MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pan-india-heroesb0e85c47-86fe-4d61-a8df-183158d29c85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pan-india-heroesb0e85c47-86fe-4d61-a8df-183158d29c85-415x250-IndiaHerald.jpgఇప్పుడూ వీళ్ళ సినిమాల టేకప్ చూస్తే ప్రొడ్యూసర్లకు కనక వర్షమే .. సినిమా సినిమాకు తమ రేంజ్ను పెంచుకుంటూ వెళ్తున్నారు ఈ నలుగురు హీరోలు. ఇక మన ఇండియాలో ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు 1000 కోట్ల మూవీ అని అందరూ డిసైడ్ అయిపోయారు. బాలీవుడ్ హీరోల హిట్ సినిమాలకు ప్రభాస్ ఫ్లాప్ సినిమాకు వసూళ్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. కల్కి సినిమాతో 1200 కోట్ల వసూళ్లు సాధించి ఎవరికి అందని ఎత్తులో ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టి పాన్ ఇండియా లెవెల్ లో స్టార్‌ హీరోలకు సవాల్ చేస్తున్నాడు. Pan India heroes{#}krishnam raju;Dalapathi;Eshwar;Raghavendra;vijay kumar naidu;NTR;Joseph Vijay;Prabhas;Allu Arjun;Hero;Audience;India;Tamil;bollywood;Cinemaపాన్ ఇండియాలో అలాంటి హీరోలు నలుగురే.. దేవర మాత్రం ఒక్కడు..!పాన్ ఇండియాలో అలాంటి హీరోలు నలుగురే.. దేవర మాత్రం ఒక్కడు..!Pan India heroes{#}krishnam raju;Dalapathi;Eshwar;Raghavendra;vijay kumar naidu;NTR;Joseph Vijay;Prabhas;Allu Arjun;Hero;Audience;India;Tamil;bollywood;CinemaSat, 02 Nov 2024 13:26:24 GMTఇక మన భారతీయ సినిమా పరిశ్రమలో ఇప్పుడు నలుగు హీరోలు ఓ సెన్సేషన్.. వారి పేరు చెబితే అభిమానులకు పూనకాలు.. అలాగే బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయం. వారు సినిమాలు అనౌన్స్ చేస్తే రికార్డులకు దడ పుడుతుంది. ఇక ఇంతకు ఆ నలుగురు హీరోలు ఎవరో మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది.. ఇంతకీ ఆ హీరోలు మరెవరో కాదు రెబల్ స్టార్ ప్రభాస్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , దళపతి విజయ్.. ఇప్పుడూ వీళ్ళ సినిమాల టేకప్  చూస్తే ప్రొడ్యూసర్లకు కనక వర్షమే .. సినిమా సినిమాకు తమ రేంజ్ను పెంచుకుంటూ వెళ్తున్నారు ఈ నలుగురు హీరోలు.  ఇక మన ఇండియాలో ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు 1000 కోట్ల మూవీ అని అందరూ డిసైడ్ అయిపోయారు. బాలీవుడ్ హీరోల హిట్ సినిమాలకు ప్రభాస్ ఫ్లాప్ సినిమాకు వసూళ్లు దాదాపు ఒకేలా ఉన్నాయి. కల్కి సినిమాతో 1200 కోట్ల వసూళ్లు సాధించి ఎవరికి అందని ఎత్తులో ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టి పాన్ ఇండియా లెవెల్ లో స్టార్‌ హీరోలకు సవాల్ చేస్తున్నాడు.


ఇక అలాగే మ్యాన్ ఆఫ్ మ‌స్‌ ఎన్టీఆర్ విషయానికొస్తే దేవర సినిమాతో పాన్ ఇండియా హీరోల సినిమాలకు కొత్త టార్గెట్ ఫిక్స్ చేశాడు. ఇప్పుడు బాలీవుడ్ లో ప‌గా వెయ్యడానికి చూస్తున్నాడు. మరో హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో తన రేంజ్ మారిపోయింది. పుష్ప2 తో ఇప్పుడు దుమ్మురేపాలని రికార్డులు బద్దలు కొట్టాలని తన టార్గెట్ గా పెట్టుకున్నాడు. మరో స్టార్ హీరో దళపతి విజయ్ విషయానికి వస్తే మన భారతదేశంలోనే 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని ఒకే ఒక్క హీరో విజయ్. అలాగే విజయ్ తో సినిమా అంటే తమిళ డైరెక్టర్లకు పెద్ద ఛాలెంజ్. అయితే ఇప్పుడు ఈ నలుగురు హీరోల్లో ఓ కామన్ పాయింట్ ఉంది.


వీరు సినిమాల్లో అడుగుపెట్టిన తర్వాత వీళ్ళ లుక్స్ గురించి ఎన్నో కామెంట్లు వచ్చేవి. చూడ్డానికి అందంగా లేరని చిత్ర పరిశ్ర‌మ‌లో ఉన్నవారు వీరుపై కామెంట్లు చేసేవారు. అయితే విజయ్ కెరీర్ స్టార్ట్ చేసిన సమయంలో నల్లగా ఉండేవాడు. ఆ టైం లో అతని గురించి తమిళ జనాలే కామెంట్ చేసారు. ఇక ప్రభాస్ ను ఈశ్వర్ సినిమా టైం లో చాలా కామెంట్స్ చేసారు. రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్ లుక్స్ ను ఆడియన్స్ కూడా కామెంట్ చేసేవాళ్ళు. ఎన్టీఆర్ విషయానికి వస్తే అప్పట్లో చాలా లావుగా ఉండేవాడు. ఆ టైం లో ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి… అసలు హీరోగా పనికిరాడు అంటూ ఓ వర్గం బాగా టార్గెట్ చేసారు. ఇక అల్లు అర్జున్ గంగోత్రి సమయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ క్లిప్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే ఉంటారు. ఇలా ఒకప్పుడు దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నఈ  నలుగురు హీరోలు ఇప్పుడు బాక్సాఫీస్ కు దిక్కు అయ్యారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పాన్ ఇండియాలో అలాంటి హీరోలు నలుగురే.. దేవర మాత్రం ఒక్కడు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>