MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/orange-movie85a09b9f-de37-4f17-9f3f-f45f9d65814e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/orange-movie85a09b9f-de37-4f17-9f3f-f45f9d65814e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రకాల సినిమాలు వస్తున్నాయి. కొన్ని సినిమాలు వస్తే... రొమాంటిక్ యాంగిల్స్ లో వస్తాయి. అలాగే యాక్షన్, క్రైమ్ అలాగే హారర్ సినిమాలు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు ప్రేమ స్టోరీ తో వచ్చి సక్సెస్ అవుతుంటే మరికొన్ని అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. అచ్చం అలాగే ఆరెంజ్ సినిమా కూడా... నెగిటివ్ మూడు లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. దీంతో ఆరెంజ్ సినిమా డిజాస్టర్ గా మారింది. orange movie{#}prema;Romantic;Raccha;Love Story;Ram Charan Teja;bhaskar;Baba Bhaskar;Love;Success;November;Tollywood;Heroine;Cinemaఆరెంజ్ కొంపముంచిన జెనీలియా...ఆ హీరోయిన్ ఉంటేనా ?ఆరెంజ్ కొంపముంచిన జెనీలియా...ఆ హీరోయిన్ ఉంటేనా ?orange movie{#}prema;Romantic;Raccha;Love Story;Ram Charan Teja;bhaskar;Baba Bhaskar;Love;Success;November;Tollywood;Heroine;CinemaSun, 03 Nov 2024 10:16:00 GMT
* ఆరెంజ్ సినిమాతో జెనీలియా పై విమర్శలు
* ఆరెంజ్ లో చరణ్ సరసన జెనీలియా
* లవ్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఆరెంజ్


 
టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక రకాల సినిమాలు వస్తున్నాయి. కొన్ని సినిమాలు వస్తే... రొమాంటిక్ యాంగిల్స్ లో వస్తాయి. అలాగే యాక్షన్, క్రైమ్ అలాగే హారర్ సినిమాలు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు ప్రేమ స్టోరీ తో వచ్చి సక్సెస్ అవుతుంటే మరికొన్ని అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. అచ్చం అలాగే ఆరెంజ్ సినిమా కూడా... నెగిటివ్ మూడు లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. దీంతో ఆరెంజ్ సినిమా డిజాస్టర్ గా మారింది.

 ఈ సినిమాకు నాగేంద్రబాబు నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేయగా... ఆయన సరసన జెనీలియా హీరోయిన్ గా చేసింది. 2010 నవంబర్ 26వ తేదీన ఆరెంజ్ సినిమా రిలీజ్ అయింది. అదే భారీ అంచనాల నేపద్యంలో రిలీజ్ అయిన ఆరెంజ్ సినిమా.... బాక్సాఫీస్ ముందు అట్టర్ ఫ్లాప్ కావడం జరిగింది.

 ఈ సినిమా కేవలం 22.1 కోట్లు మాత్రమే సంపాదించగలిగింది. ఆరెంజ్ సినిమా స్టోరీ బాగున్నప్పటికీ... నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన జెనీలియా పాత్ర పైన...  అప్పట్లో నెగిటివ్ టాక్ వచ్చింది. ఆమెపై దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఈ సినిమాలో చిన్న పిల్లలాగా జెనీలియా చేసిందని... ఆమె కు పాత్ర అస్సలు సెట్ కాలేదని... అప్పట్లో రచ్చ రచ్చ  చేశారు సినీ అభిమానులు.


ఈ సినిమాలో జెనీలియా కంటే... వేరే హీరోయిన్ ను పెడితే బాగుండేదని కూడా కొంతమంది అన్నారు. రామ్ చరణ్ తో.. చేసే రొమాన్స్ లో.. జెనీలియా అట్టర్ ఫ్లాప్ అయింది. అలాగే సెంటిమెంట్ సీన్లలో కూడా... జెనీలియా పర్ఫామెన్స్  పెద్దగా సెట్ కాలేదు. అంతేకాకుండా రాంచరణ్ తో డాన్స్ చేయడంలో కూడా... పెద్దగా జెనీలియా సెట్ కాలేదని చెప్పవచ్చు. ఇలా జెనీలియా పాత్ర కారణంగా సినిమాకే నెగిటివ్ టాక్ వచ్చింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కంటెంట్ లేక కష్టపడుతున్న పుష్ప 2 యూనిట్.. మొదట ఆ తప్పు చేసి ఉండాల్సింది కాదు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>