PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-brs2b76b245-d156-4470-be7e-f049a7e11c51-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-brs2b76b245-d156-4470-be7e-f049a7e11c51-415x250-IndiaHerald.jpgఅయితే దీనిపై బిఆర్ఎస్ కీలక నేత మాజీమంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే బిఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుంది అని హరీష్ రావు కామెంట్ చేశారు. అటు కేటీఆర్ మాట్లాడుతూ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. మరి హరీష్ రావు చెప్పినట్లు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 100 సీట్లు వస్తాయా ? ఆ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందా ? అన్న చర్చ కూడా నడుస్తోంది. BRS{#}KTR;vedhika;Government;Elections;Yevaru;KCR;Congressఇప్ప‌టికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణ‌లో బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది..!ఇప్ప‌టికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణ‌లో బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది..!BRS{#}KTR;vedhika;Government;Elections;Yevaru;KCR;CongressSun, 03 Nov 2024 10:34:20 GMTతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయింది. ఎవరూ ఊహించిన విధంగా గెలిచిన ఏడాది కాలానికే కాంగ్రెస్ ఈ స్థాయిలో వ్యతిరేకత తెచ్చుకుంటుందా ? అని ఎవరు ఊహించలేకపోయారు. అయితే దీనిపై బిఆర్ఎస్ కీలక నేత మాజీమంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే బిఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుంది అని హరీష్ రావు కామెంట్ చేశారు. అటు కేటీఆర్ మాట్లాడుతూ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. మరి హరీష్ రావు చెప్పినట్లు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 100 సీట్లు వస్తాయా ? ఆ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందా ? అన్న చర్చ కూడా నడుస్తోంది.


అయితే ఇక్కడే మరో టాపిక్ కూడా నడుస్తోంది. తొమ్మిదిన్న‌ర సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఏనాడూ కార్యకర్తల కోసం టైం ఇచ్చింది లేదు అని బిఆర్ఎస్ నేతలు స్వయంగా చెబుతూ ఉంటారు. ఆ మాటకు వస్తే కార్యకర్తలకు మాత్రమే కాదు .. బీఆర్ఎస్ కీలక నాయకులకు కూడా కేటీఆర్ ఎప్పుడు టైం కేటాయించలేదు. ఈ అధికారం కోల్పోయినప్పటి నుంచి కేటీఆర్ ప్రతిరోజు ఎక్స్ వేదిక గా ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులను విమర్శించవద్దు అని ఎవరూ చెప్పరు కానీ కేటీఆర్ చేసే విమర్శలలో పస ఉండాలని .. అదే టైంలో సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు కీలక నాయకులతో ఎప్పటికప్పుడు సమావేశాలు పెడుతూ వారికి టైం కేటాయించాలని చర్చ నడుస్తోంది. కేటీఆర్ - హరీష్ రావు వెర్షన్ ఇలా ఉంటే అడ్డు కేసీఆర్ మాత్రం కనీసం ఏడాది నుంచి ఏడాదిన్నర పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఇవ్వాలని ఆ తర్వాతే ప్రభుత్వంపై విమర్శలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కంటెంట్ లేక కష్టపడుతున్న పుష్ప 2 యూనిట్.. మొదట ఆ తప్పు చేసి ఉండాల్సింది కాదు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>