Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasd2970198-796f-47d7-a28b-4bd819d406e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasd2970198-796f-47d7-a28b-4bd819d406e6-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. కానీ ఆ తర్వాత మాత్రం ప్రభాస్ హిట్టు కొట్టడానికి చాలా సమయమే పట్టింది. ఎన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవి పెద్దగా విజయం సాధించలేదు. కానీ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అయితే ఈ మూవీకి సీక్వల్ ఉంటుందprabhas{#}prashanth neel;Prasanth Neel;Bahubali;Blockbuster hit;Prabhas;Darsakudu;Director;India;Cinema;Newsఎక్కడో తేడా కొడుతుంది సీనా.. ప్రశాంత్ నీల్ లేకుండానే సలార్-2 షూటింగ్?ఎక్కడో తేడా కొడుతుంది సీనా.. ప్రశాంత్ నీల్ లేకుండానే సలార్-2 షూటింగ్?prabhas{#}prashanth neel;Prasanth Neel;Bahubali;Blockbuster hit;Prabhas;Darsakudu;Director;India;Cinema;NewsSat, 02 Nov 2024 15:00:00 GMTపాన్ ఇండియా స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా ప్రభాస్ క్రేజ్ పెరిగిపోయింది. కానీ ఆ తర్వాత మాత్రం ప్రభాస్ హిట్టు కొట్టడానికి చాలా సమయమే పట్టింది. ఎన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవి పెద్దగా విజయం సాధించలేదు. కానీ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.


 అయితే ఈ మూవీకి సీక్వల్ ఉంటుందని అటు అభిమానులు అందరూ కూడా తెగ మురిసిపోయారు. కానీ ఆ తర్వాత సీక్వెల్ క్యాన్సిల్ అయింది అంటూ వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అటు సీక్వెల్ షూటింగ్ ప్రారంభమైంది అంటూ మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు ఎంతో ఆనందంలో ముంగిపోయారు. అయితే ఇక ఇప్పుడు ప్రభాస్, ప్రశాంత్ నీల్ లేకుండానే సలార్ 2 షూటింగ్ జరుగుతుందట. ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సలార్ 2 షూట్లో కేవలం చిన్నారులతో కొన్ని సన్నివేశాలను మాత్రమే చిత్రీకరించారు.


 ప్రశాంత్ నీల్ లేకుండానే ఈ సీన్లు షూట్ చేసినట్లు తెలుస్తోంది. తన అసిస్టెంట్ కి ఈ బాధ్యతలను అప్పగించాడట డైరెక్టర్ ప్రశాంత్. అయితే సలార్-2 లాంటి భారీ ప్రాజెక్ట్ ని ఇలా దర్శకుడు లేకుండా సన్నివేశాలు చిత్రీకరించడం మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏదైనా తేడా కొడితే చివరికి నిర్మాతలకు భారీగా నష్టాలు వస్తాయని.. భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. కాగా ఒక వైపు ప్రభాస్ రాజా సాబ్, ఫౌజి సినిమాలపై ఫోకస్ పెట్టగా.. ఇంకోవైపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో భారీ బడ్జెట్ చిత్రానికి కమిట్ అయ్యాడు. దీంతో సలార్-2 పై ఫుల్ గా ఫోకస్ చేయడం లేదు అని తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కిరణ్ అబ్బవరం ఆఖరి 8 సినిమాల పరిస్థితి ఇది.. అందులో ఆ సినిమానే టాప్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>