MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/gabbar-singh-movie-pawan-kalyan-chiranjeevi-sruti-haasan-harish-shankare0d6bb24-b893-41b0-a8b9-54ae0a59d1d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/gabbar-singh-movie-pawan-kalyan-chiranjeevi-sruti-haasan-harish-shankare0d6bb24-b893-41b0-a8b9-54ae0a59d1d7-415x250-IndiaHerald.jpgమెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఉన్నారు. వారందరి ఫ్యాన్స్ ఒక లెక్క అయితే మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరో లెక్క అనేలా ఉంటారు. ఎందుకంటే జనాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఆ విధంగా ఉంటుంది. కొణిదెల పవన్ కళ్యాణ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తొలిప్రేమ,బద్రి, తమ్ముడు, ఖుషి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన పవన్ కళ్యాణ్ కు ఎంతో పేరు వచ్చింది. ఆ తర్వాత జానీ సినిమా నుంచి దాదాపు పది సంవత్సరాలపాటు పవన్ కళ్యాణ్ కిహిట్లు లేక సతమతమయ్యారు. ఇక ఆయన కెరియర్ ముగుస్తుంది అన్న సమయంలో వచ్చింది ఈGABBAR SINGH MOVIE; PAWAN KALYAN; CHIRANJEEVI; SRUTI HAASAN; HARISH SHANKAR{#}Nathalia Kaur;johnny;kushi;parvathi;Kushi;Dabang 3;Konidela Production;dhabhang;Dabangg;Nagababu;Gabbar Singh;Johnny;Shruti Haasan;Chitram;Pawan Kalyan;harish shankar;kalyan;Yevaru;Salman Khan;Director;Cinemaగబ్బర్ సింగ్: పవన్ కళ్యాణ్ ని చూసి అసూయపడ్డ చిరంజీవి.. కట్ చేస్తే థియేటర్ లో ప్రభంజనం.?గబ్బర్ సింగ్: పవన్ కళ్యాణ్ ని చూసి అసూయపడ్డ చిరంజీవి.. కట్ చేస్తే థియేటర్ లో ప్రభంజనం.?GABBAR SINGH MOVIE; PAWAN KALYAN; CHIRANJEEVI; SRUTI HAASAN; HARISH SHANKAR{#}Nathalia Kaur;johnny;kushi;parvathi;Kushi;Dabang 3;Konidela Production;dhabhang;Dabangg;Nagababu;Gabbar Singh;Johnny;Shruti Haasan;Chitram;Pawan Kalyan;harish shankar;kalyan;Yevaru;Salman Khan;Director;CinemaFri, 01 Nov 2024 09:08:00 GMT-10ఏళ్ల ప్లాప్స్ ని గబ్బర్ సింగ్ తిరగరాసిందా..
-పవనుడి ఇమేజ్ ఆకాశానికి ఎత్తేసిన మూవీ..
- కొణిదెల పవన్ కళ్యాణ్ నుంచి పవర్ స్టార్ గా మార్పు..
- గబ్బర్ సింగ్ సినిమా వెనుక అసలు కథ ఇదే..

మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఉన్నారు. వారందరి ఫ్యాన్స్ ఒక లెక్క అయితే మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరో లెక్క అనేలా ఉంటారు. ఎందుకంటే జనాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఆ విధంగా ఉంటుంది. కొణిదెల పవన్ కళ్యాణ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తొలిప్రేమ,బద్రి, తమ్ముడు, ఖుషి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన పవన్ కళ్యాణ్ కు ఎంతో పేరు వచ్చింది. ఆ తర్వాత జానీ సినిమా  నుంచి దాదాపు పది సంవత్సరాలపాటు పవన్ కళ్యాణ్ కిహిట్లు లేక సతమతమయ్యారు. ఇక ఆయన కెరియర్ ముగుస్తుంది అన్న సమయంలో వచ్చింది ఈ మూవీ. ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే గబ్బర్ సింగ్..  ఈ చిత్రం తర్వాత పవన్ కెరియర్ ఎక్కడికో పోయింది.. అద్భుతమైన హిట్ సాధించి ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది.  ఈ చిత్రం పవన్ కళ్యాణ్ ను వరించడం వెనుక ఉన్న కథ ఏంటో చూద్దాం.

 ది గ్రేట్ డైరెక్టర్  హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన మూవీ గబ్బర్ సింగ్. ఈ చిత్రం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాకు రీమేక్. అయితే ఈ సినిమా చూసిన తర్వాత పవన్ తెలుగులో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట.. ఇందులో చాలా సినిమాల్లో ఉన్నట్టు తల్లి కొడుకులకు అదే ఉందని కొత్తదనం ఏమీ లేదని పవన్ రిజెక్ట్ చేశారట. కానీ తన అన్న నాగబాబు అప్పులు కట్టడం కోసం ఈ సినిమా చేయవలసి వచ్చిందట. చివరికి సినిమా స్క్రిప్టులో చాలా మార్పులు చేసి  మూవీ చేశాడు. ఇందులో అంత్యాక్షరి ఆట కూడా పవన్ సొంతంగా ఇచ్చినటువంటి ఐడియా. ఇదే సినిమాకు హైలెట్ గా నిలిచాయి.. సినిమాలో ఇలియానా, పార్వతి మెల్టన్, నతాలియా కౌర్ లను హీరోయిన్లుగా అనుకున్నారు. చివరికి శృతిహాసన్ ని ఫైనల్ చేశారు.నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది అనే డైలాగ్స్ తో  దేవిశ్రీ మ్యూజిక్ తో సినిమా అద్భుతంగా తెరకెక్కింది.

 ఇక సినిమా రిలీజ్ తర్వాత ఎవరి నోట విన్నా ఇవే పాటలు ఇవే డైలాగులు. మే 11 2012న సినిమా విడుదల చేశారు. సినిమా విడుదలైన మొదటి షో తోనే మోత మోగిపోయింది. బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది అంటూ రివ్యూలు ఇచ్చారు. 30 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ దాదాపు 150 కోట్లకు పైగా వసూలు చేసింది. 65 కేంద్రాలలో వంద రోజులకు పైగా సినిమా ఆడింది. ఈ విధంగా పవన్ 10 సంవత్సరాల ఫ్లాపులతో సతమతం అవుతున్న సందర్భంలో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ పవన్ మరియు శృతిహాసన్ కెరియర్ ను ఆకాశానికి ఎత్తింది. ఇక పవన్ కళ్యాణ్ నటన విషయానికి వస్తే..ఈ సినిమాలో ఆయన తప్ప ఎవరు సెట్ కాదనిపిస్తుంది. డైలాగ్ డెలివరీ కానీ, కామెడీ,యాక్షన్, సన్నివేశాలు ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక చివర అంత్యాక్షరి ఈ సినిమా రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్ళింది. ఈ సీన్ కోసమే చాలామంది థియేటర్లకు పరుగులు తీసారట. ఈ విధంగా పవన్ నటనకు ఈ చిత్రంలో 100 మార్కులకు పైగా వేయవచ్చు అని చెప్పవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జగదేకవీరుడు అతిలోకసుందరి: మొదటి రోజే మూవీ ఫ్లాప్.. కట్ చేస్తే రికార్డుల మోత.. మూవీ వెనుక నమ్మలేని నిజాలు.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>