టెర్రరిస్ట్ రోల్ తో రాహుల్ దేవ్ కెరీర్ మొదలైంది. టక్కరిదొంగ, సింహాద్రి, సీతయ్య సినిమాలతో ఈ నటుడికి విలన్ గా మంచి పేరు వచ్చింది. ఆంధ్రావాలా, మాస్ సినిమాల్లో సైతం రాహుల్ దేవ్ కు మంచి పాత్రలు దక్కాయి. rahul dev{#}Rahul Dev;Mass;Athadu;Industry;Cinemaమాస్ విలన్ గా భారీ హిట్లు అందుకున్న రాహుల్ దేవ్.. ఆ రీజన్ వల్లే ఆఫర్లు తగ్గాయా?మాస్ విలన్ గా భారీ హిట్లు అందుకున్న రాహుల్ దేవ్.. ఆ రీజన్ వల్లే ఆఫర్లు తగ్గాయా?rahul dev{#}Rahul Dev;Mass;Athadu;Industry;CinemaMon, 04 Nov 2024 10:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా మంచి గుర్తింపును సంపాదించుకోవడం సులువైన విషయం కాదు. అయితే రాహుల్ దేవ్ మాత్రం తన ప్రతిభతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆకాశవీధిలో సినిమాలో టెర్రరిస్ట్ రోల్ తో రాహుల్ దేవ్ కెరీర్ మొదలైంది. టక్కరిదొంగ, సింహాద్రి, సీతయ్య సినిమాలతో ఈ నటుడికి విలన్ గా మంచి పేరు వచ్చింది. ఆంధ్రావాలా, మాస్ సినిమాల్లో సైతం రాహుల్ దేవ్ కు మంచి పాత్రలు దక్కాయి.
 
అతడు సినిమాలో కీలకమైన పాత్రలో నటించి తన నటనతో అదరగొట్టిన రాహుల్ దేవ్ అటు మాస్ పాత్రల్లో ఇటు క్లాస్ పాత్రల్లో నటించారు. అయితే ఈ నటుడికి క్లాస్ పాత్రల కంటే మాస్ పాత్రలే మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇంటెలిజెంట్ సినిమా తర్వాత రాహుల్ దేవ్ తెలుగులో ఏ సినిమాలో కూడా నటించలేదు. రాహుల్ దేవ్ గత మూడేళ్లుగా షూటింగ్స్ కు సైతం దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.
 
రాహుల్ దేవ్ వయస్సు ప్రస్తుతం 56 సంవత్సరాలు కాగా రాహుల్ దేవ్ వ్యక్తిగత కారణాల వల్లే రాహుల్ దేవ్ షూటింగ్స్ కు దూరంగా ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ దేవ్ విలనిజంను మాత్రం సినిమాలలో మిస్ అవుతున్నామని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఆయన పర్ఫామెన్స్ వల్లే కొన్ని సినిమాలు హిట్ అయ్యాయని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.
 
రాహుల్ దేవ్ కొడుకు కెరీర్ కోసం తన కెరీర్ ను త్యాగం చేశారని  ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రాహుల్ దేవ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం తక్కువేం కదు. రాహుల్ దేవ్ మోడల్ గా సైతం తనకంటూ గుర్తింపును సొంతం చేసుకున్నారు. హిందీ, తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, ఒరియా, మలయాళ సినిమాలలో నటించారు. నటుడు  రాహుల్ దేవ్ యాక్టింగ్ ఇతర నటీనటులకు భిన్నంగా ఉంటుంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అందరికీ కడుపునిండా అన్నం పెట్టే ప్రభాస్.. సిగ్గు పడకుండా కంచెం నాకేసేది ఆ ఒక్క స్టార్ ఇంట్లోనే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>