PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdpab412eb4-40f0-417d-8938-292fb3d8ee14-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdpab412eb4-40f0-417d-8938-292fb3d8ee14-415x250-IndiaHerald.jpgజనసేన - బీజేపీతో పొత్తు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు కీలక నేతలకు కూడా ఈ ఎన్నికలలో సీట్లు దక్కలేదు. ఇలాంటి వారిలో మాజీ మంత్రులు ఆలపాటి రాజా, దేవినేని ఉమాతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత ప్రస్తుత పలనాడు జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ కూడా ఉన్నారు. అయితే వీరిలో ఇప్పుడు మాజీ మంత్రి ఆలపాటి రాజాకు చంద్రబాబు న్యాయం చేస్తున్నారు. గుంటూరు - కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆtdp{#}sridhar;Krishna River;Rajya Sabha;krishna district;Mylavaram;Pedakurapadu;Lokesh;Lokesh Kanagaraj;devineni avinash;District;Telugu Desam Party;praveen;krishna;Janasena;MP;raja;MLA;YCP;CBN;Party;Minister;Guntur;Yevaruటీడీపీకి ఆల‌పాటి ముద్దు.. కొమ్మాల‌పాటి ఓకే... దేవినేని వ‌ద్దే వ‌ద్దా...?టీడీపీకి ఆల‌పాటి ముద్దు.. కొమ్మాల‌పాటి ఓకే... దేవినేని వ‌ద్దే వ‌ద్దా...?tdp{#}sridhar;Krishna River;Rajya Sabha;krishna district;Mylavaram;Pedakurapadu;Lokesh;Lokesh Kanagaraj;devineni avinash;District;Telugu Desam Party;praveen;krishna;Janasena;MP;raja;MLA;YCP;CBN;Party;Minister;Guntur;YevaruFri, 01 Nov 2024 10:29:35 GMTఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్నో త్యాగాలు చేసి అధికారంలోకి వచ్చింది. జనసేన - బీజేపీతో పొత్తు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రులు కీలక నేతలకు కూడా ఈ ఎన్నికలలో సీట్లు దక్కలేదు. ఇలాంటి వారిలో మాజీ మంత్రులు ఆలపాటి రాజా, దేవినేని ఉమాతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత ప్రస్తుత పలనాడు జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ కూడా ఉన్నారు. అయితే వీరిలో ఇప్పుడు మాజీ మంత్రి ఆలపాటి రాజాకు చంద్రబాబు న్యాయం చేస్తున్నారు. గుంటూరు - కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆలపాటి రాజా పేరు ఖరారు చేశారు. ఆయన ఇప్పటికే విస్తృతంగా పర్యటిస్తున్నారు.


ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఆలపాటి రాజా పేరు తెలుగుదేశం పార్టీలో ఖరారు చేశారు. ఇక పెదకూరపాడు సీటు వదులుకున్న కొమ్మలపాటి శ్రీధర్ కు బహిరంగంగానే చంద్రబాబు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని హామీ ఇచ్చారు. తాను ఎక్కడ ? ఎవరికి హామీ ఇవ్వలేదని భాష్యం ప్రవీణ్‌ను గెలిపించుకొని వస్తే కొమ్మలపాటికీ ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు చెప్పారు. భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కొమ్మలపాటికి త్వరలోనే ఎమ్మెల్సీకి లైన్ క్లియర్ చేస్తున్నారు. అటు ఆలపాటి రాజాకు.. కొమ్మలపాటి శ్రీధర్ కు గుంటూరు జిల్లాలో లైన్ క్లియర్ అవుతుంది.


అయితే కృష్ణా జిల్లా తెలుగుదేశం రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి దేవినేని ఉమా పరిస్థితి ఇప్పుడు ఆగమ్య గోచరంగా ఉంది. అసలు ఉమా పేరు చంద్రబాబు, లొకేష్‌ ఎవరు ఎత్తటం లేదని తెలుస్తోంది. ఉమా లాంటి నేతను పక్కన పెట్టి వైసిపి నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్‌కు ఎమ్మెల్యే సీటు ఇవ్వడం ఆయన మైలవరం ఎమ్మెల్యేగా గెలవడం జరిగిపోయాయి. ఉమాకు ఎంపీ సీటు లేదా రాజ్యసభ ఇచ్చే పరిస్థితి లేదు.. కనీసం ఎమ్మెల్సీ ఇద్దామనుకుంటే.. క‌మ్మ ఎమ్మెల్సీలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆ ఛాన్స్ కూడా లేదని తెలుస్తోంది.


అటు లోకేష్ కూడా ఉమా విషయంలో అంతా సుముఖంగా లేరని ప్రచారం జరుగుతుంది. ఉమా విష‌యంలో కృష్ణా జిల్లా టీడీపీ వాళ్లే తెలియ‌కుండా కావాల్సిన‌న్ని కంప్లైంట్లు అధిష్టానం ద‌గ్గ‌ర పెడుతున్నార‌ట‌. ఏది ఏమైనా ఆలపాటి, కొమ్మాల‌పాటి ముద్దే ముద్దు అంటున్న చంద్రబాబు... లోకేష్ ఉమా విష‌యంలో కాస్త లైట్‌గానే ఉన్నారా ? అన్న గుసగుసలు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నాగార్జున కెరీర్‌ మార్చేసిన "అన్నమయ్య"...ఎవరికీ దక్కని పుణ్యమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>