MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc21620ff-4e56-4314-b8f3-3766efe5b356-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc21620ff-4e56-4314-b8f3-3766efe5b356-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్ సలార్ 2 ప్రాజెక్ట్. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సలార్ పార్ట్‌1 భారీ విజయాన్ని సాధించడంతో సీక్వెల్‌ పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో హుంబలే నిర్మాణ సంస్థ ప్రభాస్‌ తో మరో సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సలార్ 2 విషయంలో కొన్ని అంతరాలు ఏర్పడ్డాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ 2 కన్నా ముందు ఎన్టీఆర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నtollywood{#}Kanna Lakshminarayana;Prize;Prashant Kishor;Prasanth Neel;prashanth neel;prasanth;Darsakudu;Prabhas;Audience;NTR;News;Cinema;Directorసలార్ 2 అటకెక్కిందా? హోంబలే కాంబోలో ప్రభాస్ మరో సినిమా?సలార్ 2 అటకెక్కిందా? హోంబలే కాంబోలో ప్రభాస్ మరో సినిమా?tollywood{#}Kanna Lakshminarayana;Prize;Prashant Kishor;Prasanth Neel;prashanth neel;prasanth;Darsakudu;Prabhas;Audience;NTR;News;Cinema;DirectorMon, 04 Nov 2024 11:30:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్ సలార్ 2 ప్రాజెక్ట్. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సలార్ పార్ట్‌1 భారీ విజయాన్ని సాధించడంతో సీక్వెల్‌ పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో హుంబలే నిర్మాణ సంస్థ ప్రభాస్‌ తో మరో సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సలార్ 2 విషయంలో కొన్ని అంతరాలు ఏర్పడ్డాయనే వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ 2 కన్నా ముందు ఎన్టీఆర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. దాంతో నెక్స్ట్ మంత్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

అయితే ప్రశాంత్ నీరు ఇప్పుడు ఈ సినిమాపై దృష్టి  సారించడంతో సలార్ 2 పనులు నిలిచిపోయాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై నిర్మాతలు, దర్శకుడు ఇప్పటి వరకు స్పందించలేదు. హుంబలే నిర్మాణ సంస్థ ప్రభాస్‌ తో ఇప్పటికే సలార్ సిరీస్ చేసి మంచి విజయం సాధించింది. ఈ విజయం తర్వాత వీరిద్దరూ మరో సినిమా చేయబోతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ తో ఆదిపురుష్ ని తీసిన ఓం రౌత్ డైరెక్షన్ లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. సలార్ 1 సూపర్ హిట్ కాగా సలార్ 2 ని సినిమా కూడా వెంటనే చేస్తారని భావించిన ఫ్యాన్స్ కి ప్రశాంత్,డార్లింగ్ ఇద్దరు షాక్ ఇచ్చారు.

సలార్ 2 విషయంలో ఏం జరుగుతుంది అనేది బయటకు రావట్లేదు. ఐతే సలార్ 2 కన్నా ముందు హోంబలె బ్యానర్ లో ప్రభాస్ మరో సినిమా చేయడం ఫ్యాన్స్ కి  సర్ ప్రైజ్ గా మారింది. కానీ సలార్ 2 సినిమా లోనే అసలు కథ మొత్తం ఉంది. మరి అలాంటిది ప్రశాంత్ నీల్ ఈ సినిమాను పక్కన పెటి మరో సినిమా ఎందుకు చేస్తున్నాడో అర్ధం కావట్లేదు. ఇప్పుడు  ఎన్టీఆర్  తో  చేస్తున్న సినిమా కూడా రెండు భాగాలుగా  ఉండబోతుందని తెలుస్తుంది. ఇకపోతే సలార్ 2 విషయంలో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ హుంబలే నిర్మాణ సంస్థ ప్రభాస్‌ తో మరో సినిమా చేయబోతున్నారనే వార్త ప్రేక్షకులను ఉత్సాహపరుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వక్ఫ్ చట్టంలో కేంద్రం తెచ్చిన సవరణలు ఇవే.. ఈ చట్టంపై ప్రజల అభిప్రాయమిదే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>