PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-kutami-chndrababu-duput-cm-pawan-kalyan-bjp1aef95c7-4628-4b9c-b665-d3fa350db560-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-kutami-chndrababu-duput-cm-pawan-kalyan-bjp1aef95c7-4628-4b9c-b665-d3fa350db560-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. ఈనెల 12వ తేదీకి 5 నెలలు పూర్తి అవుతుంది.. ఇలాంటి సమయంలోనే కూటమి ప్రభుత్వం మీద ఏపీ ప్రజలకు పాజిటివ్ పెరిగిందా లేకపోతే వ్యతిరేకత ఏర్పడింది అనే చర్చ ఇప్పుడు కూటమిలో ఒక చర్చ కొనసాగుతోంది. ఎన్నో ఏళ్ల అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ ఆయనతో పాటు ఇద్దరు యువనేతలు కూడా అటు ఇటుగా కొనసాగుతూ ఉన్నారు. అందులో ఒక రూపం ముఖ్యమంత్రి కాగా మరొకరు నారా లోకేష్. ఇక చంద్రబాబు పొలిటికల్ కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా ఇలా కూటమితో కలసి నడిపించాల్సి వచ్చింAP KUTAMI;CHNDRABABU;DUPUT CM;PAWAN KALYAN;BJP{#}Telangana Chief Minister;Andhra Pradesh;CM;Government;YCP;TDP;CBN;Newsఏపీ: కూటమి సర్కార్ మైలేజ్ పెరిగిందా.. తగ్గిందా..?ఏపీ: కూటమి సర్కార్ మైలేజ్ పెరిగిందా.. తగ్గిందా..?AP KUTAMI;CHNDRABABU;DUPUT CM;PAWAN KALYAN;BJP{#}Telangana Chief Minister;Andhra Pradesh;CM;Government;YCP;TDP;CBN;NewsSun, 03 Nov 2024 06:33:00 GMTఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. ఈనెల 12వ తేదీకి 5 నెలలు పూర్తి అవుతుంది.. ఇలాంటి సమయంలోనే కూటమి ప్రభుత్వం మీద ఏపీ ప్రజలకు పాజిటివ్ పెరిగిందా లేకపోతే వ్యతిరేకత ఏర్పడింది అనే చర్చ ఇప్పుడు కూటమిలో ఒక చర్చ కొనసాగుతోంది. ఎన్నో ఏళ్ల అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ ఆయనతో పాటు ఇద్దరు యువనేతలు కూడా అటు ఇటుగా కొనసాగుతూ ఉన్నారు. అందులో ఒక రూపం ముఖ్యమంత్రి కాగా మరొకరు నారా లోకేష్.


ఇక చంద్రబాబు పొలిటికల్ కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా ఇలా కూటమితో కలసి నడిపించాల్సి వచ్చింది.. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కూటమి ప్రభుత్వం చెప్పిన వాటి మీద ప్రజలు బాగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ అందుకు తగ్గట్టుగా ఇప్పుడు కూటమి సర్కార్ మాత్రం పవర్ఫుల్గా జనంలోకి వెళ్లలేకపోతోంది అని చర్చ మొదలయ్యిందట. అందుకు కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయని ముఖ్యంగా ఇసుక మద్యం వంటి వాటిపైన ప్రభుత్వ పాలసీలు దెబ్బతీసేలా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.


ఉచిత ఇసుక అని చెప్పిన గ్రౌండ్ లెవెల్ లో మాత్రం అలాంటి పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదట. అలాగే మద్యం పాలసీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు వైన్ షాపులు ఇవ్వడంతో మద్యం కూడా వైన్ షాపులను దాటేసి ఊరురా బెల్ట్ షాపులు చాలానే వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయట. దీంతో కూటమి ప్రభుత్వం పైన విమర్శలు కూడా వినిపిస్తున్నాయట. ఇది మహిళలకు ఇబ్బందిగా మారుతోందట. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద జరుగుతున్న సంఘటనలు అత్యాచారాలు ఘోరాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యానికి దారితీస్తున్నాయి. ఇలాంటి వైఫల్యాలు అన్నీ కూడా వైసిపి పార్టీకి నోరు విప్పెలా చేస్తున్నాయి. అంతేకాకుండా సీనియర్ నేతలు కూడా ఒక్కొక్కరు టిడిపి పార్టీని వీడుతూ ఉన్నట్లు సమాచారం. మరి కూటమి సర్కార్ ఆలోచించి అడుగులు వేస్తుందా లేకపోతే ఏం చేస్తుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆంధ్రాలో మద్యపాన నిషేధం ఉన్న సమయంలో మేము అలా చేసేవాళ్లం.. కృష్ణవంశీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>