PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-ycpb4470e26-675f-47b3-9422-57e3fde57f33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-ycpb4470e26-675f-47b3-9422-57e3fde57f33-415x250-IndiaHerald.jpgవైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లపాటు ఇష్టం వచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలను అరెస్టు చేయటం రకరకాల కేసులు పెట్టి వేధించడం జైలులో పెట్టడం జరిగాయి. చివరకు అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుని సైతం జైలులో పెట్టి ఏకంగా 50 రోజులపాటు ఉంచారు. ఇక పార్టీ యువనేత ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారా లోకేష్ సైతం యువ‌గలం పాదయాత్ర చేసినప్పుడు రెడ్బుక్ అని ఒక పుస్తకం ఓపెన్ చేసి ఆ పుస్తకంలో పలువురు వైసీపీ నేతలతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలను వేధించిన పలువురు పోలీసు అధికారYCP{#}vamsi;gannavaram;Nara Lokesh;Telugu Desam Party;Ishtam;police;MLA;kalyan;CBN;NTR;Lokesh;Lokesh Kanagaraj;TDP;YCP;Minister;Partyత్వ‌ర‌లోనే అరెస్టు అయ్యే వైసీపీ నేత‌లు వీళ్లే... లిస్టులో టాప్ మెంబ‌ర్స్ ఉన్నారే..!త్వ‌ర‌లోనే అరెస్టు అయ్యే వైసీపీ నేత‌లు వీళ్లే... లిస్టులో టాప్ మెంబ‌ర్స్ ఉన్నారే..!YCP{#}vamsi;gannavaram;Nara Lokesh;Telugu Desam Party;Ishtam;police;MLA;kalyan;CBN;NTR;Lokesh;Lokesh Kanagaraj;TDP;YCP;Minister;PartyMon, 04 Nov 2024 08:40:13 GMTఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆసక్తి పరిణామాలు చోటు చేసుకునేందుకు రంగం సిద్ధం అవుతుంది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లపాటు ఇష్టం వచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలను అరెస్టు చేయటం రకరకాల కేసులు పెట్టి వేధించడం జైలులో పెట్టడం జరిగాయి. చివరకు అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుని సైతం జైలులో పెట్టి ఏకంగా 50 రోజులపాటు ఉంచారు. ఇక పార్టీ యువనేత ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారా లోకేష్ సైతం యువ‌గలం పాదయాత్ర చేసినప్పుడు రెడ్బుక్ అని ఒక పుస్తకం ఓపెన్ చేసి ఆ పుస్తకంలో పలువురు వైసీపీ నేతలతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలను వేధించిన పలువురు పోలీసు అధికారుల పేర్లను నమోదు చేసుకున్నారు.


లోకేష్ పాదయాత్ర ఎన్ని నియోజకవర్గాల మీదుగా వెళితే అన్నిచోట్ల కూడా లోకేష్ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను.. నాయకులను ఇబ్బంది పెట్టిన వైసీపీ మంత్రులు.. ఎమ్మెల్యేలు వైసీపీకి చెందిన నేతలతో పాటు పలువురు పోలీసు అధికారుల పేర్లను నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక లోకేష్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్బుక్ ఓపెన్ చేస్తానని తెలుగుదేశం పార్టీ క్యాడర్ను ఇబ్బందులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటానని చెబుతూ వస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొందరు వైసీపీకి చెందిన నేతలను అరెస్టు చేయడంతో పాటు టీడీపీ కేడర్ను బాగా ఇబ్బంది పెట్టిన కొందరు అధికారులపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు.


ఈ క్రమంలోనే అప్పట్లో చంద్రబాబు - లోకేష్ పవన్ కళ్యాణ్ తో పాటు చివరకు ఎన్టీఆర్ ఫ్యామిలీ పై తీవ్రమైన విమర్శలు చేసిన కొందరు నేత‌ల‌పై ఎప్పటికీ చర్యలు ఉంటాయా అని ప్రతి ఒక్కరు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే రెడ్‌బుక్ చాప్టర్ 3 పేరుతో లోకేష్ చేసిన వ్యాఖ్యలతో వైసిపి నేతల్లో గుబులు రేపుతోంది. తర్వాత అరెస్టు అయ్యే లిస్టులో వైసీపీకి చెందిన మాజీ మంత్రులు కొడాలి నానితో పాటు వైసిపి మహిళా పైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించి అనంతరం ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో వైసిపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టార్గెట్ అవుతున్నారని వీరిని అరెస్టు చేయడం గ్యారెంటీ అన్న చర్చలు కూటమి ప్రభుత్వ వర్గాలలో వినిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మంత్రి గొట్టిపాటి అద్దంకికి అదిరిపోయే వ‌రం...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>