MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd307184e-465b-4333-92d2-5f1a35848fdd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd307184e-465b-4333-92d2-5f1a35848fdd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ యువసామ్రాట్‌ విజయ్ దేవరకొండ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టైలిష్‌ లుక్‌తో యూత్‌ని తనవైపు తిప్పుకున్న ఈ హీరో, ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌. ఇక ఈ టాలీవుడ్ స్టార్ హీరో ప్రస్తుతం తన కెరీర్‌లో ఒక ఉత్కంఠభరితమైన దశలో ఉన్నారు. ముఖ్యంగా ఆయన నటిస్తున్న VD12 సినిమాపై అభిమానుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. విజయ్ దేవరకొండ తన ప్రతి సినిమాతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారు. ఈ సారి కూడా ఆయన ఏదో కొత్త ప్రయత్నం చేయబోతున్నారని అంటున్నారు. VD12 tollywood{#}gautham new;gautham;rahul;ravi kiran;vijay deverakonda;Tollywood;Hollywood;Hero;Rahul Sipligunj;Joseph Vijay;Cinema;Teluguవిజయ్ దేవరకొండ సినిమాలో ది మమ్మీ విలన్ ఎంట్రీ!!విజయ్ దేవరకొండ సినిమాలో ది మమ్మీ విలన్ ఎంట్రీ!!tollywood{#}gautham new;gautham;rahul;ravi kiran;vijay deverakonda;Tollywood;Hollywood;Hero;Rahul Sipligunj;Joseph Vijay;Cinema;TeluguMon, 04 Nov 2024 12:30:00 GMTటాలీవుడ్‌ యువసామ్రాట్‌ విజయ్ దేవరకొండ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టైలిష్‌ లుక్‌తో యూత్‌ని తనవైపు తిప్పుకున్న ఈ హీరో, ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌. ఇక ఈ  టాలీవుడ్ స్టార్ హీరో ప్రస్తుతం తన కెరీర్‌లో ఒక ఉత్కంఠభరితమైన దశలో ఉన్నారు. ముఖ్యంగా ఆయన నటిస్తున్న VD12 సినిమాపై అభిమానుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది.  విజయ్ దేవరకొండ తన ప్రతి సినిమాతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారు. ఈ సారి కూడా ఆయన ఏదో కొత్త ప్రయత్నం చేయబోతున్నారని అంటున్నారు. VD12 సినిమా కథ, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ఎంతో రహస్యంగా ఉంచబడుతున్నాయి. దానితో ఈ సినిమా పై అభిమానులకు మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఇకపోతే ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి VD12 మూవీని తెరకెక్కిస్తున్నారు. 

ఈ సినిమాలో విజయ్ ఓ స్పైలా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ తో కలిసి ‘ట్యాక్సీవాలా’ సినిమా చేసిన రాహుల్ సంకృత్యాన్ తో కలిసి మరో సినిమా కూడా చేస్తున్నారు విజయ్. ఈ సినిమా తన కెరీర్ లో 14వ చిత్రంగా తెరకెక్కబోతుంది. ‘ఇతిహాసాలను ఎవరూ రాయరు.. అవి హీరోల రక్తంతో చెక్కబడతాయి’ అంటూ షేర్ చేసిన ఈ మూవీ పోస్టర్ ఇప్పుడు ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచింది. మరోవైపు రవి కిరణ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ VD15 అనే సినిమా చేస్తున్నారు. ఇకపోతే రాహుల్ సంకృత్యాన్, విజయ్ కాంబలో VD 14 సినిమా తెరకెక్కబోతుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఇండస్ట్రీలో ఒక క్రేజీ వార్త బయటికి వచ్చింది. ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో నటించబోతున్నాడని వార్తల వినిపిస్తున్నాయి. 

ది మమ్మీ' సిరీస్‌లోని భయంకరమైన ఇమ్‌హోటెప్ పాత్రతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆర్నాల్డ్ వోస్లూ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఇక ఆయన VD 14 సినిమాలో విలన్ పాత్ర గురించి చిత్ర బృందం ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన పాత్రకు సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే విజయ్ దేవరకొండ సినిమాలో హాలీవుడ్ స్టార్ నటించబోతున్నారనే వార్త సినీ ప్రేమికులను ఉత్సాహంగా ఉంచుతోంది. హాలీవుడ్ స్టార్‌ ను తెలుగు సినిమాలో తీసుకోవడం తెలుగు సినిమాకు మంచి గుర్తింపును తెస్తుంది అని చెప్పవచ్చు.ఆర్నాల్డ్ వోస్లూలాంటి ప్రతిభావంతుడైన నటుడిని తెలుగు తెరపై చూడటం ప్రేక్షకులకు వినోదాన్ని కలిగిస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ స్పెషల్ ప్లేస్‌లోనే.. నాగచైతన్య- శోభిత పెళ్లి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>