MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samanthacddad3ed-d1d3-43ca-b2f9-22c388436109-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samanthacddad3ed-d1d3-43ca-b2f9-22c388436109-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఇప్పుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ప్రేమ, పెళ్లి గురించే అందరూ చర్చించుకుంటున్నారు. దీనికి కారణం.. సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత.. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి చేసుకోవడమే. వాస్తవంగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉండి కుటుంబ సభ్యులను ఒప్పించుకొని ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. వీరి వివాహం త్వరలోనే జరగనుంది. Samantha{#}Naga Chaitanya;Samantha;shobitha;February;December;News;prema;marriage;Loveచైతూ-శోభితా ప్రేమ మధురమే....కానీ సమంత జీవితమే నాశనం ?చైతూ-శోభితా ప్రేమ మధురమే....కానీ సమంత జీవితమే నాశనం ?Samantha{#}Naga Chaitanya;Samantha;shobitha;February;December;News;prema;marriage;LoveSat, 02 Nov 2024 09:07:00 GMTటాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఇప్పుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ప్రేమ, పెళ్లి గురించే అందరూ చర్చించుకుంటున్నారు. దీనికి కారణం.. సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత.. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి చేసుకోవడమే. వాస్తవంగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉండి కుటుంబ సభ్యులను ఒప్పించుకొని ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. వీరి వివాహం త్వరలోనే జరగనుంది.


ఇదిలా ఉండగా...  సమంత, నాగచైతన్య 2017 లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో అంగరంగ వైభవంగా వారి వివాహాన్ని జరిపించుకున్నారు. వివాహ అనంతరం ఎంతో అన్యోన్యంగా కొనసాగిన వారి వైవాహిక జీవితం అతి తక్కువ సమయంలోనే ముగింపు పలికింది. ఏవో గొడవల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరు 2021లో విడాకులు తీసుకున్నారు.


అయితే విడాకుల అనంతరం నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ అప్పటి నుంచే సీక్రెట్ గా వారి ప్రేమను కొనసాగిస్తున్నారు. బయట కొన్ని సందర్భాలలో కెమెరా కంట చిక్కినప్పటికీ వారి ప్రేమ విషయాన్ని అసలు బయట పెట్టలేదు. ఎట్టకేలకు ఆగస్టు 8వ తేదీన అతి కొద్దిమంది బంధువుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇక వీరి వివాహం డిసెంబర్ లేదా ఫిబ్రవరి నెలలో జరిపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారట.


ఇప్పటికే వీరి వివాహానికి సంబంధించి పనులను కూడా ప్రారంభించినట్లు సమాచారం అందుతుంది. విదేశాలలో వీరి వివాహాన్ని జరిపించాలని ప్లాన్ లో ఉన్నారట. ఎంగేజ్మెంట్ అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో జరిపించినందు వల్ల వీరి వివాహాన్ని గ్రాండ్గా జరిపించాలని కుటుంబ సభ్యులు ప్లాన్ లో ఉన్నారట. విడాకుల తర్వాత సమంత ఇప్పటికీ సింగిల్ గానే ఉంది. ఒకానొక సమయంలో సమంత తన ప్రేమ గురించి చెబుతూ ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్నామని చెప్పింది. తన జీవితంలో మరో వ్యక్తికి చోటు లేదని వెల్లడించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చైతూ-శోభితా ప్రేమ మధురమే....కానీ సమంత జీవితమే నాశనం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>