MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/surya87cb9a08-2629-421d-a050-6739e3556a4a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/surya87cb9a08-2629-421d-a050-6739e3556a4a-415x250-IndiaHerald.jpgతమిళ హీరో సూర్య గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తమిళంలోనే కాకుండా తెలుగులోను ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లోక నాయకుడు కమలహాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న హీరో సూర్య అనే చెప్పవచ్చు. గజిని సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు సూర్య. ఇప్పుడు ఏకంగా టైర్ టు రేంజ్ హీరోలకు పోటీగా తన సినిమాలతో వస్తున్నాడు. surya{#}jyothika;surya sivakumar;Chennai;Ghajini;Rajani kanth;Romantic;Director;Love Story;Telugu;prema;Hero;Love;marriageసినిమా రేంజ్‌ లో లవ్‌ స్టోరీ..సూర్యకు జ్యోతికనే ప్రపోజ్‌ చేసిందా ?సినిమా రేంజ్‌ లో లవ్‌ స్టోరీ..సూర్యకు జ్యోతికనే ప్రపోజ్‌ చేసిందా ?surya{#}jyothika;surya sivakumar;Chennai;Ghajini;Rajani kanth;Romantic;Director;Love Story;Telugu;prema;Hero;Love;marriageSat, 02 Nov 2024 09:44:00 GMTతమిళ హీరో సూర్య గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తమిళంలోనే కాకుండా తెలుగులోను ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లోక నాయకుడు కమలహాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న హీరో సూర్య అనే చెప్పవచ్చు. గజిని సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు సూర్య. ఇప్పుడు ఏకంగా టైర్ టు రేంజ్ హీరోలకు పోటీగా తన సినిమాలతో వస్తున్నాడు.


తమిళంలోనే కాకుండా తెలుగులోనూ స్టార్ హీరోలకు గట్టి పోటీని ఇస్తూ తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను కోల్లగోడుతున్నాడు. ఇదిలా ఉండగా.... హీరో సూర్య, నటి జ్యోతికలు ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ దంపతులకు దియా-దేవ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరిద్దరూ ఎంతోమంది జంటలకు ఆదర్శం అనే చెప్పవచ్చు. వీరు వారి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటూ తమ కుటుంబ సభ్యులతో కాలాన్ని గడుపుతున్నారు.


ఇటీవలే సూర్య జ్యోతిక వారి కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యారు. కాగా, సూర్యతో లవ్ స్టోరీ గురించి జ్యోతిక మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. మేము మొదటిసారి పూవెల్లమ్ కెట్టుప్పర్ అనే సినిమాలో కలిసి నటించాము. నాతో సూర్య అప్పుడు చాలా క్యాజువల్ గా మాట్లాడాడు. ఆ తర్వాత మేమిద్దరం కలిసి ఏడు సినిమాల్లో నటించాం. ఎవరైనా డైరెక్టర్ ఓ సినిమాలో రొమాంటిక్ సీన్ వివరించినప్పుడు సూర్య అప్పటి వరకు మాత్రమే నటించేవాడు. దానిని చాలా సింపుల్గా తీసుకునేవాడు కాదు. ఆ గౌరవమే నన్ను చాలా ఆకర్షించింది.


ఇక అప్పటికే నేను పదేళ్లపాటు సినిమాలలో నటించి నాకు అవసరమైనంత డబ్బులను సంపాదించాను. ఆ సమయంలో సూర్య నాకు ప్రపోజ్ చేశాడు. నా కుటుంబం కూడా సూర్య ప్రేమను అంగీకరించింది. ఆ సమయంలో ఎక్కువగా ఆలోచించకుండా తొందరగా వివాహం చేసుకున్నాము. ప్రేమ పక్షులలా ఎక్కువ కాలం ఎదురు చూడలేదు. బయట ఎక్కడా కూడా కలిసి తిరిగిందే లేదు. అందుకే మా లవ్ స్టోరీ మాకే బోరింగ్ గా అనిపిస్తుందని జ్యోతిక చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వీరి ప్రేమ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా వీరి ప్రేమ, పెళ్లి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కొత్త కోడలు పిల్ల కోసం నాగ్ మామ అద్దిరిపోయే గిఫ్ట్.. ఎన్ని కోట్లో ఖర్చు చేశాడో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>