MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/venkey3ff53b57-b9fb-4156-b42b-dcc3b8ee8ddb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/venkey3ff53b57-b9fb-4156-b42b-dcc3b8ee8ddb-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఐశ్వర్య రాజేష్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నటి భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. కానీ ఈ సినిమాలో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత ఈమెకు కొన్నిVenkey{#}kausalya;World Famous Lover;aishwarya rajesh;vijay deverakonda;Tollywood;Telugu;Tamil;anil ravipudi;dil raju;Venkatesh;Sri Venkateshwara Creations;Makar Sakranti;Cinemaవెంకీ పై గంపడాశలు పెట్టుకున్న ఆ బ్యూటీ.. సక్సెస్ అయితే తిరుగులేనట్లే..?వెంకీ పై గంపడాశలు పెట్టుకున్న ఆ బ్యూటీ.. సక్సెస్ అయితే తిరుగులేనట్లే..?Venkey{#}kausalya;World Famous Lover;aishwarya rajesh;vijay deverakonda;Tollywood;Telugu;Tamil;anil ravipudi;dil raju;Venkatesh;Sri Venkateshwara Creations;Makar Sakranti;CinemaSat, 02 Nov 2024 23:45:00 GMTకోలీవుడ్ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఐశ్వర్య రాజేష్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నటి భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. కానీ ఈ సినిమాలో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత ఈమెకు కొన్ని సినిమాలలో అవకాశాలు వచ్చాయి.

ఇక అలా కెరియర్ను ముందుకు సాగిస్తున్న సమయంలో ఈమె టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దానితో ఈమెకు కూడా ఈ సినిమా ద్వారా పెద్దగా క్రేజ్ దక్కలేదు. ఇకపోతే ఈమె ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ వస్తుంది. ఇప్పటివరకు ఈమె తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన ఈమెకు ఏ మూవీ ద్వారా కూడా అదిరిపోయే రేంజ్ విజయం దక్కలేదు. ప్రస్తుతం ఈ నటి విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు.

ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లయితే ఐశ్వర్య రాజేష్ కి తెలుగులో అదిరిపోయే రేంజ్ క్రేజ్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అలాగే ఆ తర్వాత భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు వచ్చే ఛాన్స్ కూడా చాలా వరకు ఉంది. మరి ఈ సినిమాతో ఐశ్వర్య రాజేష్ కి ఎలాంటి విజయం దక్కుతుందో ... ఏ స్థాయి క్రేజ్ వస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వెంకీ పై గంపడాశలు పెట్టుకున్న ఆ బ్యూటీ.. సక్సెస్ అయితే తిరుగులేనట్లే..?

వైరల్: నెటిజన్ చేసిన పనికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మృణాల్.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>