Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-tapsee0c53a185-ca0d-4e18-8932-26cc3325c2a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-tapsee0c53a185-ca0d-4e18-8932-26cc3325c2a0-415x250-IndiaHerald.jpgక్యూట్ బ్యూటీ తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఝమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది.. ఆ సినిమాలో మంచు మనోజ్ హీరోగా నటించగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆ సినిమాను తెరకెక్కించారు.. సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన తాప్సీని రాఘవేంద్రరావు అద్భుతంగా చూపించారు.. ఆ సినిమా తరువాత తాప్సీకి వరుస అవకాశాలు వచ్చాయి.. ప్రభాస్ తో నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ మినహా మిగిలిన అంతగా ఆకట్టుకోలేదు.. దీనితో తాప్సీ టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది.. అయితే టాలీవుడ్ నుం#tapsee{#}Prabhas;Shahrukh Khan;Varun Dhawan;manchu manoj kumar;bollywood;Tollywood;Heroine;Mr Perfect;Yevaru;BEAUTY;Cinemaహీరోయిన్ ని కూడా వాళ్లే డిసైడ్ చేస్తారు.. సినీ ఇండస్ట్రీ పై తాప్సీ బోల్డ్ కామెంట్స్..!!హీరోయిన్ ని కూడా వాళ్లే డిసైడ్ చేస్తారు.. సినీ ఇండస్ట్రీ పై తాప్సీ బోల్డ్ కామెంట్స్..!!#tapsee{#}Prabhas;Shahrukh Khan;Varun Dhawan;manchu manoj kumar;bollywood;Tollywood;Heroine;Mr Perfect;Yevaru;BEAUTY;CinemaMon, 04 Nov 2024 12:13:35 GMTక్యూట్ బ్యూటీ తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తాప్సీ ఝమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది.. ఆ సినిమాలో మంచు మనోజ్ హీరోగా నటించగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆ సినిమాను తెరకెక్కించారు.. సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన తాప్సీని రాఘవేంద్రరావు అద్భుతంగా చూపించారు.. ఆ సినిమా తరువాత తాప్సీకి వరుస అవకాశాలు వచ్చాయి.. ప్రభాస్ తో నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ మినహా మిగిలిన సినిమాలు  అంతగా ఆకట్టుకోలేదు.. దీనితో తాప్సీ టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది.. అయితే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్‌ మేకర్స్ గురించి, స్టార్ హీరోల గురించి నెగటివ్ కామెంట్స్ చేయడం కామన్ అయిపోయింది.అయితే ఆ విషయంలో తాప్సీ మాత్రం కాస్త డిఫరెంట్. తనకు నచ్చకపోతే సౌత్, నార్త్ అని తేడా లేకుండా అందరి గురించి ఒకే విధంగా మాట్లాడుతుంది. తాజాగా తాప్సీ  బాలీవుడ్ స్టార్ హీరోలపై మరోసారి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. 

బాలీవుడ్‌కు వెళ్ళాక అక్కడ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనే తాప్సీ క్రేజ్ తెచ్చుకుంది... ఒకవైపు స్టార్ హీరోల సరసన ఆఫర్స్ అందుకుంటూనే యాక్టింగ్‌కు స్కోప్ ఉండే లేడీ ఓరియెంటెడ్ కథలను సైతం ఎంచుకుని అద్భుతంగా రానిస్తుంది. అయితే స్టార్ హీరోల సరసన నటించడం వల్ల కలిగే నష్టాల గురించి తాప్సీ ఓపెన్‌గా చెప్పేసింది.తాను షారుఖ్ ఖాన్ సరసన నటించిన 'డంకీ' సినిమాకు అలాగే వరుణ్ ధావన్ సరసన 'జుడ్వా 2 వంటి కమర్షియల్ చిత్రాలకు తనకు పెద్దగా రెమ్యునరేషన్ దక్కలేదని తాప్సీ షాకింగ్ కామెంట్స్ చేసింది..నాకు నటిగా స్కోప్ వున్న చిత్రాలలోనే ఎక్కువగా రెమ్యూనరేషన్ వస్తుంది అని ఆమె చెప్పుకొచ్చింది..ఈరోజుల్లో తమ సినిమాల్లో హీరోయిన్‌గా ఎవరు నటించాలి అనే విషయాన్ని హీరోలే డిసైడ్ చేస్తారని ప్రేక్షకులకు తెలుసు.. దర్శకులు సీనియర్ అయ్యిండి ప్రేక్షకుల గురించి ఆలోచించేవారు అయితే మాత్రమే హీరోయిన్‌ను ఎవరిని తీసుకోవాలో ఆయనే నిర్ణయం తీసుకుంటారు.. కానీ ప్రస్తుతం ఆ విషయంలో హీరోలదే పై చేయి అని తాప్సీ తెలిపింది..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ స్పెషల్ ప్లేస్‌లోనే.. నాగచైతన్య- శోభిత పెళ్లి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>