MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayyad2065117-3938-4fce-9958-982915ae6722-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/balayyad2065117-3938-4fce-9958-982915ae6722-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పటివరకు ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే బాలయ్యకు అద్భుతమైన విజయాలు అందించిన దర్శకులలో బి గోపాల్ ఒకరు. బాలకృష్ణ హీరోగా రూపొందిన లారీ డ్రైవర్ , రౌడీ ఇన్స్పెక్టర్ , సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు , పలనాటి బ్రహ్మనాయుడు అనే సినిమాలకు గోపాల్ దర్శకత్వం వహించాడు. ఇందులో లారీ డ్రైవర్ , రౌడీ ఇన్స్పెక్టర్ మూవీలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోగా , సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు ఇండస్ట్రీ హిట్లను అందుకున్నాయి. పలనాటి బ్రహ్మనాయుడుBalayya{#}b gopal;indra;krishna;Driver;lion;Narasimha Naidu;Paruchuri Gopala Krishna;Aswani Dutt;Bolla Brahmanaidu;Rowdy Inspector;Simha;Industry;Chiranjeevi;Blockbuster hit;Box office;Tollywood;Balakrishna;Cinemaబాలయ్య వల్ల ఆ హీరోతో సినిమానే వద్దనుకున్న దర్శకుడు.. కానీ ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు..?బాలయ్య వల్ల ఆ హీరోతో సినిమానే వద్దనుకున్న దర్శకుడు.. కానీ ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు..?Balayya{#}b gopal;indra;krishna;Driver;lion;Narasimha Naidu;Paruchuri Gopala Krishna;Aswani Dutt;Bolla Brahmanaidu;Rowdy Inspector;Simha;Industry;Chiranjeevi;Blockbuster hit;Box office;Tollywood;Balakrishna;CinemaSun, 03 Nov 2024 16:10:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పటివరకు ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే బాలయ్యకు అద్భుతమైన విజయాలు అందించిన దర్శకులలో బి గోపాల్ ఒకరు. బాలకృష్ణ హీరోగా రూపొందిన లారీ డ్రైవర్ , రౌడీ ఇన్స్పెక్టర్ , సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు , పలనాటి బ్రహ్మనాయుడు అనే సినిమాలకు గోపాల్ దర్శకత్వం వహించాడు. ఇందులో లారీ డ్రైవర్ , రౌడీ ఇన్స్పెక్టర్ మూవీలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోగా , సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు ఇండస్ట్రీ హిట్లను అందుకున్నాయి. పలనాటి బ్రహ్మనాయుడు సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇది ఇలా ఉంటే గోపాల్ , బాలకృష్ణ హీరోగా సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు అనే సినిమాలను ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందించాడు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా గోపాల్ దర్శకత్వంలో అశ్వినీ దత్ ఓ మూవీని సెట్ చేశాడట. ఇక చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథతో సినిమా చేయమని ఆయనకు ఆఫర్ వచ్చిందట. దానితో చిన్న కృష్ణ దగ్గర ఉన్న కథను మొత్తాన్ని గోపాల్ విన్నాడట. కథ మొత్తం విన్న తర్వాత చిరంజీవితో ఆ కథతో అస్సలు సినిమా చేయద్దు అనుకున్నాడట. ఆ తర్వాత ఒక రోజు పరుచూరి గోపాలకృష్ణ నువ్వు ఎందుకు ఆ కథతో సినిమా చేయను అంటున్నావు అని అడిగాడట. దానితో ఆయన నేను ఇప్పటికే బాలకృష్ణతో సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు అనే రెండు ఫ్యాక్షన్ సినిమాలు చేశాను.

మరోసారి అలాంటి కథనే సినిమా చేస్తే వర్కౌట్ అవుతుందో ... కాదో అందుకే నేను చిరంజీవితో ఆ కథతో సినిమా చేయను అన్నాడట. దానితో ఆయన నువ్వు బాలకృష్ణ తో చేసావ్ చిరంజీవితో కాదు. ఈ కథతో చిరంజీవితో సినిమా చెయ్ మంచి విజయం అందుకుంటుంది అన్నాడట. ఆయన మాటలకు కన్విన్స్ అయ్యి గోపాల్ , చిరంజీవితో సినిమా చేశాడట. ఆ మూవీనే ఇంద్ర. ఇక ఇంద్ర సినిమా ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏకంగా ప్రభాస్ బ్యూటీతో స్టెప్పులేయ్యనున్న తేజ సజ్జ.. ఈ అప్డేట్తో అంచనాలు అమాంతం పెరగాల్సిందేనా..?

వైరల్: నెటిజన్ చేసిన పనికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మృణాల్.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>